E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి కోరికను తీర్చిన అక్షయ్..అవని పై పార్వతి సీరియస్.. చక్రధర్ కు దిమ్మతిరిగే షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి కోరికను తీర్చిన అక్షయ్..అవని పై పార్వతి సీరియస్.. చక్రధర్ కు దిమ్మతిరిగే షాక్..
Advertisement

Intinti Ramayanam Today Episode January 16th : నిన్నటి ఎపిసోడ్ లో.. రాత్రి భానుమతి కోటిలింగం ఇద్దరు కలిసి కళ్ళజోడు దుప్పటి కోసం వెతుకుతూ ఉంటారు. ఎక్కడుంది బామ్మ గారు చాలాసేపటి నుంచి మనం వెతుకుతున్నాం కదా కనిపించలేదు ఏంటి అని కోటిలింగం అంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చిన ఆరాధ్య కోటిలింగం దగ్గరకొచ్చి ఏంటి కోటి ఏం వెతుకుతున్నావు అని అడుగుతుంది. బామ్మ గారి దుప్పటి కనిపించలేదంట ఎక్కడుందా అని వెతుకుతున్నాము అని అంటాడు. ఆ తర్వాత ఆరాధ్య చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా పెట్టుకున్నట్లు ఉంది మీరు అని అంటుంది. నువ్వు వేసుకున్న అదొక్కటి భామదే అని అనగానే ఫోన్ తీసుకొని ఆ దుప్పటి ను చూసి భానుమతి కోటిలింగంపై సీరియస్ అవుతుంది.. నేను ఇందాక చలికి జలుబు వస్తే దానికి తుడుచుకున్నాను బామ్మ గారు అని అనగానే భానుమతి ఆ దుప్పటి కింద పడేస్తుంది.. తన భార్య కడుపుతో ఉందని కమల్ తన తండ్రిని తీసుకొని వస్తే గాని ఈ పూజ చేసుకోదు అని అంటుందని చెప్తాడు. ఉదయం లేవగానే పల్లవి వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారని కమల్ చెప్పగానే అందరు షాక్ అవుతారు. మొత్తానికి పల్లవిని ఆశీర్వదించడానికి పూజను ఏర్పాటు చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్రధర్ రాజేశ్వరి వచ్చారని చూసిన పల్లవి చాలా సంతోషంగా ఉంటుంది.. అత్తయ్య మామయ్య వచ్చారని కమల్ కూడా బయటకు వెళ్లి వాళ్ళని లోపలికి తీసుకొని వస్తారు. చక్రధర్ అవని పై సీరియస్ గా ఉంటాడు.. చక్రధరి ఇంట్లోకి రాగానే పల్లవి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. మీరు వస్తారని నేను అసలు ఊహించలేదు డాడ్ నాకు చాలా సంతోషంగా ఉంది అని పల్లవి అంటుంది.. ఇంట్లోని వాళ్ళందరూ కూడా చక్రధర్ వచ్చారని చాలా సంతోషంగా ఉంటారు.. మీరు జైలుకు వెళ్లారని బాధగా ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చారు కదా మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు..

Advertisement

పార్వతి ఎలా ఉన్నారు అన్నయ్యగారు అని అడగ్గానే చక్రధర్ నేనేమీ హాస్పిటల్ కి వెళ్లి రాలేదమ్మా జైలుకు వెళ్లొచ్చాను అని అంటాడు. మొత్తానికైతే పల్లవి శ్రేయాలకు ఒడి నింపే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు. అయితే చక్రధర్ కొత్తగా ఎంట్రీ ఇవ్వడంతో కోటిలింగం మీతో నేను ఒక రీల్ చేయాలనుకుంటున్నాను మీరు ఒకసారి నవ్వండి అని అంటాడు. చక్రధర్ నవ్వగానే అచ్చం విలన్ లాగే ఉన్నారు ఎప్పుడు నవ్వకండి అని అంటాడు. ఆ మాట వినగానే చక్రధర్ కోపంతో కోటిలింగాన్ని కింద పడేస్తాడు.. ఆ తర్వాత ఎవడు వీడు నా గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని రాజేంద్రప్రసాద్ ని అడుగుతాడు. పనికి రాజేంద్రప్రసాద్ మాకు ఊర్లో పరిచయమయ్యాడు మనిషి పెరిగాడు కానీ బుద్ధి మాత్రం పెరగలేదు మీరు ఏమి తప్పుగా అనుకోకండి బావగారు అని అంటాడు.

