E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode:కోటికి గర్ల్ ఫ్రెండ్ దొరికేసింది.. రాజేంద్రకు పల్లవి వార్నింగ్.. పల్లవి ప్లాన్ సక్సెస్..

Intinti Ramayanam Today Episode:కోటికి గర్ల్ ఫ్రెండ్ దొరికేసింది.. రాజేంద్రకు పల్లవి వార్నింగ్.. పల్లవి ప్లాన్ సక్సెస్..
Advertisement

Intinti Ramayanam Today Episode January 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేశ్వరి ఇంట్లోకి రాగానే అందరూ ఆమెను చూసి షాక్ అవుతారు. మీరు పిలవకపోయినా వచ్చాను అని అనుకుంటున్నారా అని అంటుంది.. రాజేశ్వరి రావడంతో మిగిలిన వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. అవనీ, అక్షయ్ లు అత్తయ్య వచ్చింది అంటే ఏదో జరుగుతుంది అని అనుకుంటారు.. అందరూ ప్రేమగా పలకరిస్తే రాజేశ్వరి మాత్రం మీనాక్షి అవనీలపై సీరియస్ అవుతుంది. అయితే మీనాక్షిపై రాజేశ్వరి రెచ్చిపోతుంది.. అది అవని విని రాజేశ్వరీ కి వార్నింగ్ ఇస్తుంది.. మా అమ్మ గురించి ఇంకొక మాట మాట్లాడితే నువ్వు పిన్ని అనే సంగతి కూడా నేను మర్చిపోతాను అని అవని రాజేశ్వరి కి వార్నింగ్ ఇస్తుంది.. కోటిలింగం ఆరాధ్య ఇద్దరు కలిసి సరదాగా బయట మాట్లాడుకుంటూ ఉంటారు.. అయితే అక్కడ ఒక అమ్మాయిని చూసిన కోటిలింగం అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది ఆ అమ్మాయి నేను ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు.. రాజేంద్రప్రసాద్ ఎలాగైనా సరే ఈ పార్టీలో చక్రధర గురించి నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటాడు. పల్లవి మాత్రం అతని ఆపే ప్రయత్నం చేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

 ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. కోటిలింగం తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ దొరికిందని చాలా సంతోషంగా ఉంటాడు. అయితే అక్కడ ఆ అమ్మాయి తన ఆస్తిని చూసి అతనితో మాట్లాడింది అన్న విషయాన్ని తెలుసుకోలేక పోతాడు.. ఎంత చెప్తున్నా సరే కోటిలింగం మాత్రం ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు.. ఇక అమ్మాయి కూడా తనకు ఎంత ఆస్తి ఉంది అని అడుగుతుంది. నాకు ఆస్తి చాలానే ఉంది అని కోటిలింగం చెప్పగానే వీడు తింగరోడు అనుకున్నాను కానీ ఇంత ఆస్తిపరుడా అని అమ్మాయి అనుకుంటుంది. మొత్తానికి కోటిలింగంకు అమ్మాయి దొరికేసింది. ఆ తర్వాత తనకు అమ్మాయి దొరికిందని చాలా సంతోషంగా ఉంటే భానుమతి వచ్చి ఆ అమ్మాయి నిన్ను చూసి ఇష్టపడలేదు రా నీ డబ్బులు చూసి ఇష్టపడుతుందని నిజం చెప్తుంది.

Advertisement

 భానుమతి ఎంత చెప్తున్నా సరే కోటిలింగం మాత్రం అస్సలు వినడు. తాను నాకోసమే పుట్టింది తనని నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను అని అంటాడు.. నీ కర్మ రా నీ చావు నువ్వు చావు అని భానుమతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత పల్లవి ఎలాగైనా సరే మామయ్యను ఆపాలని అనుకుంటుంది.. పల్లవి మావయ్య ఇదంతా చేస్తున్నాడు కదా ఖచ్చితంగా ఆపకపోతే పెద్ద యుద్ధమే జరుగుతుంది మా ఇంటి పరువు పోతుంది అని ఆలోచిస్తుంది.. ఎన్నో విషయాలు గురించి మావయ్య చెప్పాలనుకుంటున్నాడు కచ్చితంగా నేను హాయ్ ని మాట్లాడి ఒప్పించాలి అని అనుకుంటుంది.

 అయితే ఒక లెటర్ రాసి పల్లవి రాజేంద్రప్రసాద్ కి ఇవ్వాలని అనుకుంటుంది. ఆ లెటర్ ని ఒక పాప చేతికిచ్చి ఇవ్వమంటే ముందుగా అక్షయ్ ఎవరు లెటర్ ఇచ్చారు అని అడుగుతాడు. పల్లవి ఆ లెటర్ గురించి తెలియకుండా ఉండాలని అనుకుంటుంది.. తర్వాత అవని ఆ లెటర్ ఎవరు ఇచ్చారు అని అవని అంటుంది. మొత్తానికి అయితే ఆ పిల్లని ఎలాగోలా ఒప్పించేసి ఆ లెటర్ ని రాజేందర్ ప్రసాద్కు చేరేలా చేస్తుంది. పల్లవి.. ఆ లెటర్ ని చూసిన రాజేంద్ర పల్లవి రాసింది అని తెలుసుకుంటాడు.. పల్లవితో ఏదో ఒకటి మాట్లాడి చెప్పాలని అనుకుంటాడు.

Advertisement

 ఇక కమల్ అక్షయ్ ఇద్దరు కూడా పార్టీని స్టార్ట్ చేద్దామని అంటారు. అక్కడ మైక్ తీసుకుని కమల్ పార్టీ గురించి చెప్పాలని అనుకుంటారు.. అప్పుడే పల్లవి దగ్గరికి వచ్చిన రాజేంద్ర నాతో ఏం మాట్లాడాలి? ఎందుకు నన్ను బెదిరిస్తున్నావు అని అంటాడు.. ఇక పల్లవి మా నాన్న అవనికి తండ్రి అని నువ్వు చెప్తే మా ఇంటి పరువు పోతుంది మామయ్య అని బ్రతిమలాడుతుంది. కానీ పల్లవి ఎంత చెప్తున్నా సరే ఆ రాజేంద్ర మాత్రం అసలు వినడు.. మా ఇంటి పరువు పోతుందని ఎంత చెప్తున్నా సరే పల్లవి మాటను లెక్కచేయడు రాజేంద్ర.. ఆఖరికి పల్లవి రాజేంద్ర కాళ్ళ మీద పడి కూడా బ్రతిమలాడుతుంది.. అయినా రాజేంద్ర ఒప్పుకోడు.

Also Read :పోలీస్ స్టేషన్ కు మహా, చక్రీ… దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు.. చక్రిపై మహా సీరియస్..

నువ్వు చచ్చిపోతానని బెదిరిస్తున్నావు కదా చచ్చిపో నేను మాత్రం ఈ విషయాన్ని కమల్ తో చెప్తాను అని అంటారు.. అయితే పల్లవి రాజేంద్రుని ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అవుతుంది.. ఇక పల్లవి రాజేంద్ర నా మాట వినడు అని అనుకుంటుంది.. నువ్వు ఎలాంటి దానివో నువ్వు చేస్తున్న మోసాలు ఏంటో కచ్చితంగా నేను కమల్ తో చెప్తాను అని రాజేంద్ర అంటాడు. పల్లవి మాత్రం ఈ ఫంక్షన్ ఎలాగైనా ఆగిపోవాలి రాజేంద్రని చంపేయాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×