E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: మీనాక్షి కోరికను తీర్చబోతున్న అవని.. పార్వతి పై అక్షయ్ కు అనుమానం.. రాజేశ్వరి సీరియస్..

Intinti Ramayanam Today Episode: మీనాక్షి కోరికను తీర్చబోతున్న అవని.. పార్వతి పై అక్షయ్ కు అనుమానం.. రాజేశ్వరి సీరియస్..
Advertisement

Intinti Ramayanam Today Episode March 28th : నిన్నటి ఎపిసోడ్ లో.. మా డాడీని అవని బాగా మార్చేసింది.. ఆరాధ్య తాతయ్య అంటూ మా డాడీ వెనకాల పడుతుంది.. ఇలానే గనక మా డాడీ ఉంటే ఆరాధ్య పేరు మీద ఆస్తి మొత్తం రాసేసి నాకు మొండి చేయి చూపిస్తాడేమో అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అవనికి ఆరాధ్యకు మా డాడీని దూరం చేయాలి ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని దూరం చేస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు అని ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన కమల్ దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు బావా దేని గురించి ఆలోచించడం లేదని పల్లవి ఎంత చెప్తున్నా సరే.. కమల్ మాత్రం అసలు నమ్మడు.. మీ నాన్న ఎక్కడ అవని వదిన పేరు మీద ఆస్తి రాసేస్తాడు అని కంగారు పడిపోతున్నావు కదా అని అంటాడు.. నేను తింగరనే కావచ్చు మరీ అంత తింగరోనైతే కాదు అని అంటాడు  కమల్. రాత్రి అన్నదమ్ములు కలిసి మందు కొట్టాలని ప్లాన్ చేసుకుంటారు. వదిన అమ్మకి తెలిస్తే ఏదైనా జరుగుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు. వదినని అమ్మని పడుకోమని చెప్పాను. ఎప్పుడో పడుకుండి పోయి ఉంటారు కూడా.. మనము హ్యాపీగా మందు తాగొచ్చు అని అనుకుంటారు అప్పుడు అక్కడికి అవని ఏవండీ అంతా పిలుస్తూ వస్తుంది.

అవని మాట విన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. ఏంటి వదిన ఇలా వచ్చావు అని అడిగితే డిస్కషన్ అన్నారు కదా కాఫీలు టీలు ఏమైనా కావాలేమో అని వచ్చాను అని అంటుంది. ఈ టైంలో కాఫీలు టీలు ఎవరు తాగుతారు వదినా మాకు అవి ఏమీ వద్దు మీరు వెళ్ళండి అని అంటారు.. తర్వాత రోజు శ్రీరామనవమి కాబట్టి ఇంట్లో పూజకి అంత సిద్ధం చేయాలి మనం గుడికి కళ్యాణం కోసం వెళ్లాలి అని చెప్తూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన చక్రధర్ ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు తీసుకుని వస్తాడు.. అది చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవని శ్రీరాముని కళ్యాణం కి తన తల్లిని పిలవడానికి భరత్ వాళ్ళ ఇంటికి వెళుతుంది. అమ్మ రేపు శ్రీరామనవమి కదా మనమందరం గుడికి వెళ్లి కళ్యాణం జరిపించాలని అనుకుంటున్నాము.. అత్తయ్య వాళ్ళు భరత్ ప్రణతిలతో పాటు నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పమన్నారు.. నీకు ఒకసారి చెప్పి వెళదామని ఇలా వచ్చాను అని అవని అంటుంది. ఆ మాట వినగానే మీనాక్షి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఏమైందమ్మా నువ్వు గుడికి వస్తావు కదా ఎందుకు అలా ఉన్నావు అని అవని అడుగుతుంది. నేను చిన్నప్పుడు భరత్ కి బాగోలేకపోతే తనని బ్రతికించమని ఆ రాముడిని వేడుకున్నాను. అందుకే తన తమ్ముడి లాగా నా కొడుకుని కూడా చూస్తాడు అని నా కొడుకు పేరు భరత్ అనే పేరు పెట్టుకున్నాను. కానీ ఆయన కల్యాణానికి మంగళసూత్రం చేయిస్తానని మొక్కుకున్నాను.

ఇప్పటివరకు ఆ మొక్కు తీర్చలేకపోయాను.. అందుకు కారణం నా భర్త నా దగ్గర లేకపోవడమే అని మీనాక్షి బాధపడుతుంది. నువ్వేం బాధపడకు అమ్మ నీకోసం నేను ఏదైనా చేస్తాను నాన్నని నేను తీసుకొస్తాను అని అవని అంటుంది.. కానీ భరత్ మాత్రం ఆయన వస్తాను అంటే నేను రాను అసలు అని అంటాడు.. నువ్వు అనాధాశ్రమంలో పెరిగావు కాబట్టి అమ్మకు జరిగిన అవమానాలు గురించి నీకు పెద్దగా తెలియదు అక్క.. నేను అమ్మతోనే ఉన్నాను.. తనని జనాలు ఎంతగా అవమానించారో నాకు తెలుసు.. దానికి కారణం ఆ చక్రధర్.. అతని వల్ల ఎన్ని బాధలు పడ్డామో నీకు తెలియదా అక్క మళ్లీ అతని తీసుకొని వస్తావా అని భరత్ అవని పై సీరియస్ అవుతాడు..

Advertisement

Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ప్రేమ అవుట్..!

ఇది అమ్మ మొక్కురా దేవుడి మొక్కు కాబట్టి కచ్చితంగా నేను అమ్మమ్మకు తీర్చుకునేలా చేస్తాను అని అవని మాటిస్తుంది. అమ్మ నువ్వేం భయపడకు నీ ముక్కు తీర్చేలా నేను చూసుకుంటాను అని అవని అంటుంది. ఇక రాజేశ్వరి వాళ్ళ ఇంటికి వెళ్లిన అవని తన మొక్కు గురించి ఎంతగా చెప్తున్నా సరే తాను మాత్రం వినకుండా అవనిని దారుణంగా అవమానిస్తుంది.. పిన్ని నేను చెప్పేది ఒకసారి వినండి ఇది మా అమ్మ పాతికేళ్ల కోరిక నేను తీరుస్తానని మాట ఇచ్చాను. ఒక్కసారి నాన్నను గుడికి పంపించండి అని అవని అంటుంది.. నా మొగుడితో ఇక్కడే ఉండి సంసారం చేస్తుందా నీ అమ్మ అని దారుణంగా మాట్లాడుతుంది. రాజేశ్వరి మాటలకు అవనీ కన్నీళ్లు పెట్టుకొని బయటకు వస్తుంది. అవని బాధని అర్థం చేసుకున్నారు చక్రధర్ అవనికి నేను వస్తాను మీ అమ్మని పూజకు సిద్ధం చేసుకోమను అని మాటిస్తాడు. ఆ మాటతో అవని చాలా సంతోషంగా ఉంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×