E-Paper
Advertisement

Manoj Tiwary: మ‌నోళ్ల‌కు చీము నెత్తురు ఉంటే, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో బంగ్లాతో ఒక్క మ్యాచ్ ఆడొద్దు..ఫైన‌ల్స్ అయినా బైకాట్ చేయాలి

Manoj Tiwary: మ‌నోళ్ల‌కు చీము నెత్తురు ఉంటే, టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో బంగ్లాతో ఒక్క మ్యాచ్ ఆడొద్దు..ఫైన‌ల్స్ అయినా బైకాట్ చేయాలి
Advertisement

Manoj Tiwary:  ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా ఇండియాలో పర్యటించబోమని బంగ్లాదేశ్ చెబుతుంటే.. ఐపీఎల్ లో బంగ్లాదేశ్ క్రికెటర్లను ఆడించకూడదని బీసీసీఐ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. దానికి తోడు ఐపిఎల్ 2025 ప్రసారాలపై బ్యాన్ కూడా విధించింది బంగ్లాదేశ్ సర్కార్. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. వారానికి ఒకరు లేదా ఇద్దరు హిందువులు మరణిస్తున్నారు. అయితే ఈ సంఘటన నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి   ( Manoj Tiwary )  సంచలన వ్యాఖ్యలు చేశారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో ( T20 World Cup 2026 tournament ) బంగ్లాదేశ్ తో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడకూడదని కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read: Harleen doel Retire Out: రీల్స్ పాప హర్లీన్ డియోల్ కు ఘోర అవ‌మానం..యూపీ కొంప‌ముంచిన‌ “రిటైర్ట్ ఔట్”

బంగ్లాదేశ్ తో ఒక్క మ్యాచ్ ఆడకండి

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టుతో ఒక్క మ్యాచ్ కూడా ఆడకూడదని టీమిండియా జట్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు మనోజ్ తివారి. బంగ్లాదేశ్ లో హిందువులు చాలామంది మరణిస్తున్నారు.. ఇలాంటి నేపథ్యంలో వాళ్లతో మనం ఒక్క మ్యాచ్ ఆడిన తప్పే అవుతుంది అని వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్ ఏ కాదు పాకిస్తాన్, ఆస్ట్రేలియా అలాగే ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో కూడా మన హిందువులను చంపేస్తే.. ఆ జట్లతో క్రికెట్ అస్సలు ఆడకూడదు అంటూ బాంబు పేల్చారు మనోజ్ తివారి. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో బంగ్లాదేశ్ తో టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్ జరిగిన కూడా… ఆ మ్యాచ్ నుంచి టీం ఇండియా వైదొలగాలని కోరారు. అప్పుడే మన హిందువులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు మనోజ్ తివారి.

బంగ్లాదేశ్, ఇండియా మధ్య గొడవ ఏంటి ?

ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య గత కొన్ని రోజులుగా గ్యాప్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ అన్న బంగ్లా క్రికెటర్ ను తప్పించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఐపీఎల్ 2026 టోర్నమెంట్లో ( T20 World Cup 2026 tournament )  అతను ఆడకుండా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది బీసీసీఐ. దీంతో ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రసారాలపై తమ దేశంలో బ్యాన్ విధించింది బంగ్లాదేశ్ సర్కార్. అంతేకాదు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఇండియాలో జరుగుతున్న నేపథ్యంలో.. తాము భారత్ లో పర్యటించబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేస్తోంది. ఈ మేరకు ఐసీసీకి కూడా బహిరంగ లేఖ రాసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. అయితే దీనికి ఐసీసీ ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఆడితే ఆడండి ? లేకపోతే మీ జీతాలు కట్ చేస్తామని హెచ్చరించింది.

Advertisement

Also Read: T20 World Cup 2026: ఇండియ‌న్ ఏజెంట్ కామెంట్స్‌..BCBపై బంగ్లా క్రికెట‌ర్ల తిరుగుబాటు, వాడు రాజీనామా చేయాలంటూ

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×