E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ఆస్తి కోసం శ్రీయ రచ్చ.. తండ్రికోసం కమల్ కన్నీళ్లు.. రాజేంద్రను లేపేసేందుకు పల్లవి ప్లాన్..

Intinti Ramayanam Today Episode: ఆస్తి కోసం శ్రీయ రచ్చ.. తండ్రికోసం కమల్ కన్నీళ్లు.. రాజేంద్రను లేపేసేందుకు పల్లవి ప్లాన్..
Advertisement

Intinti Ramayanam Today Episode February 9th: నిన్నటి ఎపిసోడ్ లో..  పల్లవి బ్రెస్లైట్ ని చూసిన ఆరాధ్య అలాంటి బ్రాస్లెట్ నాకు కావాలి అని అవనిని అడుగుతుంది. అవని పల్లవిని అడిగి ఒకసారి ఎక్కడుందో చూద్దాం పదనేసి అంటుంది. కానీ పల్లవి మాత్రం చూపించడానికి అస్సలు ఒప్పుకోదు. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే నా దగ్గర ఉన్న వస్తువులు వేరే వాళ్ళ దగ్గర ఉంటే నాకు నచ్చవు. అందుకే నేను ఆ బ్రేస్లెట్ ని నీకు చూపించను అని పల్లవి అంటుంది.. చిన్నపిల్లల దగ్గర కూడా ఇలాంటి పనులు చేస్తావా నువ్వు అని అవని పల్లవిని తిట్టేసి వెళ్ళిపోతుంది. పార్వతి ఏదో ఆలోచిస్తూ వస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది..

అయ్యో పార్వతి ఏంటి నువ్వు ఇలా పడిపోతున్నావు అని భానుమతి ఆమెను పట్టుకుంటుంది. ఏమైంది అమ్మకి బీపీ టాబ్లెట్ ఇవ్వట్లేదా అని అక్షయ్ అడుగుతాడు. అందరూ టెన్షన్ పడిపోతూ నీళ్లు కొట్టి లేపుతారు. అయితే ఆ పార్వతి రాజేంద్రప్రసాద్ కి అలా జరిగినప్పటి నుంచి ఏమీ తినలేదు అని భానుమతి అంటుంది. నువ్వు ఇలా ఉంటే నీ ఆరోగ్యానికి ఇబ్బంది కదమ్మా నువ్వు ఎందుకు తినట్లేదు అని అక్షయ్ అడుగుతాడు.. ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియలేదు కదా నాకు కంగారుగా ఉంది అందుకే తినాలనిపించట్లేదు అని పార్వతి అంటుంది.. రాజేంద్రప్రసాద్ కి ఏమవుతుందని ఇంట్లోని వాళ్ళందరూ టెన్షన్ పడిపోతుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీయ ఇంట్లో జరుగుతున్న వాటి గురించి ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటే శ్రీకర్ మా అమ్మ ఎంత బాధ పడిపోతుందో అని అంటాడు. ఇంట్లోని వాళ్ళు బాధపడుతుంటే మనం బాధపడడం టైంకి అన్నం తినడం, ఇవే తప్ప మనకు ఇష్టమైన జీవితాన్ని గడిపే అవకాశం లేనేలేదు కదా మీ నాన్న ఆస్తిపంచకుండా కొమ్మల్లోకి వెళ్లిపోయాడు. అసలు తిరిగి వస్తాడు లేదో అసలు బ్రతుకుతాడో లేదో కూడా తెలియడం లేదు మనము ఇక ఆస్తిని పంచుకున్నట్లే అంటుంది. మీ నాన్న మనకు డబ్బులు ఇచ్చి ఉంటే మన దారి మనం చూసుకునే వాళ్ళం కాదా అని శ్రేయ దారుణంగా మాట్లాడడంతో శ్రీకర్ శ్రీయా ని కొట్టబోతాడు.. ఆస్తి గురించి ఆశపడడం పరవాలేదు కానీ మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు.

హాస్పిటల్లో ఉన్న కమల్ తన తండ్రిని తండ్రితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు.. నీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంది కానీ నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావంటే నాకు కన్నీలాగడం లేదు నాన్న అని బాధపడిపోతూ ఉంటాడు కమల్. నువ్వు లేననా మళ్లీ ఎప్పుడూ మా మధ్య తిరుగుతావు అని బాధ పడిపోతూ కమల్ కన్నీళ్లు పెట్టుకుంటాడు.. అప్పుడే అక్కడికి వచ్చినా అవని అక్షయలు నాన్న పరిస్థితి ఎలా ఉంది అని కమల్ని అడుగుతారు. నాన్న కోమలో ఉన్నారని డాక్టర్ చెప్తున్నారు. అయితే మనకి ఆయనతో గడిపిన క్షణాలని గుర్తు చేస్తే మళ్లీ తిరిగి వస్తారని ఆశతో నేను రాత్రంతా నాన్నతో మాట్లాడుతూనే ఉన్నాను.

Advertisement

కానీ నాన్నలో మాత్రం ఎటువంటి చలనం లేదు అని కమల్ అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ మా నాన్నగారి పరిస్థితి ఎలా ఉందండి. ఇప్పట్లో మా నాన్నగారు మామూలు వారు అవుతారా? ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అని అక్షయ్ అడుగుతాడు.. మా నాన్న మా మధ్య లేకపోతే ఏదోలా ఉంది ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని డాక్టర్ని అక్షయ్ అడుగుతాడు. అప్పుడు డాక్టర్ ఇక్కడ ఆయన కోమలికి వెళ్లే ప్రమాదం ఉంది. మీ ఇంటికి వెళ్లి ఆయనకి ఇష్టమైన పనులు చేస్తూ ఆయన దృష్టిలో మళ్లీ మీరు మంచిగా ఉన్నారు. అన్న ఆశని కలిగిస్తే కోలుకుంటారేమో చూడాలి అని డాక్టర్ అంటాడు…

Also Read :ఒక్క మిస్టేక్ తో శుభం కార్డు పడబోతున్న సీరియల్స్.. రేటింగ్ లో టాప్ అదే..

ఇక మాట వినగానే అవని అక్షయలు ఇద్దరు కూడా మేము మా నాన్నని తీసుకొని వెళ్తాము అని అంటారు. శ్రీకర్ ఫోన్ చేసి నాన్నగారి పరిస్థితి ఎలా ఉంది అని అక్షయ్ ని అడుగుతారు.. డాక్టర్ చెప్పిన విషయాన్ని స్పీకర్తో చెప్పిన అక్షయ్ అంతా సిద్ధం చేయమని చెప్తాడు. ఆ మాట వినగానే శ్రీకర్ చాలా సంతోషంగా ఇంట్లోని వాళ్లందరికీ చెప్తాడు. అప్పుడే అవని అక్షయ్ కమల్ రాజేంద్ర ప్రసాద్ ని తీసుకొని వస్తారు. ఆయన్ని చూసి నా ఇంట్లోనే వాళ్ళందరూ ఎమోషనల్ అవుతారు. కానీ పల్లవి మాత్రం నా వంకే చూస్తున్నాడు నా గురించి నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×