E-Paper
Advertisement

Facial Movement iPhone: మీ మనసులో మాటను పసిగట్టే ఐఫోన్ .. చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖకవళికలతోనే

Facial Movement iPhone: మీ మనసులో మాటను పసిగట్టే ఐఫోన్ .. చెప్పాల్సిన అవసరం లేదు.. ముఖకవళికలతోనే
Advertisement

Facial Movement iPhone| ఆపిల్ ప్రతి సంవత్సరం iPhoneను మరింత అధునాతనంగా, యూజర్లకు కొత్త ఫీచర్స్‌తో సులభంగా ఉపయోగపడేలా డెవలెస్ చేస్తోంది. అందుకే ఇప్పుడు ఒక అనూహ్య టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఫోన్‌కు నోటి ద్వారా చెప్పకుండానే ఆదేశాలు అర్థం చేసుకోగలదు. ముఖ కవళికలు, నిశ్శబ్ద సంకేతాల ద్వారా iPhone సమాచారం తీసుకుంటుంది. ఇది సంభాషణను మరింత సులభం చేస్తుంది. గట్టిగా మాట్లాడలేని సమయాల్లో కూడా సహాయపడుతుంది.

ఇజ్రాయెల్ AI స్టార్టప్ కంపెనీని కొనుగోలు చేసిన ఆపిల్

ఆపిల్ ఇటీవల ఇజ్రాయెల్‌కు చెందిన AI స్టార్టప్ Q.aiని కొనుగోలు చేసింది. ఈ డీల్ గురించి ఇటేవలే అధికారికంగా ప్రకటించింది. ఈ డీల్ ఆర్థిక వివరాలు బయటపెట్టలేదు. Q.ai అడ్వాన్స్‌డ్ ఆడియో, ఇమేజింగ్ టెక్నాలజీలలో నైపుణ్యం కలిగి ఉంది. మెషిన్ లెర్నింగ్ ఆధారంగా పనిచేస్తుంది. ఆపిల్ ఈ టెక్నాలజీని భవిష్యత్ ప్రొడక్ట్‌లు, సాఫ్ట్‌వేర్‌లలో ఉపయోగించాలని ప్లాన్ చేస్తోంది.

Q.ai టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది?

Advertisement

యూజర్ చెప్పే ఆదేశాలను స్పష్టంగా వినలేని పరిస్థితుల్లో కూడా అర్థం చేసుకునే టెక్నాలజీని Q.ai అభివృద్ధి చేస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇతర శబ్దాలను ఫిల్టర్ చేస్తుంది. గుసగుసలాడుతున్న మాటలు, చాలా చిన్నగా చెప్పే శబ్దాలను కూడా గుర్తిస్తుంది. మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ద్వారా రియల్ వరల్డ్‌లో వాయిస్ రికగ్నిషన్ కచ్చితత్వాన్ని పెంచుతుంది.

ముఖ కవళికల ద్వారా మాటలు గుర్తించడం

Q.ai అడ్వాన్స్‌డ్ ఫేషియల్ ఇమేజింగ్ టెక్నాలజీపై కూడా పనిచేస్తోంది. మాట్లాడేటప్పుడు ముఖ చర్మంపై జరిగే చిన్న కదలికలను గుర్తిస్తుంది. ఈ కదలికల ద్వారా మాటలను అర్థం చేసుకోగలదు. శబ్దం స్పష్టంగా లేకపోయినా మాటలు అర్థమవుతాయి. ముఖ కవాళికల ద్వారా సంభాషణ చేయడం సాధ్యమవుతుంది.

గతంలో పేటెంట్ ఫైల్ చేసిన ఆపిల్

Advertisement

గత సంవత్సరం ఆపిల్ ఇలాంటి ఫేషియల్ డిటెక్షన్ టెక్నాలజీపై పేటెంట్ దాఖలు చేసింది. ముఖ చర్మ కదలికల ద్వారా మాటలు గుర్తించడం గురించి వివరించింది. వ్యక్తి గుర్తింపు కూడా ముఖ కవళికల ద్వారా తెలుసుకోవచ్చని చెప్పింది. భావోద్వేగాలు, హార్ట్ రేట్, శ్వాస వంటి విషయాలను కూడా అంచనా వేయగలదు. ఇది ఆపిల్ డివైసెస్‌లో యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ని మెరుగుపరుస్తుంది.

భవిష్యత్ ఆపిల్ డివైసెస్‌కు లాభాలు

ఈ టెక్నాలజీ వల్ల iPhone నిశ్శబ్దంగా లేదా గట్టి శబ్దాల మధ్యలో కూడా యూజర్లను అర్థం చేసుకోగలదు. మీటింగ్‌లు, పబ్లిక్ ప్లేస్‌లలో మాట్లాడకుండానే సంభాషణ చేయవచ్చు. మాట్లాడడంలో ఇబ్బంది ఉన్నవారికి యాక్సెసిబిలిటీ మెరుగవుతుంది. Apple Vision Proలో మరింత సహజమైన కంట్రోల్స్ రావచ్చు. ముఖ కదలికలతో మిక్స్‌డ్ రియాలిటీలో సులభంగా పనిచేయవచ్చు.

ఆపిల్ AI ఆడియో ఫీచర్లపై దృష్టి

గత కొన్ని సంవత్సరాలుగా ఆపిల్ AI ఆధారిత ఆడియో ఫీచర్లను విస్తరిస్తోంది. AirPodsలో లైవ్ ట్రాన్స్‌లేషన్, నాయిస్ క్యాన్సిలేషన్, వాయిస్ ఎన్‌హాన్స్‌మెంట్ మెరుగవుతున్నాయి. Q.ai టెక్నాలజీ ఆపిల్ ఆడియో ఇన్నోవేషన్ స్ట్రాటజీకి సరిపోతుంది. రియల్ వరల్డ్ పరిస్థితుల్లో డివైసెస్ మరింత స్మార్ట్‌గా మారతాయి.

Also Read: ఛార్జింగ్ సమయంలో పేలిన గెలాక్సీ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. శాంసంగ్ ఏం చెప్పిందంటే

అధికారికంగా ప్రకటించని ఆపిల్

Q.ai టెక్నాలజీని ఎలా, ఎప్పుడు ఉపయోగిస్తారో ఆపిల్ ఇంకా చెప్పలేదు. ఏ ప్రొడక్ట్‌లో ఇంటిగ్రేట్ చేస్తారో టైమ్‌లైన్ ఇవ్వలేదు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ద్వారా క్రమంగా ఈ ఫీచర్లు రావచ్చు. భవిష్యత్ iPhoneలలో నిశ్శబ్ద సంభాషణ సామర్థ్యం రావచ్చు. ఆపిల్ కొత్త ఇంటరాక్షన్ మెథడ్స్‌ను బ్యాక్‌స్టేజ్‌లో టెస్ట్ చేస్తోంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×