E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు భరోసా ఇచ్చిన రుద్రాణి, రాహుల్

Brahmamudi Serial Today January 3rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు భరోసా ఇచ్చిన రుద్రాణి, రాహుల్
Advertisement

Brahmamudi serial today Episode:

రాజ్ తో కలిసి డాన్స్‌ చేసిందే గుర్తు చేసుకుని రేఖ పరవశించిపోతుంటుంది. రుద్రాణి.. రాహుల్‌కు ఇంకా కారు కీస్‌ దొరకలేదా..? అని ఎదురుచూస్తుంది. ఇంతలో రాహుల్‌ వస్తాడు. రాహుల్‌ ఓకేనా అని అడుగుతుంది. దీంతో రాహుల్‌ కీస్‌ చూపిస్తూ రాజ్‌ కారు కీస్‌ మన చేతిలోకి వచ్చినంత మాత్రాన పని అయిపోయినట్టు కాదు మమ్మీ  ఆ బంగారం రాజ్‌ కారులోకి చేరితే అప్పుడు పని అయిపోయినట్టు అని చెప్తాడు. దీంతో రుద్రాని ఇంకెందుకురా లేటు.. ఆ బంగారాన్ని రాజ్‌ కారులో పెట్టేయ్‌. దొంగ బంగారం కొన్నాడన్న కేసులో వాణ్ని పూర్తిగా ఇరికించేయ్‌ అని చెప్తుంది. అదంతా జరగాలంటే తొందర పడకూడదు మమ్మీ ఎవ్వరూ చూడని టైంలో అందరి కళ్లు కట్టి అ పని చేయాలి. వెంటనే పోలీసులను రప్పించాలి. ఆ దొంగ బంగారం కేసులో రాజ్‌ను ఇరికించాలి అని చెప్తాడు రాహుల్‌.

అంతా వింటున్న రేఖ అనుమానంగా మమ్మీ దొంగ బంగారం కేసులో రాజ్‌ బావను ఇరికిస్తారా..? అని అడుగుతుంది.  దీంతో రాహుల్‌ నువ్వెందుకే అంత ఫీల్‌ అవుతున్నావు అంటాడు. ఎంతైనా నేను చేసుకోబోయేవాడు కదా అన్నయ్య.. నాకు కాబోయే మొగుడు జైళ్లో ఉంటే బాగోడు కదా అన్నయ్య అంటుంది రేఖ. దీంతో రాహుల్‌ కోపంగా ఏంటే వాడు అప్పుడే నీకు మొగుడైపోయాడా..? అంతదాకా వెళ్లావా..? అంటాడు. వెళ్లాలని అనిపిస్తుంది అన్నయ్య.. కానీ ఎక్కడ బావ చాన్స్‌ ఇస్తేనే కదా..? అంటుంది రేఖ. నువ్వు అప్పుడే ఊహల్లోకి వెళ్లకు వాడు నీకు దక్కాలంటే చాలా తతంగం ఉంది అని చెప్తాడు రాహుల్‌. కానీ మీరు ఇదంతా చేసి రాజ్‌ బావను జైలుకు పంపిస్తున్నారే ఇంకెలా బావ నావాడు అవుతాడు అని రేఖ అడగ్గానే.. వాణ్ని జైలుకు పంపకపోతే నేను నెంబర్‌ వన్‌ అవ్వలేను అంటాడు రాహుల్‌. కానీ జైలుకు పంపితే బావకు నేను పెళ్లాన్ని అవ్వలేను అంటుంది రేఖ.

