E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవి గుట్టు రట్టు..రాజేశ్వరికి అక్షయ్ వార్నింగ్.. జైలు నుంచి చక్రధర్ రిలీజ్..

Intinti Ramayanam Today Episode: పల్లవి గుట్టు రట్టు..రాజేశ్వరికి అక్షయ్ వార్నింగ్.. జైలు నుంచి చక్రధర్ రిలీజ్..
Advertisement

Intinti Ramayanam Today Episode February 22nd: నిన్నటి ఎపిసోడ్ లో.. తన తండ్రి కోరిక మేరకు ముగ్గురు అన్నదమ్ములు కూడా బిజినెస్ చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అయితే తమ పనికి వెళ్లడానికి ముందు నాన్నగారి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటారు. ఇలా ముగ్గురిని కలిసి చూసిన శ్రేయ మొదట చాలా సంతోషంగా ఉంటుంది.. పల్లవి వచ్చి తన సంతోషానికి చిచ్చుపెట్టేస్తుంది.. నా మొగుడు అంటే వినడు కనీసం నీ మొగుడిని అయినా నీ మాట వినిలా కంట్రోల్లో పెట్టుకోవచ్చు కదా.. అక్షయ్ బావ నీ మొగుడిని నా మొగుడిని కుడి భుజం ఎడమ భుజం లాగా చేసుకున్నాడు.. అక్కడ బిజినెస్ లో మనకు వచ్చే లాభాలు ఏమీ లేవు.. నువ్వు ఇలా నోరు మూసుకొని ఉంటే ఎలా అని శ్రేయాని పల్లవి రెచ్చగొడుతుంది.. వాళ్లు ముగ్గురు వెళ్తుంటే శ్రేయ మీరు ఆగండి అని శ్రీకర్ని ఆపుతుంది. శ్రియ మీ అన్నయ్యలతో వెళ్లి నువ్వు బిజినెస్ చేసిన ప్రయోజనం ఏమీ లేదు కదా ఎందుకు నువ్వు ఇప్పుడు వాళ్లతో వెళ్లడం నువ్వు ఎక్కడికి వెళ్లడానికి వీలు లేదు అని అంటుంది.. కానీ శ్రీకర్ మాత్రం నువ్వు చెప్తే నేను వినాల్సిన అవసరం లేదు ఇది మా ఇంటి సమస్య కాబట్టి నేను వెళ్లి పరిష్కరించాలి అని అంటాడు. ఆ తర్వాత పల్లవి ప్లాన్ ఫెయిల్ అయిందని ఫీల్ అవుతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే.. అభి ని చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళిన అవనికి అక్కడ చక్రధర్ రిలీజ్ కాబోతున్నాడని టీవీలో రావడంతో షాక్ అవుతుంది.. ఆ విషయం నీవెంటనే అక్షయ్ వాళ్లకు చెప్పగానే వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.. శ్రీకర్ అలా ఎలా రిలీజ్ అవుతాడు మనం పిటిషన్ వేద్దాము అని అంటాడు.. అతనికి ఎవరో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి బెయిల్ ఇప్పిచ్చాడట. పోలీసులు కూడా ఏమీ చేయలేక అతను చెప్పినట్లు చేసి చక్రధర్ ని రిలీజ్ చేస్తున్నారు. అతను బయటికి వస్తే మళ్లీ మనకు సమస్యలు తప్పవు అని అవని అంటుంది.. ఇక అక్షయ్ ని పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది.. ఆ చక్రధర్ రిలీజ్ అయితే కచ్చితంగా మా అమ్మని ఏదో ఒకటి చేస్తాడు నాకు భయంగా ఉంది అని అవని టెన్షన్ పడిపోతూ ఉంటుంది..

