E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి శ్రీయ స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం పల్లవి.. కన్నీళ్లు పెట్టుకున్న అవని..

Intinti Ramayanam Today Episode: పల్లవికి శ్రీయ స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం పల్లవి.. కన్నీళ్లు పెట్టుకున్న అవని..
Advertisement

Intinti Ramayanam Today Episode july 5th: పల్లవి మీనాక్షిని తిట్టేసి లోపలికి వెళ్ళగానే అవని అక్కడికి వచ్చి మీనాక్షి బాధపడుతుంటే మాట్లాడుతుంది.. నువ్వేమీ బాధపడద్దమ్మా పల్లవి గురించి తెలిసిందే కదా. పల్లవి అలాంటి వాతావరణం లో పెరిగింది.. తను మారడం కాస్త కష్టమేనా మార్చేద్దాం అని అంటుంది.. నువ్వు భోజనం తీసుకుని వచ్చినప్పుడే పల్లవి కోసం తీసుకొస్తున్నావని అనుకున్నాను.. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించాను కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను అని అవని అంటుంది.. పల్లవి గురించి తెలిసింది కదా అమ్మ నువ్వేమీ బాధపడొద్దు తనే మెల్లగా మారుతుంది అని అవని మీనాక్షిని ఓదారుస్తుంది. ఎలాగైనా సరే పల్లవి మనసులో తల్లిగా స్థానాన్ని సంపాదించుకోవాలి అని మీనాక్షి అనుకుంటుంది. పల్లవి ప్రవర్తన చూస్తూ ఉంటే ఇప్పట్లో సాధ్యం కాదు అని మీనాక్షి బాధ పడిపోతుంది.. శ్రీయ బిడ్డ ఏడుస్తూ ఉంటే పల్లవి చిరాకు పడుతుంది.

ఏడ్పు ఆపకుంటే కొడతాను..

పల్లవి తన ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతూ ఉండగా శ్రేయ బాబు గుక్క పట్టి ఏడుస్తూ ఉంటాడు. అయితే తన ఫోన్ మాట్లాడుకోవడానికి ఇబ్బందిగా ఉందని అక్కడికి వచ్చిన పల్లవి. ఏంటి ఈ గోల ఇంట్లో సంత అని చిరాగ్గా వస్తుంది. అయితే బాబు దగ్గరికి వెళ్ళిన పల్లవి వాటిని చూసి నువ్వు ఏడుపు ఆపుతావా ఆపవా అని బెదిరిస్తుంది. ఒకవేళ నువ్వు ఏడుపు ఆపలేదంటే నిన్ను నేను కొడతాను అని పల్లవి అంటుంది. పల్లవి ఇంకాస్త కసురుకునేలా మాట్లాడడంతో ఆ బాబు ఇంకా గట్టిగా కేకలు వేస్తాడు. బాబుకి ఏమైందో అని పరిగెత్తుకుంటూ వచ్చిన శ్రేయ అక్కడ పల్లవిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పల్లవి అన్నమాట విని కోపంతో రగిలిపోతుంది శ్రియ..

పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్..

Advertisement

ఏంటి నా కొడుకుని నువ్వు కొడతావా అంటూ శ్రేయ ఎంట్రీ ఇస్తుంది. అది కాదు శ్రీయ నేనేమో అనేది వేరేది అని పల్లవి ఎంత కవర్ చేసుకోవాలని చూసినా కూడా తాను మాత్రం అస్సలు వినదు. ఎప్పుడూ కుళ్ళు కుతంత్రాలు మాత్రమే కాదు ఇలా పసిపిల్లల్ని కూడా బెదిరిస్తున్నావా నువ్వు అని పల్లవికి దిమ్మతిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది శ్రియ. ఎవరైనా పసిపిల్లలను చూస్తే ముద్దు చేయాలని ఎత్తుకోవాలని అనుకుంటారు కానీ నువ్వు మాత్రం ఇలా బెదిరిస్తున్నావా? నా కొడుకుని కొడతావా నీకు ఎంత ధైర్యం అని శ్రేయ అనగానే పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.. పసిపిల్లల నవ్వును చూసి చాలామంది సరదాగా అనుకుంటారు కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటి నీది ఎంత చీప్ క్యారెక్టర్ నాకు బాగా అర్థం అవుతుంది. నీకన్నా అవని అక్క ఎంతో మేలు అని పల్లవితో అనడంతో పల్లవి కోపంతో రగిలిపోతుంది.

