E-Paper
Advertisement

Feel good Movie OTT: కొడుకు కోసం మేకను బలి… మొక్కు తీర్చుకునేందుకు పేద రైతు అవస్థ… ఓటీటీలోకి తమిళ డ్రామా

Feel good Movie OTT: కొడుకు కోసం మేకను బలి… మొక్కు తీర్చుకునేందుకు పేద రైతు అవస్థ… ఓటీటీలోకి తమిళ డ్రామా
Advertisement

Feel good Movie OTT : ఓటీటీలోకి మరో తమిళ సినిమా స్ట్రీమింగ్ లోకి వచ్చింది. ఈ సినిమా ఒక పేద రైతు చుట్టూ తిరుగుతుంది. అతను దేవుడికి మేకను బలి ఇస్తానని మొక్కుకుంటాడు. ఆ తరువాత స్టోరీ ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది. ఈ కథ చాలా సహజ పద్దతిలో తీయడం జరిగింది. పల్లెటూరి జీవన శైలిని, అక్కడి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించారు ఇందులో. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

‘ఒండిమునియుమ్ నల్లపాడనుమ్’ (Ondimuniyum Nallapadanum) 2025లో విడుదలైన ఒక తమిళ డ్రామా సినిమా. ఈ చిత్రం కొంగు ప్రాంతంలోని గ్రామీణ జీవనశైలి, దైవభక్తి చుట్టూ తిరుగుతుంది. 2025 నవంబర్ 28న థియేటర్లలో రిలీజ్ అయింది ఈ సినిమా. 2026 ఫిబ్రవరి 20 నుండి Sun NXT ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. సుగవనం .ఆర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పరోటా మురుగేషన్, విజయన్ దియా, విద్యా శక్తివేల్ ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి సంగీతం నటరాజన్ శంకరన్ అందించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక మారుమూల గ్రామంలో నల్లపాడన్ అనే ఒక పేద రైతు ఉంటాడు. తన కొడుకు ప్రాణాపాయం నుండి కోలుకున్నందుకు మొక్కుగా, తమ కులదైవం ఒండిమునికి తన మేకను బలి ఇస్తానని మొక్కుకుంటాడు. అయితే అదే సమయంలో ఆ ఊరిలోని ఇద్దరు పెద్దల మధ్య గొడవలు మొదలవుతాయి. దీనివల్ల గ్రామంలోని గుడి మూతపడటమే కాకుండా, అక్కడ ఎటువంటి పండుగలు, పూజలు జరగకుండా ఆగిపోతాయి. తన మొక్కును తీర్చుకోవాలని నల్లపాడన్ ఎంత ప్రయత్నించినా, ఊరి పెద్దల అహంకారం, కుల రాజకీయాలు అతనికి అడ్డుపడతాయి. ఒక మామూలు రైతు తన మొక్కును తీర్చుకోవడానికి, ఆ ఊరిలో ఉన్న గొడవలను దాటుకుని ఎలా వెళ్ళాడు ? తన మొక్కును ఎలా తీర్చుకున్నాడు ? అసలు ఆ ఊరిలో ఉన్న గొడవలు ఏమిటి ? అనే విషయాలను, ఈ తమిళ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : జోంబీగా మారే కూతురు… తండ్రి మాస్టర్ ప్లాన్… ఒక్కసారి చూస్తే జీవితంలో మర్చిపోలేరు భయ్యా

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×