E-Paper
Advertisement

Thriller Movie OTT : తమ్ముడి చావుకి అన్న రివేంజ్… గ్యాంగ్ వార్ తో దద్దరిల్లే కొరియన్ క్రైమ్ థ్రిల్లర్

Thriller Movie OTT : తమ్ముడి చావుకి అన్న రివేంజ్… గ్యాంగ్ వార్ తో దద్దరిల్లే కొరియన్ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Thriller Movie OTT  : ఓటీటీలలో రాజ్యమేలుతున్న సినిమాలలో కొరియన్ డ్రామాలు ముందు వరుసలో ఉంటాయి. ఈ సినిమాలు, సిరీస్ లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండడంతో ఇలా ఓటీటీలోకి రాగానే, అలా ట్రెండింగ్ లో కన్పిస్తాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా అలాంటిదే. కాకపోతే బ్లడీ బ్లడ్ బాత్ ను ఇష్టపడే వాళ్ళకు మాత్రం ఐ ఫీస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇదొక రివేంజ్ డ్రామా. యాక్షన్ ప్రియులు ఇష్టపడే బ్రూటల్ సీన్లు ఇందులో చాలానే ఉంటాయి. మరి ఈ చిత్రాన్ని ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

దక్షిణ కొరియా నుంచి వచ్చిన నియో-నాయిర్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘నాక్టర్నల్ (Nocturnal)’. (ఒరిజినల్ టైటిల్: Beurokeun). టైటిల్ అర్థం “బ్రోకెన్”. 2025లో విడుదలైన ఈ మూవీకి దర్శకుడు కిమ్ జిన్-హ్వాంగ్ దర్శకత్వం వహించారు. బ్లడ్ బాయిల్ అయ్యే ఈ రివేంజ్ డ్రామాలో మిస్టరీ, ఫ్యామిలీ డ్రామా వంటి అంశాలు కూడా ఉంటాయి. మెయిన్ రోల్స్‌లో హా జంగ్-వు (బాయ్ మిన్-టే), కిమ్ నామ్-గిల్ (కాంగ్ హో-ర్యాంగ్), యూడా-ఇన్ (చా మూన్-యంగ్) నటించారు. 1 గంట 40 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. వయలెన్స్, డార్క్ థీమ్స్ ఉండడం వల్ల ఈ మూవీ పెద్దలకు మాత్రమే అని గుర్తు పెట్టుకోండి. IMDbలో దీనికి 6.0 రేటింగ్ ఉంది. బ్రూటల్, హెవీ ఎమోషనల్‌ సీన్స్ ఉన్నాయని మరచిపోవద్దు.

కథలోకి వెళ్తే…

Advertisement

బే మిన్-టే (హా జంగ్-వు) అనే మాజీ గ్యాంగ్‌స్టర్ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. జైలు నుంచి బయట పడిన తర్వాత ఆయన శాంతియుత లైఫ్ ను గడుపుతాడు. కన్‌స్ట్రక్షన్ సైట్‌లో పని చేస్తూ, గతాన్ని మరచిపోయి హాయిగా జీవితాన్ని ఆస్వాదిస్తాడు. కానీ ఒక రోజు అతని చిన్న సోదరుడు బే సోక్-టే మరణించినట్టు తెలుస్తుంది. హీరో తమ్ముడు డ్రగ్ అడిక్ట్. పైగా అతనికి కొన్ని క్రైమ్ కనెక్షన్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అతని శవం ఒక బార్‌ లో దొరుకుతుంది. సోక్-టే గర్ల్‌ఫ్రెండ్ చా మూన్-యంగ్ (యూడా-ఇన్) కూడా మిస్ అవుతుంది. విషయం తెలుసుకున్న మిన్-టే ఆగ్రహంతో, ప్రతీకారంతో ఆమెను వెతకడం మొదలెడతాడు.

పోలీసులు, గ్యాంగ్ స్టర్ బాస్, డ్రగ్ కేసులు అన్నీ ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. పోలీసులు మూన్-యంగ్‌ని మెయిన్ సస్పెక్ట్‌గా చూస్తారు. మిన్-టే ఆమెను కనుగొని నిజం ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. అదే సమయంలో ఒక ఫేమస్ నవలా రచయిత కాంగ్ హో-ర్యాంగ్ (కిమ్ నామ్-గిల్) కూడా మూన్-యంగ్‌ ని వెతుకుతాడు. అతని లేటెస్ట్ బెస్ట్‌సెల్లర్ నవల “నాక్టర్నల్”లో సోక్-టే మరణం లాంటి ఈవెంట్స్ ముందే ఊహించినట్టుగా ఉంటాయి, మూన్-యంగ్ జీవితంతో సిమిలర్‌ గా ఉంటుంది ఆ నవల. అందుకే మిన్-టే ఈ నవలా రచయితని కలుస్తాడు. నవలలో ఎలా రియల్ ఈవెంట్స్‌ ని ప్రిడిక్ట్ చేసి రాశారు ? మూన్-యంగ్ ఎందుకు పారిపోయింది ? అనేది తెరపై చూడాల్సిన విషయం. గ్యాంగ్ స్టర్లు, పోలీస్, రచయిత మధ్య నడిచే సీన్స్ తో కథ పరుగులు పెడుతుంది. సీన్ సీనుకో ట్విస్ట్ తో ఉత్కంఠభరితంగా ఉంటుంది.

Advertisement

Read Also : 670 కోట్ల బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×