E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అవనికి సపోర్ట్ గా అక్షయ్.. ఏకలింగంకు షాకిచ్చిన అక్షయ్.. డ్యూయేట్ సాంగ్ కు అవని, అక్షయ్ డ్యాన్స్..

Intinti Ramayanam Today Episode: అవనికి సపోర్ట్ గా అక్షయ్.. ఏకలింగంకు షాకిచ్చిన అక్షయ్.. డ్యూయేట్ సాంగ్ కు అవని, అక్షయ్ డ్యాన్స్..
Advertisement

Intinti Ramayanam Today Episode January 2nd : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి తన ప్లాన్ సక్సెస్ అయినందుకు ఏక లింగం ని కలిసి సంతోషంగా మాట్లాడుతుంది. ఏకలింగం నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియదు నేను ఏది అనుకుంటే ఆ దానికి ఇంకా నాలుగు రెట్లు ఎక్కువగానే చేస్తాను అని అంటాడు. ఇక మనము ఇంకా అవనిని ఏదో ఒకటి చేయాలి అప్పుడే మనకి చాలా సంతోషంగా ఉంటుంది.. ఆ ఇంట్లో వాళ్ళందరూ అవన్నీ బయటికి గెంటేయాలి.. ఆస్తులన్నీ నాకే రావాలి అని పల్లవి ఏక లింగంతో అంటుంది.. ఆ అవనిని ఇంకా దెబ్బ కొట్టాలి అని ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు. ఇక అవని గురించి మళ్లీ చెప్తున్నాను జాగ్రత్తగా ప్లాన్ చేయాలి ఒక్కసారి గనుక డౌట్ వస్తే ఇక అంతే పని అని పల్లవి అంటుంది. అక్షయ్ అవనిని తీసుకొని వెళ్లి అక్కడున్న వారందరి మధ్య తన భార్య గ్రేట్ అంటూ తన గురించి చెప్తాడు.. ఏక లింగం తమ్ముడు కోటిలింగం కూడా ఆరోగ్యకు సపోర్టుగా అక్కడికి వస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మీ పిల్లల కోసం విద్యాబుద్ధులు నేర్పించాలని స్కూల్ కోసం ఎంతో కష్టపడింది.. మీకు మంచి చేయడం కోసం తాను ఎంత కష్టపడుతుందో మీకు ఎవరికీ అనిపించలేదా అని అక్షయ్ అడుగుతాడు.. నా భార్య తండ్రి గురించి నా భార్య పుట్టుక గురించి మాట్లాడుతున్నారు తప్ప పిల్లల కోసం తాను ఎంత తాపత్రయ పడుతుందో ఆ తల్లి మనసు కోసం మీరు ఆలోచించరా అని అక్షయ్ అంటాడు.. నా భార్య మంచితనాన్ని గొప్పతనాన్ని గుర్తించలేని మీకు అవమానించే అర్హత మీకు లేదు అని అక్షయ్ అంటాడు.. ఆ ఊరి వాళ్ళందరికీ కూడా అక్షయ్ క్లాస్ పీకుతాడు. తనని ఇంతగా అవమానించినా కూడా తను బాధ పడుతుందే తప్ప మిమ్మల్ని ఒక్కసారి కూడా ఒక్క మాట అనలేదు అది నా భార్య గొప్పతనం అని అక్షయ్ అవని గురించి చాలా గొప్పగా చెప్తాడు. కోటిలింగం ఊర్లో అంటించిన పోస్టల్ అన్ని తీసుకొని వస్తాడు. మాటలతో ఆ ఊర్లో అన్న అందరూ క్షమించమని అడుగుతారు..

