// // Suspense Thriller OTT : డబ్బుకు కొదవే లేదని కొరివితో గోక్కునే.... -->
E-Paper
Advertisement

Suspense Thriller OTT : డబ్బుకు కొదవే లేదని కొరివితో తల గోక్కునే మెంటలోడు… బుర్రపాడు ట్విస్టులు మావా

Suspense Thriller OTT : డబ్బుకు కొదవే లేదని కొరివితో తల గోక్కునే మెంటలోడు… బుర్రపాడు ట్విస్టులు మావా
Advertisement

Suspense Thriller OTT : మైండ్ బెండింగ్ ట్విస్టులతో మతిపోగొట్టే సినిమాలు ఓటీటీలలో చాలా అరుదుగా కన్పిస్తాయి. సస్పెన్స్ థ్రిల్లర్ పేరుతో ఎన్నో సినిమాలు ఉన్నప్పటికీ ఆ మూవీస్ అన్నీ ఆశించిన కిక్కును ఇవ్వలేవు. వేళ్ళ మీద లెక్కబెట్టే అలాంటి అరుదైన సినిమాలు కావాలంటే ఇలా మన మూవీ సజెషన్ ను చదవాల్సిందే. ఈరోజు ఓటీటీ మూవీ సజెషన్ లో ఫ్యూజులు అవుట్ అయ్యే ట్విస్టులు ఉన్న సినిమా గురించి తెలుసుకోబోతున్నాము. ఈ మూవీని చూశాక నెవర్ బిఫోర్ మావా అంటూ థ్రిల్ ఫీల్ అవుతారు పక్కా. మరి అంతగా ఆకట్టుకునే ఆ మూవీ పేరేంటి? ఎక్కడ చూడవచ్చు ? అనేది తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించిన అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘ది గేమ్’ (The Game). 1997లో విడుదలైన ఈ క్లాసిక్ థ్రిల్లర్ మూవీ లవర్స్ పొరపాటున కూడా మిస్ చేయకుండా చూడాల్సిన మూవీస్ లిస్ట్ లో ఉంటుంది. ఇంటెన్స్, మైండ్-బెండింగ్, సస్పెన్స్‌ ఫుల్ ట్విస్టులతో మూవీ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మెయిన్ లీడ్ గా నటించిన మైఖేల్ డగ్లస్ ఇందులో సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మూవీ ప్రస్తుతం Prime Videoలో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే…

Advertisement

సినిమా నికోలస్ వాన్ ఆర్టన్ (మైఖేల్ డగ్లస్) అనే సూపర్ రిచ్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ జీవితంపై ఆధారపడి ఉంది. నికోలస్ సాన్ ఫ్రాన్సిస్కోలో ఒక పెద్ద మాన్షన్‌ లో ఒంటరిగా ఉంటాడు. చాలా కంట్రోల్ గా, ఎమోషన్స్ లేకుండా, ఫ్రెండ్స్ లేకుండా, ఫ్యామిలీకి కూడా దూరంగా బతుకుతాడు. దానికి కారణం అతని తండ్రి 48 ఏళ్ల వయసులో సూసైడ్ చేసుకున్నాడు. ఇక త్వరలోనే అదే వయసులోకి అడుగు పెట్టబోతున్న నికోలస్ భయంతో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాడు. ఎట్టకేలకు ఆ బర్త్ డే రావడంతో అతని బ్రదర్ కాన్‌రాడ్ ఒక మిస్టీరియస్ గిఫ్ట్ ఇస్తాడు. అది Consumer Recreation Services (CRS) అనే కంపెనీ నుంచి “ది గేమ్” అనే ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీస్ వౌచర్.

Also Read : ప్రేమ కథల నుంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్స్ వరకు… ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు సిరీసులు

Advertisement

నికోలస్ దాని గురించి డౌట్ పడుతూనే CRS ఆఫీస్‌కి వెళ్తాడు. అక్కడ ఫిజికల్, సైకాలజికల్ టెస్ట్స్ తర్వాత అతన్ని రిజెక్ట్ చేస్తారు. అక్కడి నుంచే అసలు గేమ్ మొదలవుతుంది. మొదట్లో గేమ్ చిన్న చిన్న ఇన్‌సిడెంట్స్‌తో మొదలవుతుంది. నికోలస్ ఇంట్లో వాటర్ బాటిల్ బదులు వైన్, ట్యాక్సీలో స్ట్రేంజ్ డ్రైవర్, టీవీలో అతని గురించి మాట్లాడే న్యూస్ యాంకర్ ఇలా వింత సంఘటనలు అన్నీ చోటు చేసుకుంటాయి. ఇక్కడే కథ కీలక మలుపు తిరుగుతుంది. అతని బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుంది. పోలీస్ కేసులు, ఫ్రెండ్స్ చేసే నమ్మకద్రోహం, హాస్పిటల్‌లో ఇంజెక్షన్స్, మెక్సికోకి తరలింపు వంటి షాకింగ్ సంఘటనలు ఎదురు అవుతాయి. హీరో ఎవ్వరినీ నమ్మలేకపోతాడు. దీంతో CRSని వెతుకుతాడు. క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటి? ఈ కంపెనీ గేమ్ ప్లాన్ ఏంటి? అనేది మూవీని చూసే తెలుసుకోవాలి.

 

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×