E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కమల్ కు అడ్డంగా దొరికిన పల్లవి.. అందరికి బట్టలు తెచ్చిన చక్రధర్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: కమల్ కు అడ్డంగా దొరికిన పల్లవి.. అందరికి బట్టలు తెచ్చిన చక్రధర్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode March 27th : నిన్నటి ఎపిసోడ్ లో.. ఆరాధ్య కోసం స్కూల్ కి వెళ్ళిన అవనికి షాక్ ఎదురవుతుంది. స్కూల్ కి వెళ్ళినా అవనికి వాచ్మెన్ ఆరాధ్య వెళ్ళిపోయింది అండి ఎవరూ లేరు అని చెప్పగానే ఒకసారిగా షాక్ అయిపోతుంది.. ఎవరు తీసుకొని వెళ్లారు వెళ్లి ప్రిన్సిపల్ ని అడగండి అని చెప్పగానే.. లోపలికి వెళ్ళిన అవని ప్రిన్సిపాల్ కి ఎవరిని ఎలా పంపించాలి మీకు తెలియదా ఫీజులు కట్టాలి అది ఇది అని అంటారు పిల్లల్ని కేర్ గా చూసుకోవాలన్న బాధ్యత మీకు లేదా అని దిమ్మ తిరిగిపోయేలా షాకేస్తుంది..

ఇంటికి వెళ్లి చూస్తాను అక్కడ అమ్మాయి లేకపోతే ఆ తర్వాత మీ సంగతి చెప్తాను అని అవని ప్రిన్సిపాల్ కి వార్నింగ్ ఇచ్చి వస్తుంది.. ఆరాధ్య ఎవరు తీసుకెళ్లారు అర్థం కావడం లేదు అని కంగారుపడుతూ ఇంటికి వచ్చిన అవని పార్వతిని ఆరాధ్య కనిపించడం లేదు అత్తయ్య అని అడుగుతుంది.. ఆరాధ్యను చక్రధర్ తీసుకొని రావడంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటారు. ఇక అవని భోజనం చేసి వెళ్లండి అని చెప్పగానే చక్రధర్ భోజనానికి కూర్చుంటాడు. పల్లవి నీ పట్టించుకోకపోవడంతో పల్లవి చాలా ఫీల్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మా డాడీని అవని బాగా మార్చేసింది.. ఆరాధ్య తాతయ్య అంటూ మా డాడీ వెనకాల పడుతుంది.. ఇలానే గనక మా డాడీ ఉంటే ఆరాధ్య పేరు మీద ఆస్తి మొత్తం రాసేసి నాకు మొండి చేయి చూపిస్తాడేమో అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. అవనికి ఆరాధ్యకు మా డాడీని దూరం చేయాలి ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరిని దూరం చేస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు అని ఆలోచిస్తూ ఉంటుంది.. అప్పుడే అక్కడికి వచ్చిన కమల్ దేని గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు బావా దేని గురించి ఆలోచించడం లేదని పల్లవి ఎంత చెప్తున్నా సరే.. కమల్ మాత్రం అసలు నమ్మడు.. మీ నాన్న ఎక్కడ అవని వదిన పేరు మీద ఆస్తి రాసేస్తాడు అని కంగారు పడిపోతున్నావు కదా అని అంటాడు.. నేను తింగరనే కావచ్చు మరీ అంత తింగరోనైతే కాదు అని అంటాడు కమల్..

ఆ తర్వాత రాత్రి అన్నదమ్ములు కలిసి మందు కొట్టాలని ప్లాన్ చేసుకుంటారు. వదిన అమ్మకి తెలిస్తే ఏదైనా జరుగుతుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు. వదినని అమ్మని పడుకోమని చెప్పాను. ఎప్పుడో పడుకుండి పోయి ఉంటారు కూడా.. మనము హ్యాపీగా మందు తాగొచ్చు అని అనుకుంటారు అప్పుడు అక్కడికి అవని ఏవండీ అంతా పిలుస్తూ వస్తుంది. అవని మాట విన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. ఏంటి వదిన ఇలా వచ్చావు అని అడిగితే డిస్కషన్ అన్నారు కదా కాఫీలు టీలు ఏమైనా కావాలేమో అని వచ్చాను అని అంటుంది. ఈ టైంలో కాఫీలు టీలు ఎవరు తాగుతారు వదినా మాకు అవి ఏమీ వద్దు మీరు వెళ్ళండి అని అంటారు..

Advertisement

మొత్తానికి అవనికి ఆ ముగ్గురు మందు తాగుతున్నారని తెలిసిపోతుంది. ఇక అవని చేసేదేమీ లేక అలా రా తాగితే బాగోదు కదా సోడా వేసుకుని తాగండి అని ఇచ్చి వెళ్తుంది. తర్వాత రోజు ఉదయం పల్లవి ఉడుస్తూ ఉండగా రేపు శ్రీరామనవమి కదా బూజు దులిపేసి తడిపెట్ట పెట్టాలి అని అంటుంది. ఫస్ట్ నేను చెయ్యను అని చెప్పిన పల్లవి అందరికీ ఒక విషయం చెప్పాలి అని అవని పిలవడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రేపు శ్రీరామనవమి కదా అందరూ గుడికి వెళ్ళాలి అని అవని చెప్తుంది.. పల్లవికి ఒక్క సారిగా చెమటలు పడతాయి.. ఇక ఆరాధ్య పల్లవిని విసిగిస్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ రావడంతో అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు..

Also Read : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. మార్చిలో హైలెట్ ఎపిసోడ్స్..

మీ సందర్భంగా ఇంట్లోనే వాళ్ళందరికీ బట్టలు ఇచ్చి వెళ్తాడు చక్రధర్.. మీరు ఇలా అందరికీ బట్టలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అని అందరూ అంటారు.. పల్లవి మాత్రం షాక్ అయిపోతూ ఉంటుంది.. ఇక అవినీతి వాళ్ళ నాన్న బట్టలు ఇవ్వడంతో మీ అమ్మ తమ్ముడిని కూడా కల్యాణానికి పిలువు అని పార్వతి అంటుంది.. మీ నాన్న వస్తున్నాడు కదా మీ అమ్మ కూడా వస్తుంది అని అనగానే అవని అలాగే అత్తయ్య అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో రాజేశ్వరి దగ్గరికి వెళ్లిన అవని ఎంతగా బ్రతిమలాడినా సరే తాను ఒప్పుకోదు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×