ఆ తర్వాత అందరూ కలిసి పల్లవికీ ఒడినింపే కార్యక్రమాన్ని చేస్తారు.. అందరూ కలిసి చాలా సంతోషంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు.. అయితే అందరూ కార్యక్రమం అయిన తర్వాత భోజనం చేద్దామని అంటారు.. కానీ అవని మాత్రం మీరు ముందుగా భోజనం చేయండి బాబాయ్ గారు అని అడుగుతుంది. అందరూ ఉన్నాం కదా అందరం కలిసే భోజనం చేద్దాము అని చక్రధర్ అంటాడు. అయితే అప్పుడే ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ ఇస్తారు. అదేంటి పోలీసులు వచ్చారు అని అందరూ ఆశ్చర్యపోతారు.

Advertisement

మిమ్మల్ని అక్షయ్ గారు రెండు గంటలు పరిమిషన్ తీసుకుని బయటికి తీసుకొచ్చారు. మీకు ఇచ్చిన టైం పూర్తయింది మనం జైలుకు వెళ్లాలి రండి అని ఎస్ ఐ అంటాడు.. అయితే అదేంటి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? అక్షయ్ ఇంత మోసం చేస్తారని నేను అసలు ఊహించలేదు అని అంటాడు. ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. చక్రధర్ చూసావా నేను ఎవరిని హత్య చేసి జైలుకు వెళ్ళలేదు.. మీ వాళ్ళ లాగా మోసం చేసి నమ్మించి ఇలా తీసుకురాలేదు. ఇప్పుడు నువ్వేమంటావు రాజేశ్వరి మీ వాళ్ళు చేసిన మోసాన్ని నువ్వు ఎలా తీసుకుంటావో అని చక్రధర్ సీరియస్ అవుతాడు.

అక్కడే ఉన్న అవని ఒక పది నిమిషాలు ఆగండి ఎస్ఐ గారు ఆయన భోజనం చేసి వస్తాడు అని అంటుంది… దానికి చక్రధర్ నీ భోజనానికి మొహం వచ్చి ఇక్కడికి వచ్చాను అని అనుకుంటున్నావా నాకేం అక్కర్లేదు పదండి అని అరుస్తాడు.. ఇక పోలీసులు చక్రధర్ ని మళ్లీ తీసుకుని వెళ్తారు. పల్లవి రాజేశ్వరి ఇద్దరూ కలిసి పోలీసుల వెనకాలే వెళ్లిన సరే చక్రధర్ ను వదలరు. ఇక ఇంట్లోకి వచ్చిన రాజేశ్వరి అక్షయ పై సీరియస్ అవుతుంది. అరే అక్షయ్ నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు. ఇలా బెయిల్ మీద బయటకు తీసుకొస్తున్నావని అనుకున్నాం కానీ నువ్వు మాత్రం ఇలా చేస్తావని అస్సలు నేను అనుకోలేదు ఇంత మోసం చేస్తావా అని అక్షయ్ కాలర్ పట్టుకుని రాజేశ్వరి అడుగుతుంది.

Also Read :తాగొచ్చిన బాలు.. కన్నీళ్లు పెట్టుకున్న మీనా.. క్లాస్ పీకిన సత్యం..

భానుమతి కూడా నా కూతురు కళ్ళల్లో నీళ్లు చూడకూడదని అనుకున్నాను మళ్ళీ నువ్వు తనని ఎందుకురా ఇంతగా బాధ పెడుతున్నావు అని అంటుంది. ఇక అక్షయ్ నేను కేవలం తమ్ముడి కోసం మాత్రమే అతని బయటికి తీసుకొచ్చాను. ఇవి కోరిక తీర్చాలి అని కమల్ అనగానే నేను అతని తీసుకొచ్చి పల్లవికి పూజ చేసేలా చేశాను. నన్ను తప్పుగా అనుకోవద్దు అని అక్షయ్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవి కడుపుతోందా లేదా అన్న అనుమానం అవనికి వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×