Advertisement

మనం ఇప్పుడు అర్జెంటుగా ఆ చక్రధరి ఇంటికి వెళ్ళాలి. అక్కడ అతను రిలీజ్ అయ్యాడో తెలుసుకొని అతనిని అడిగి కనుక్కోవాలి అని అనుకుంటారు.. అయితే ముందుగా అనుకున్నట్లుగానే అవని అక్షయ్ ఇద్దరు కూడా చక్రధరి ఇంటికి వెళ్లి పిలుస్తారు. కానీ ఆయన ఇంకా ఇంటికి రాలేదు అని రాజేశ్వరి చెప్పగానే వాళ్ళిద్దరూ కూడా షాక్ అవుతారు. మా ఆయనను రిలీజ్ చేయమని ఎంతగా బతిమలాడినా మీరిద్దరూ ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్లీ మా ఆయన వస్తుంటే మీరు ఎలా జైలుకు పంపించాలని ఆలోచించడానికి వచ్చారని రాజేశ్వరి దారుణంగా మాట్లాడుతుంది. అక్షయ్ ఎంత చెప్తున్నా సరే రాజేశ్వరి మాత్రం వినకుండా తనని తిడుతూనే ఉంటుంది.

మీనాక్షి తన మొదటి భార్యఅని అక్షయ్ చెప్పబోతుంటే అవని మాత్రం వద్దని అంటుంది.. ఇక తర్వాత అక్షయ్ అవనీలలో రాజేశ్వరి నా ఇంటికి ఇంకెప్పుడు రావద్దు అని అంటారు. అతను ఒక దుర్మార్గుడు అని మీకు ఎంత చెప్పినా మీరు వినట్లేదు అత్తయ్య. కానీ అతని వల్ల చాలా మంది సమస్యల్లో పడతారు అన్న విషయం మీకు తెలియట్లేదు అని అక్షయ్ చాలా కూల్ గా సమాధానం చెప్తుంటాడు. మీరు ఇంకెప్పుడూ నా ఇంటికి రావద్దు. నా భర్తకి మీరు చేసిన అవమానం చాలు అని రాజేశ్వరి అంటుంది. అవని ఎంత చెప్పాలని చూస్తున్నా కానీ తన భర్త జైలుకు వెళ్లడానికి కారణం అవనీని అని తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకుంటుంది.

Advertisement

వాడి గనక ఇంటికి వస్తే మా అమ్మకి ప్రాబ్లం అవుతుంది. మా అమ్మని కచ్చితంగా చంపేస్తాడు అని అవని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడొద్దు అవనీ ఇకముందు నేను మీకు తోడుగా ఉంటాను కాబట్టి మీరు భయపడకండి అని అంటాడు. మీ అమ్మని ఒక సేఫ్ ప్లేస్ లో దాచి పెట్టాలి అప్పుడే వాడికి తెలియకుండా ఉంటుంది అని అక్షయ్ అవని ఇద్దరు కూడా మీనాక్షి దగ్గరికి వెళ్తారు. అయితే మీనాక్షి కోసం వెళ్ళిన వాళ్ళకి దిమ్మ తిరిగే షాక్ ఎదురవుతుంది. భరత్ బయటికి వెళుతుండగా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావ్ రా అని ఆపుతారు.. నేను మీ ఇంటికి వస్తున్నాను అని అంటాడు..

Also Read :మీనా, శృతి డ్రామా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ..మీనాకు దిమ్మతిరిగే షాక్..

సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి మా ఇంటికి ఎందుకురా రావడం ఏమైంది అని అవని అడుగుతుంది. అమ్మ మీ ఇంటికి వచ్చిందేమో అని అడుగుదామని చూసొద్దామని, నేను ఒకసారి మీతో మాట్లాడినట్టు కూడా ఉంటుంది కదా అని బయలుదేరాను అని భరత్ అన్నాడు.. అమ్మ మా ఇంటికి రావడం ఏంట్రా అసలు ఎక్కడికి వెళ్ళింది. ఏమో అక్కా నిన్ను చూసి కనిపించలేదు నేను ఇంకా మీ ఇంటికి వచ్చిందేమో అని అనుకున్నాను. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇక్కడ లేకుండా అక్కడ లేకుండా.. ఒకసారి ఎక్కడుందో పెట్టుకుందాం పదండి అని భరత్ అవని ఇద్దరు కూడా మీనాక్షిని బ్రతకడానికి వెళ్తారు. మా అమ్మ కనిపించలేదు అంటే ఇది కచ్చితంగా చక్రధర్ పని అయి ఉంటుంది అని అవని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×