E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: తండ్రి కోసం కొడుకులు ప్రయత్నాలు.. రాజేంద్రను చంపేందుకు ప్లాన్..పల్లవి పై అవనికి అనుమానం..

Intinti Ramayanam Today Episode: తండ్రి కోసం కొడుకులు ప్రయత్నాలు.. రాజేంద్రను చంపేందుకు ప్లాన్..పల్లవి పై అవనికి అనుమానం..
Advertisement

Intinti Ramayanam Today Episode February 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. శ్రీయ ఇంట్లో జరుగుతున్న వాటి గురించి ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటే శ్రీకర్ మా అమ్మ ఎంత బాధ పడిపోతుందో అని అంటాడు. ఇంట్లోని వాళ్ళు బాధపడుతుంటే మనం బాధపడడం టైంకి అన్నం తినడం, ఇవే తప్ప మనకు ఇష్టమైన జీవితాన్ని గడిపే అవకాశం లేనేలేదు కదా మీ నాన్న ఆస్తిపంచకుండా కొమ్మల్లోకి వెళ్లిపోయాడు. అసలు తిరిగి వస్తాడు లేదో అసలు బ్రతుకుతాడో లేదో కూడా తెలియడం లేదు మనము ఇక ఆస్తిని పంచుకున్నట్లే అంటుంది. మీ నాన్న మనకు డబ్బులు ఇచ్చి ఉంటే మన దారి మనం చూసుకునే వాళ్ళం కాదా అని శ్రేయ దారుణంగా మాట్లాడడంతో శ్రీకర్ శ్రీయా ని కొట్టబోతాడు..

ఆస్తి గురించి ఆశపడడం పరవాలేదు కానీ మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు అని వార్నింగ్ ఇస్తాడు. హాస్పిటల్లో ఉన్న కమల్ తన తండ్రిని తండ్రితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు.. నీతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంది కానీ నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావంటే నాకు కన్నీలాగడం లేదు నాన్న అని బాధపడిపోతూ ఉంటాడు కమల్.. అతని ఇంటికి తీసుకుని వెళ్లి మీ ఇంట్లో వాళ్లతో దగ్గరగా చూపిస్తే ఏమైనా గుర్తుకు రావచ్చు అప్పుడు కోమాలోంచి బయటపడవచ్చు అని చెప్పడంతో రాజేంద్రను ఇంటికి తీసుకుని వెళ్తారు.. కోమలో ఉన్నాడన్న సంగతి తెలియక పల్లవి ఎక్కడ తన విషయం బయటపడుతుందని షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. పల్లవి చక్రధర్ ని ఏం చేయాలి అని అడుగుతుంది. ఎక్కడ ఉంటే తనని చంపడం కుదరట్లేదు కదా.. ఇంట్లోనే ఉన్నాడు కదా నువ్వు మన చేతికి మట్టి అంటుకోకుండా సైలెంట్ గా వాడిని సలహా ఇస్తాడు. డాడీ చెప్పింది నిజమే కదా.. మన చేతికి మట్టి అంటుకోకుండా ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేస్తుంది పల్లవి.. అయితే రాజేంద్ర ఎక్కడికి వెళ్తే అక్కడ పల్లవి కూడా ఫాలో అవుతూ వస్తుంది.. ఒక పార్కుకి ముగ్గురు అన్నదమ్ములు తన తండ్రిని తీసుకొని వెళ్లి అక్కడ జరిగిన విషయాలను గుర్తు చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు వాళ్ళు చేసిన అల్లరి ఆటపాటల గురించి రాజేంద్ర కు గుర్తు చేస్తూ ఉంటారు.. ఎలాగైనా సరే నాన్నకు మన విషయాలని గుర్తు చేసి కోమలోనుంచి బయటికి తీసుకురావాలి అని అనుకుంటారు.. వాళ్ల ప్రయత్నాలు చూసి పల్లవి ఈ ముసలోడు కచ్చితంగా బయటికి వచ్చేలానే ఉన్నాడు ఆలోగా నేను విని పైకి పంపించాలి అని అనుకుంటుంది…

