E-Paper
Advertisement

Bharat Future City: తెలంగాణలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ.. టార్గెట్ ఫిక్సయ్యింది.. కేవలం 30 నెలలు

Bharat Future City: తెలంగాణలో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ.. టార్గెట్ ఫిక్సయ్యింది.. కేవలం 30 నెలలు
Advertisement

Bharat Future City: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోంది భారత్ఫ్యూచర్సిటీ నిర్మాణం. దీనికి సంబంధించి పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసింది. కొత్తగా పోలీసు కమిషనరేట్‌ని ఏర్పాటు అయ్యింది. అదే పేరుతో కొత్త జిల్లా ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రేపో మాపో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన రానుంది. 

భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి అడుగులు

Advertisement

ఫ్యూచర్ సిటీపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి సంబంధించి తెర వెనుక పనులు వేగంగా జరుగుతున్నాయి. సీఎం రేవంత్‌‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ శివార్లలో 30,000 ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది.

ఈ సిటీపై ప్రాజెక్టు నివేదిక-DPRను సిద్ధం చేయడానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్‌కి చెందిన గ్లోబల్ కన్సల్టెన్సీ సుర్బానా జురాంగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. 15 వేల ఎకరాల్లో వివిధ క్లస్టర్‌ల జోన్లను ఏర్పాటు చేయనుంది. దాని ఆధారంగా ప్రభుత్వం వివిధ రంగాలకు భూములు కేటాయించనుంది.

Advertisement

టార్గెట్ ఫిక్సయ్యింది.. కేవలం 30 నెలలు మాత్రమే

నైపుణ్య విశ్వవిద్యాలయం, ఏఐ, ఎలక్ట్రానిక్స్‌ సిటీ, స్పోర్ట్స్‌ సిటీ, లైఫ్ సైన్స్, ఐటీ, ఫిల్మ్ వంటి సిటీలను అక్కడ నిర్మించనున్నారు. వీటితోపాటు 11 టౌన్‌షిప్‌లు రాబోతున్నాయి. ఈ ప్రాంతంలో ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో దాదాపు 70 శాతం సంస్థల కార్యాలయాలు ఫ్యూచర్‌సిటీలో ఉండాలన్నది ముఖ్యమంత్రి ప్లాన్. దీనికి  గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తుంది.

పారదర్శకత, ఉన్నత ప్రమాణాల అమలులో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా ఉండటానికి గ్లోబల్ టెండరింగ్ ప్రక్రియను ప్రభుత్వం ఎంచుకుంది. చుట్టుపక్కల గ్రామాలను విలీనం చేయడం ద్వారా ఫ్యూచర్ సిటీ విస్తీర్ణాన్ని దాదాపు రెండు లక్షల ఎకరాలకు పెంచినట్టు తెలుస్తోంది. 

ALSO READ: కృష్ణా జలాలపై అసత్య ప్రచారం.. సీఎంపై హరీష్‌రావు ఫైర్

56 రెవెన్యూ గ్రామాలను కవర్ చేసే సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయడానికి ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీFCDA ఈనెల నుంచి ప్రతిపాదనల కోసం అభ్యర్థనలను ఆహ్వానిస్తుందని ప్రభుత్వ వర్గాల మాట. 15 వేల ఎకరాల కోర్ సిటీ అభివృద్ధికి ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. మిగతా 15 వేలు ఎకరాలు అటవీ-పట్టణ ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తోందట.

ఫ్యూచర్ సిటీ అధిక భాగం ముచ్చెర్ల-మీర్ఖాన్‌పేట్- కందుకూరు గ్రామాల పరిధిలో విస్తరించనుంది. అక్కడ 11 టౌన్‌షిప్‌ల రూపకల్పన కోసం వ్యవహారాలను చూసేందుకు ఫ్యూచర్‌సిటీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫీసుని అందుబాటులోకి తీసుకొచ్చింది.  వీటన్నింటికి కేవలం 30 నెలల్లో నిర్మించాలన్నది ప్రభుత్వం ఆలోచనగా అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు.  

 


Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×