Advertisement

దీంతో రాహుల్‌ ఇరిటేటింగ్‌ గా మమ్మీ దీనికి ఎలా చెప్పను నువ్వైనా చెప్పు అంటాడు. దీంతో రుద్రాణి నువ్వు ఆగరా.ద.? రేఖ నీకు నేను ఉన్నాను కదా.. అని చెప్తుంటే.. కానీ బావ ఉండడు కదా.. అంటుంది రేఖ. చూడు రేఖ వాడు నీకు కావాలంటే రాజ్‌ నీ కంట్రోల్‌ లోకి రావాలి. అలా రావాలంటే వాడు ఒంటరి అయిపోవాలి. అప్పుడు మన మాట వినే స్థితికి వస్తాడు. నువ్ఉవ వాడి లైఫ్‌కు ఎంత అవసరమో వాడికి అర్థం అవుతుంది. అప్పుడు నీవు అనుకున్నది అంతా జరుగుతుంది అని రుద్రాణి చెప్పగానే.. రేఖ అనుమానంగా మమ్మీ అది ఎలా జరుగుతుంది. బావ మనసంతా ఆ కావ్య ఉంది కదా..? అని అడగ్గానే..

కావ్య కడుపు పోతుంది. మళ్లీ దానికి పిల్లుల పుట్టే అవకాశమే లేదు..  ఆ విషయం నీకు తెలుసు కదా..? ఈ ఇంటికి వారసుడు కావాలి. కాబట్టి వాడికి ఆ కావ్యకు నువ్వు ఒకే ఒక్క ఆప్షన్‌ నువ్వు అని నేను అనిపిస్తాను.. అని రుద్రాణి చెప్పగానే.. రేఖ హ్యాపీగా మమ్మీ ఎందుకో నువ్విదంతా చెప్తుంటే అంతా జరుగుతుంది అనిపిస్తుంది అనగానే రుద్రాణి కూడా జరుగుతుంది ఒక పక్క కావ్య కడుపు పోవాలి. మరోపక్క దొంగ బంగారం కేసులో రాజ్‌ జైలుకు పోవాలి.. అని చెప్పగానే.. మమ్మీ ఆ ఒక్క మాట వింటేనే నాకు టెన్షన్‌ గా ఉంది అని రేఖ భయపడుతుంటే.. రాహుల్‌ ఎందుకే టెన్షన్‌ అంతవరకు నేను రానివ్వను.. రాజ్‌ ను నేనే బెయిల్‌ మీద బయటకు తీసుకొస్తాను.. అప్పుడే రాజ్‌కు నా మీద గౌరవం.. నీ మీద ప్రేమ రెండు ఒకేసారి పెరిగిపోతాయి అని చెప్పగానే.. రేఖ హ్యాపీగా ఫీలవుతుంది.

Advertisement

అప్పు, కావ్యలను పుట్టింటికి తీసుకెళ్లడానికి కనకం వస్తుంది. అయితే కోడళ్లు ఇద్దరూ ఉన్నపళంగా పుట్టింటికి వెళ్లితే ఇల్లంతా బోసి పోతుందని అపర్ణ బాధపడుతుంది. పిల్లలు ఇంకొన్నాళ్లు ఇక్కడే ఉండాలని మా అందరి ఆశ అని ఇంద్రాదేవి చెప్తుంది. సీమంతం కూడా జరిపించలేదు అపుడే ఎలా పంపిస్తామని ధాన్యం అడుగుతుంది. పంతులు ఇక్కడే ఉన్నారు కాబట్టి సీమంతం ఇక్కడే జరిపిద్దాం అని ఇంద్రాదేవి చెప్పగానే.. కనకం అలాగేనమ్మా పెద్ద వారు మీరు చెప్పినట్టే చేద్దాం అంటుంది. పంతులును ఎప్పుడు చేయాలో చెప్పమని అడుగుతారు. రేపే సీమంతం జరిపించండి అని పంతులు చెప్పగానే.. అందరూ హ్యాపీగా ఫీలవుతారు. తర్వాత సుభాష్‌ మందు తాగుతుంటే.. అపర్ణ వెళ్లి ఎందుకు తాగుతున్నావు అని అడుగుతుంది. సంతోషంలో ఉన్నాను కాబట్టి తాగుతున్నానని చెప్తాడు సుభాష్‌. అప్పున సర్‌ప్రైజ్‌ చేయడానికి కళ్యాణ్‌ చీర తీసుకొస్తాడు. ఆ చీరను చూసిన అప్పు సంతోషపడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×