ఎలాగైనా సరే రాజేంద్రప్రసాద్ నీ చంపేయాలని అనుకుంటుంది.. కానీ రాజేంద్రప్రసాద్ మాత్రం నోరు తెలిస్తే నా గురించి చెప్పేస్తాడేమో అని కంగారు పడిపోదు ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేస్తుంది.. అయితే అవని ఆరాధ్యకు జ్యూస్ ఇచ్చి రాజేంద్రప్రసాద్ కి ఇవ్వమని చెప్తుంది.. అది చూసిన పల్లవి రాజేంద్రప్రసాద్ ని ఈ జ్యూస్ తోనే చంపేయాలని అనుకుంటుంది.. ఆరాధ్య తీసుకొని వెళ్తుంటే ఆరాధ్య నా ఫోన్ కాస్త తెచ్చి ఇస్తావా ఈ జ్యూస్ నేను పట్టుకుంటాను అని అంటుంది. ఇక ఆరాధ్య ఫోన్ తీసుకొని వచ్చేలోపు అందులో ఏదో కలిపేసి ఇస్తుంది.. ఆరాధ్య నాకు అర్జెంటుగా పాస్ వస్తుందని వెళ్ళిపోతుంది. పల్లవి చేతిలో జ్యూస్ చూసిన కమల్ ఆ జూస్ నాకోసమే తెచ్చావా? ఇటువు నేను తాగుతాను అని అంటాడు..

Advertisement

అయితే నువ్వు కడుపుతో ఉన్నప్పుడు నేను ఎన్ని జ్యూస్ లు ఇవ్వలేదు.. నాకు ఇవ్వు అని ఎంతగా అడుగుతున్న సరే వద్దు బావ అని బాధిస్తూ ఆ జ్యూస్ ని కిందపడిస్తుంది. ఏంటి ఏం జరిగింది అని అవని అక్కడికి వస్తుంది అయినా ఈ జ్యూస్ నేను ఆరాధికి ఇచ్చాను కదా నీ చేతిలోకి ఎలా వచ్చింది అని అవని అంటుంది.. ఇది నేను మావయ్య గారి కోసం కలిపిన జ్యూస్ కదా నీ చేతికి ఎలా వచ్చింది చెప్పు పల్లవి అని అవని పల్లవి పై అనుమానంతో అడుగుతుంది.. ఆరాధ్య వన్ కి వెళ్ళింది అందుకే నాకు ఇచ్చి మావయ్య గారికి ఇవ్వమని చెప్పింది అని అనగానే అవునా అని అవని అంటుంది.

Also Read : కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బిగ్ బాస్ సోనియా.. ఆస్తులు విలువ ఎంతంటే..?

అయితే ఆ గ్లాసును కింద పడాల్సిన అవసరం ఏంటి చెప్తే సరిపోతుంది కదా అనేసి అవని అంటుంది. రాత్రి ప్రణతి భరత్ ఇంటికి రావడం చూసి అందరూ సంతోషంగా ఉంటారు.. నాన్నకు ఇలా జరగడం చాలా బాధగా ఉంది. అని ప్రణతి బాధ పడిపోతూ ఉంటుంది.. ఇక ప్రణతి శ్రేయాన్ని ఎన్నో నెల వదినా అని అడగగానే శ్రేయ పెద్ద రచ్చ చేస్తుంది. ఉన్న నువ్వే నా గురించి అడుగుతున్నావు కానీ ఇంట్లో వాళ్లకి నాకు ఐదో నెల అన్న సంగతి మర్చిపోయారు కనీసం శ్రీమంతం కూడా చేయడం లేదు అని గొడవ గొడవ చేస్తుంది.. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం అవసరమా అని అక్షయ్ తో పాటు ఇంట్లోనే వాళ్ళందరూ కూడా శ్రేయాన్ని తిడతారు.. కానీ ఇంట్లో బాగలేదని నా అచ్చట ముచ్చట తీర్చడం మానేస్తారా అని శ్రేయ పెద్ద గొడవ చేయడంతో అందరూ కూడా బాధపడిపోతూ ఉంటారు.. శ్రేయ ఇలా మాట్లాడటం బాగోలేదు అని అందరూ బాధపడిపోతూ ఉంటారు. పల్లవి మాత్రం ఏదో టెన్షన్ పడుతున్నట్లు అవని అనుకుంటుంది. సరే ఈ ముసలోడని చంపాలని పల్లవి ప్లాన్ చేస్తూ ఉంటుంది.. రాజేంద్రప్రసాద్ ను చూసి పల్లవి షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×