Advertisement

కోటిలింగం బాగా చెప్పారు అని అక్కడున్న పోస్టర్స్ అన్నిటిని చించేస్తాడు. మీలాంటి మంచివాళ్ళ గురించి ఇలా తప్పుడుగా చేసే వాళ్ళు తప్పు వల్లే ఉంటారు అని ఆ పోస్టల్ అన్నిటినీ కోటిలింగం తగలబెట్టేస్తాడు. తప్పైపోయింది అమ్మ క్షమించండి అని ఆ ఊరు వాళ్ళు అంటారు. వాళ్లందరి ముందర అక్షయ్ తన గురించి గొప్పగా చెప్పడంతో అవని చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక తర్వాత అవని ఇలా జరిగింది ఏంటి అని బాధ పడుతూ ఉంటుంది.. పల్లవి నా ప్లాను మళ్లీ ఫెయిల్ అయిపోయింది అని ఫీల్ అవుతుంది.. ఇక ఇంట్లోనే వాళ్ళందరూ కూడా అవని గురించి అక్షయ్ చెప్పిన మాటలు విని చాలా సంతోషంగా ఉంటారు..

ఇదంతా ఏకలింగం చేసిన పని అని అందరూ ఏక లింగం కోసం వెళ్తారు. అక్షయ్ శ్రీకర్, కమల్ ఏక లింగం దగ్గరికి వెళ్లి నువ్వు ఇదంతా చేసావని మాకు బాగా తెలుసు. నీ బెదిరింపులకి నువ్వు చేసే వాటికి భయపడి పోదామని అస్సలు అనుకోవద్దు అని అక్షయ్ అంటాడు. భార్య గురించి ఇంత చండాలంగా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం రాని ఏకలింగంను అక్షయ్ కొడతాడు.. నీకు ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తున్నాము మా ఆస్తులు అన్నిటిని మాకు తిరిగి ఇచ్చేసేయ్ లేదంటే మాత్రం ఏం చేయాలో అది చేస్తాం మా సంగతి నీకు బాగా తెలియదు అనుకుంటాను అని ముగ్గురు బెదిరిచేస్తారు.

Advertisement

నాకు ఇన్కమింగ్ మాత్రమే తెలుసు అవుట్ గోయింగ్ తెలియదు అని ఏక లింగం అంటాడు. మీ ఊర్లో నేను సర్పంచ్ని నేను ఏది చెప్తే అది ఊరు జనాలు పాటిస్తారు. నామీద చెయ్యి వేస్తే మా ఊరు వాళ్ళు ఊరుకోరు అని ఏకలింగం అంటాడు.. నువ్వు మంచి వాడివని వాళ్ళు నీకు ఓట్లు వేసి సర్పంచ్ గా గెలిపించలేదు. నువ్వు వాళ్ళని భయపెడుతున్నావ్ కాబట్టి వాళ్లు భయపడుతున్నారు. ఇకమీదట అలాంటివి ఉండవు వాళ్ళ భయాన్ని పోగొడతాము నీకు ఒక్కరోజు మాత్రమే టైం ఇస్తున్నాము. మా ఆస్తులు అన్నిటినీ మాకు ఇస్తే సరే సరే లేదంటే నీ అంతు చూస్తాము నిన్ను జైలుకు పంపిస్తాను అని ముగ్గురు కూడా ఏకలింగంకు వార్నింగ్ ఇస్తారు.

Also Read : బాలును క్షమించిన మీనా.. రోహిణికి మరో చిక్కు.. అసలు నిజం తెలిసిపోతుందా..?

అవని అక్షయ్ తన గురించి గొప్పగా మాట్లాడాడు అని సంతోష్ పడుతూ ఉంటుంది.. తను బాగా ప్రేమిస్తున్నాడు అని మురిసిపోతూ ఉంటుంది. ఆయనతో మాట్లాడాలి అని ఆత్రుతగా ఎదురుచూస్తుంది.. అక్షయ్ కు ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తాడు. నా ఫోన్ కట్ చేస్తున్నాడు ఏంటి అని అవని అనుకుంటుంది.. ఈయన ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడికి వెళ్లాలి అని అనుకుంటుంది.. అక్షయ్ కోసం అవని వెతుక్కుంటూ వెళ్తుంది. ఇక అక్షయ్ అవని పై ఉన్న ప్రేమని పాట రూపంలో చూపిస్తాడు. వీరిద్దరి డ్యూయెట్ సాంగు ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచింది.. ఆ తర్వాత అక్షయ్ అవని వాళ్ళు స్కూల్లోని పిల్లలకి భోజనం పెడతారు. ఆ భోజనం చాలా బాగుందని పిల్లలు తింటూ ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో అక్షయ్ ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×