E-Paper
Advertisement

Action Thriller OTT : ఓటీటీని షేక్ చేస్తున్న సూపర్ హీరో సిరీస్ సీజన్ 2… ఈసారి అబ్బురపరిచే విన్యాసాలు

Action Thriller OTT : ఓటీటీని షేక్ చేస్తున్న సూపర్ హీరో సిరీస్ సీజన్ 2… ఈసారి అబ్బురపరిచే విన్యాసాలు
Advertisement

Action Thriller OTT : మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన ‘డేర్‌డెవిల్’ సిరీస్ ని ప్రేక్షకులు విపరీతంగా చూశారు. మొదటి సీజన్ హిట్ అవ్వడంతో ‘డేర్‌డెవిల్ : బోర్న్ అగైన్’ సీజన్ 2 మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా ఓటీటీలో దూసుకుపోతోంది ఈ సిరీస్. యాక్షన్, విజువల్స్ వేరే రేంజ్ లో ఉన్నాయి ఇందులో. దీనిని మొదటి సీజన్ కంటే ఎక్కువ బడ్జెట్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో తీశారు. ముఖ్యంగా మ్యాట్ మర్డక్, విల్సన్ ఫిస్క్ మధ్య వచ్చే మైండ్ గేమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్

ఈ యాక్షన్ థ్రిల్లర్ ‘డేర్‌డెవిల్: బోర్న్ అగైన్ సీజన్ 2’ (Daredevil: Born Again Season 2) మార్చి 25 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్ తో పాటు తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఇది గతంలో వచ్చిన ‘డేర్‌డెవిల్’ సిరీస్‌కు కొనసాగింపు. ఇందులో మ్యాట్ మర్డక్ (చార్లీ కాక్స్) మళ్ళీ డేర్‌డెవిల్‌గా తిరిగి వచ్చాడు. మొదటి సీజన్ మొత్తం 9 ఎపిసోడ్లతో 2025 మార్చి 4 రిలీజ్ అవ్వగా, రెండో సీజన్ 8 ఎపిసోడ్లు మార్చి 25 రిలీజ్ అయ్యింది. ఇందులో కింగ్‌పిన్ పెట్టిన ‘యాంటీ-విజిలెంట్ టాస్క్ ఫోర్స్’కు వ్యతిరేకంగా డేర్‌డెవిల్ చేసే పోరాటం హైలైట్‌గా ఉంది. ఇందులో డేర్‌డెవిల్ మాత్రమే కాకుండా, జాన్ బెర్న్తల్, జేన్ ఫోస్టర్, జెస్సికా జోన్స్ వంటి ఇతర మార్వెల్ క్యారెక్టర్లు కూడా కనిపిస్తారు.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

మ్యాట్ మర్డక్ అనే వ్యక్తికి చిన్నప్పుడే చూపు కోల్పోయినా, మిగిలిన సెన్స్‌లతో సింహంలా తయారవుతాడు. పగలు కోటు వేసుకుని కోర్టులో లాయర్‌గా వాదిస్తూ, రాత్రి పూట ఎర్ర డ్రెస్ వేసుకుని డేర్‌డెవిల్‌గా రౌడీల తాట తీస్తుంటాడు. అటు పక్క విలన్ విల్సన్ ఫిస్క్ (కింగ్‌పిన్) మామూలోడు కాదు. ఏకంగా న్యూయార్క్ సిటీకే మేయర్ గా ఉంటూ, సిటీని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. మ్యాట్ మర్డక్ జీవితాన్ని రోడ్డు మీద పడేయాలని కింగ్‌పిన్ ప్లాన్లు వేస్తుంటే, ఎదురు నిలబడి మ్యాట్ చేసే ఫైటింగ్ ఈ సిరీస్ మెయిన్ పాయింట్. అయితే ఈసారి సీన్ ఇంకాస్త ముదిరింది. కింగ్‌పిన్ పవర్ వాడుకుని సూపర్ హీరోలందరినీ జైల్లో వేయాలని చూస్తుంటాడు. మ్యాట్ ఒక్కడే కాకుండా పాత మిత్రులు ఫాగి, కరెన్ వంటి వాళ్లతో కలిసి ఫిస్క్ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చాడు అనేదే అసలు మజా. పాత పగలు, పక్కా ప్లాన్లు, నరాలు తెగే యాక్షన్ సీన్లతో కథ ఊర మాస్‌గా సాగుతుంది.

Read Also :  ఓటీటీలోకి మెల్ గిబ్సన్ హారర్ థ్రిల్లర్… స్కూల్ పిల్లలను భయపెట్టే భూతం… స్ట్రీమింగ్ తెలుగులో కూడా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×