నా బిడ్డకు ప్రాణం పోసింది..

అవని అక్క నా బిడ్డని కాపాడే ప్రయత్నం మాత్రమే చేయలేదు తనకేతంగా తన అవయవాన్ని దానం చేసి ప్రాణం పోసింది అని శ్రియ పొగడ్తల వర్షం కురిపిస్తుంది. తనలోని మంచితనంలో కొంచెం కూడా నీకు లేదు ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెడదామని ఆలోచిస్తూ ఉంటావు అని శ్రియ పల్లవికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుంది.. ఇన్ని రోజులు నేను అవని అక్కని ఏదో అనుకుని అపార్థం చేసుకున్నాను.. కానీ ఇప్పుడు అవని అక్క మంచితనం గురించి తెలుసుకొని నేను పూర్తిగా మారిపోయాను అని అనగానే పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

అక్షయ్ మాటకు కన్నీళ్లు పెట్టుకున్న అవని..

Advertisement

అవినీ నువ్వు భోజనం చేయలేదు కదా అందుకోసమే నీకోసం భోజనం తీసుకుని వచ్చాను అని అక్షయ్ అంటాడు.. పల్లవి భోజనం చేయలేదని మీ అమ్మ కూడా భోజనం చేయలేదు . ఇక నువ్వు కూడా మీ అమ్మ తినలేదని భోజనం చేయలేదు కదా.. అందుకే నీకోసం భోజనం తీసుకుని వచ్చాను అని అనగానే.. అవని నాకోసం మీరు భోజనం తీసుకుని వచ్చారా? ఎందుకు నేను వచ్చేదాని కదా అని అంటుంది. నువ్వు అసలే సర్జరీ జరిగిన మనిషివి కచ్చితంగా టైం కి భోజనం తీసుకుని టాబ్లెట్స్ వేసుకోవలి అని అక్షయ్ అంటాడు. నన్ను మీరు తిడతారని అనుకున్నాను కానీ ఇలా సపోర్ట్ చేస్తారని అస్సలు ఊహించలేదండి అని అవని కన్నీళ్లు పెట్టుకుంటుంది..

నువ్వు మా ఇంటి దేవత..

నువ్వు ఎవరికి కష్టం వచ్చినా కూడా తట్టుకోలేవు. నిన్ను పెళ్లి చేసుకునే ముందు ఎలాంటి అమ్మాయి కావాలని అనుకున్నాను అలాగే ఉన్నావు. నా స్వార్థం అని చూసుకోకుండా నువ్వు అందరికీ ఎప్పుడు తోడుగా ఉంటావు. నా వాళ్ళని నీ ప్రపంచంగా బతుకుతున్నావు కాబట్టి. నువ్వు దేనికైనా సిద్ధమవుతున్నావు అని అక్షయ్ ఆవని పై ప్రశంసలు కురిపిస్తాడు.. నన్ను మీరు తిడతారు అనుకోని నేను చాలా భయపడ్డాను. నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎలా సర్జరీ చేయించుకుంటావు అని అంటారని అనుకున్నాను. కానీ మీరు ఇలా అనడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అవని ఎమోషనల్ అయిపోతుంది.. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అని అవని అనుకుంటుంది వీళ్లిద్దరూ సెంటిమెంట్ సీను ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : ‘జానకి పరిణయం ‘ విష్ణు జీవితంలో కష్టాలు.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×