E-Paper
Advertisement

బిజినెస్‌ రిఫార్మర్‌ అవార్డు..మంత్రులు-అధికారులకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు.. ఆపై కీలక వ్యాఖ్యలు

బిజినెస్‌ రిఫార్మర్‌ అవార్డు..మంత్రులు-అధికారులకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు.. ఆపై కీలక వ్యాఖ్యలు
Advertisement

Amaravati: మంత్రులు, అధికారులు, ఉద్యోగుల కృషి వల్ల తనకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు వచ్చిందన్నారు సీఎం చంద్రబాబు. అసలు చెప్పాలంటే వారే నిజమైన విజేతలని అన్నారు. ఇదే సమయంలో కొన్ని కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానంలో అధికారులు అద్భుతంగా పని చేశారని గుర్తు చేశారు.

మంత్రులు-అధికారులకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు

Advertisement

బిజినెస్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2025 అవార్డు వచ్చిన సందర్భంగా మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులకు అమరావతిలోని సీఆర్‌డీఏ ఆఫీసులో ‘డిన్నర్‌ విత్‌ ది రియల్‌ విన్నర్స్‌’ పేరుతో విందు ఇచ్చారు సీఎం చంద్రబాబు. అంతేకాదు ఉత్తమ పని తీరు కనపరిచిన జిల్లా, మండల స్థాయి ఉద్యోగులను ఈ సమావేశానికి ఆహ్వానించారు.

22 నెలల్లో సాధించిన అభివృద్ధి, ప్రభుత్వ యంత్రాంగం చేసిన కృషిని ఈ సందర్భంగా వారితో పంచుకున్నారు ముఖ్యమంత్రి. విధానాల రూపకల్పన, ఫలితాలు సాధించడంలో మంత్రులు, అధికారుల సమష్టి కృషిని అభినందించారు. రాజకీయాల్లో ఎన్నో విజయాలను చూశానని, 2024 ఎన్నికల విజయాన్ని తాను ఎప్పుడూ చూడలేదన్నారు.

Advertisement

బిజినెస్‌ రిఫార్మర్‌ అవార్డు వచ్చిన సందర్భంగా అమరావతి ఈవెంట్

22 నెలల కిందట పాలన ప్రారంభించినప్పుడు వ్యవస్థలను సరి చేయడం సాధ్యం కాదేమోనని భావించానని మనసులోని మాట బయటపెట్టారు ముఖ్యమంత్రి. అందరి సహకారంతో వ్యవస్థలను గాడిలో పెట్టామని, అందువల్లే ఈ అవార్డు వచ్చిందన్నారు. తన రాజకీయ జీవితంలో చాలా మంది ప్రధానులను చూశానని, రైట్ టైమ్‌లో సరైన ప్రధానిగా మోదీ నిలిచారని గుర్తు చేశారు.

గూగుల్ సంస్థ ఏపీకి వచ్చిందంటే అందుకు కారణం ప్రధాని అని చెప్పారు. అందుకోసం నిబంధనలను సవరించారని గుర్తు చేశారు. దీనికితోడు ఆర్సెలార్‌ మిట్టల్‌ ఉక్కు కర్మాగారం రావడం వెనుక ప్రధాని చొరవ ఉందన్నారు. ఆ సంస్థ కోరినట్టుగా ముడి సరుకు రవాణాకు అన్ని అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారని చెప్పుకొచ్చారు.

ALSO READ: ఏపీ విద్యావ్యవస్థలో విప్లవం.. గ్లోబల్ వర్సిటీలతో పోటీ పడేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్

గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌మెంట్ పెడితే, రిలయన్స్‌ 17 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం. రాజకీయాలు, పరిపాలనా పరంగా తాను-పవన్‌ కల్యాణ్‌ ఎలాంటి ఇగోలకు వెళ్లకుండా కలిసి పని చేస్తున్నామని చెప్పారు.

అధికారులు కూడా విధి నిర్వహణలో ఇగోలకు పోకుండా పని చేయాలని, అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రభుత్వమే పారిశ్రామికవేత్తల వద్దకు వెళ్లి మాట్లాడాలని అలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ సందర్బంలో పలువురు మంత్రులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో రిఫార్మర్ అనే పదానికి నిజమైన నిర్వచనం సీఎం చంద్రబాబు అని పలువురు మంత్రులు చెప్పుకొచ్చారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×