E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అక్షయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏకలింగం స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లో రచ్చ చేసిన శ్రీయ..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏకలింగం స్ట్రాంగ్ వార్నింగ్.. ఇంట్లో రచ్చ చేసిన శ్రీయ..
Advertisement

Intinti Ramayanam Today Episode January 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. అవనిని అవమానించిన ఆ ఊరి జనాలకు అవని గురించి చెప్తాడు. మీ పిల్లల కోసం విద్యాబుద్ధులు నేర్పించాలని స్కూల్ కోసం ఎంతో కష్టపడింది.. మీకు మంచి చేయడం కోసం తాను ఎంత కష్టపడుతుందో మీకు ఎవరికీ అనిపించలేదా అని అక్షయ్ అడుగుతాడు.. నా భార్య తండ్రి గురించి నా భార్య పుట్టుక గురించి మాట్లాడుతున్నారు తప్ప పిల్లల కోసం తాను ఎంత తాపత్రయ పడుతుందో ఆ తల్లి మనసు కోసం మీరు ఆలోచించరా అని అక్షయ్ అంటాడు.. నా భార్య మంచితనాన్ని గొప్పతనాన్ని గుర్తించలేని మీకు అవమానించే అర్హత మీకు లేదు అని అక్షయ్ అంటాడు.. ఆ ఊరి వాళ్ళందరికీ కూడా అక్షయ్ క్లాస్ పీకుతాడు.

తనని ఇంతగా అవమానించినా కూడా తను బాధ పడుతుందే తప్ప మిమ్మల్ని ఒక్కసారి కూడా ఒక్క మాట అనలేదు అది నా భార్య గొప్పతనం అని అక్షయ్ అవని గురించి చాలా గొప్పగా చెప్తాడు. కోటిలింగం ఊర్లో అంటించిన పోస్టల్ అన్ని తీసుకొని వస్తాడు. మాటలతో ఆ ఊర్లో అన్న అందరూ క్షమించమని అడుగుతారు.. ఆ తర్వాత ఏక లింగం దగ్గరకు వెళ్లి అవని అవమానిస్తావా నీ అంత చూస్తామని ముగ్గురు అన్నదమ్ములు వార్నింగ్ ఇస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. స్కూల్లో పిల్లలకి భోజనం పెట్టాలని అక్షయ్ అవనీలు అనుకుంటారు.. ఇక స్కూల్లో ఉన్న పిల్లలకి భోజనం ఏర్పాటు చేస్తారు. రాజేంద్రప్రసాద్ కుటుంబం మొత్తం కూడా పిల్లలకి భోజనం పెడుతూ వారు సంతోషంగా ఉండడం చూసి వీళ్ళు కూడా సంతోషపడతారు.. అవని పిల్లలకు అడిగిమరీ భోజనం పెడుతూ ఉంటుంది. భోజనం ఎలా ఉంది అని అడుగుతుంది. ఇలాంటి భోజనాన్ని మేము ఎప్పుడు తినలేదు. చాలా బాగుంది అని ఆ పిల్లలు చాలా సంతోషంగా తింటారు అలా తింటూ ఉండగానే పిల్లలందరూ ఒకేసారి వాంతి చేసుకోవడానికి వెళ్తారు. ఏంటి పిల్లలు అందరూ ఒకేసారి వాంతులు చేసుకుంటున్నారు ఏమైంది అని రాజేంద్రప్రసాద్ కుటుంబం కంగారు పడతారు. ఏంటండీ పిల్లలందరూ ఒకేసారి వాంతులు చేసుకుంటున్నారు నాకేంటో భయంగా ఉంది అనేసి అవని అంటుంది.

ఈ పిల్లలకి ఏమన్నా అయితుందేమో అని ఇంట్లోనే వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అక్షయ్ కంగారు పడిపోతూ పిల్లలకి ఏమవుతుందని భయపడుతూ డాక్టర్ కి ఫోన్ చేస్తాడు.. వెంటనే అక్కడికి వచ్చిన డాక్టర్ పిల్లల్ని పరీక్షించి వాళ్ళకి తినే ఫుడ్ లో ఎవరో పాయిజన్ కలిపారు అని అంటారు. ఆ మాట వినగానే అక్షయ్ అవని ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. పిల్లలు తినే ఫుడ్ లో ఎవరు పాయిజన్ కలిపి ఉంటారు అని అందరూ ఒక్క క్షణం షాక్ అయ్యి ఆలోచిస్తారు.. డాక్టర్ వీళ్ళని ఇక్కడ చూడలేము హాస్పిటల్ కి తీసుకురండి అని అంటారు.. పిల్లలందరినీ హాస్పిటల్ కి పంపిన తర్వాత ఈ పని ఎవరు చేసి ఉంటారు. అసలు పిల్లలకి ఇలా చేయడం వెనక ఉద్దేశం ఏంటి అని అందరూ కంగారు పడిపోతూ ఆలోచిస్తారు..

Advertisement

అప్పుడే అక్కడికి ఏక లింగం వస్తాడు. ఈ ఊర్లో పిల్లలకు ఏమన్నా అయితే అసలు ఊరుకోను అని ఏకలింగం అంటాడు.. ఆమెది ఏదైనా కోపం ఉంటే నా మీద చూపించండి అలాగే కాదని పిల్లల జోలికొస్తే అస్సలు ఊరుకోము అని ఏకలింగం అంటాడు. పిల్లలకి ఏమన్నా అవ్వాలి మీరు ఒక్కరు కూడా ఈ ఊరు దాటి బయటికి వెళ్లలేరు అని ఈకలింగం అంటాడు. ఇక అప్పుడే పోలీసులు రావడంతో ఏకలింగం ఎవరిని అరెస్ట్ చేయాలో వాళ్ళని అరెస్ట్ చేయండి అని అంటాడు.. ఈ స్కూల్ ఎవరిది అని పోలీసులు అడుగుతారు. మా అమ్మ పేరు మీద మా నాన్న కట్టించారు.

Also Read :భూషణ్ కు సారీ చెప్పిన మహా.. కన్నీళ్లు పెట్టుకున్న మహా.. పెళ్లి ఆగిపోతుందా..?

మొన్నటి వరకు మూతబడిన ఈ స్కూలుని ఇప్పుడు మేము తెరిచాము. అంతే కాదు పిల్లలకి మంచి భోజనం అందించాలని భోజనం కూడా పెట్టాము.. భోజనం తింటుండగా పిల్లలందరూ ఒకేసారి వాంతులు చేసుకున్నారు హాస్పిటల్కి పంపించాము అని పోలీసులతో చెప్తారు.. అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అని పోలీసులు అక్షయ్ ని తీసుకొని వెళ్లడానికి ప్రయత్నిస్తారు.. కానీ ఇంట్లోని వాళ్ళందరూ కూడా అక్షయ్ ని వెళ్ళనివ్వకుండా ఆపుతారు. మొత్తానికి అక్షయ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు.. ఆ తర్వాత ఏక లింగం మీరందరూ ఈ ఊరు నుంచి వెళ్లిపోండి లేదంటే మాత్రం మీ కుటుంబంలో ఏ ఒక్కరూ మిగలరు అని వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×