E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: ఆస్తి కోసం పల్లవి, శ్రీయాలు కష్టాలు.. ఏకలింగం పై రాజేంద్రకు అనుమానం.. బయటపడ్డ నిజాలు..

Intinti Ramayanam Today Episode: ఆస్తి కోసం పల్లవి, శ్రీయాలు కష్టాలు.. ఏకలింగం పై రాజేంద్రకు అనుమానం.. బయటపడ్డ నిజాలు..
Advertisement

Intinti Ramayanam Today Episode December 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం లేవగానే అవని అందరి కోసం అన్ని పనులు చేసి వంట చేసే పనిలో బిజీగా ఉంటుంది.. పల్లవి శ్రియాలు ఆలస్యంగా లేచి వస్తారు. మీరు ఇంత ఆలస్యంగా లేచి వచ్చారు కదా తొందరగా లేవాలని తెలియదా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అయితే మేము ఉదయం తొందరగా లేచి ఏం చేయాలి అని పల్లవి అంటుంది.. ఆ నిద్ర మొహాలతో ఉండడం పక్కన పెట్టేసి ముందు వెళ్లి బ్రష్ చేసుకుని ఫ్రెష్ చేయండి అని పార్వతి అంటుంది. పల్లవి శ్రీయాలు మాత్రం మాకు పేస్టు బ్రష్ కావాలని అంటారు.. ఇక వాళ్ళిద్దరూ కలిసి చేసిన రచ్చ అంత ఇంత కాదు… నాన్న ఏది చెప్తే అది చేయాలి కదా మళ్లీ ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని కమల్ అంటాడు. వేప పూలల్ని నోట్లో పెట్టుకున్న పల్లవి శ్రియ ఇద్దరు కూడా చేదుగా ఉన్న ఎలా కడుక్కోవాలి అని అంటారు.

ఇలాంటివన్నీ ఇక్కడ చెయ్యక తప్పదు లేకపోతే మాత్రం ఏం చేస్తారో తెలియదు అని కమల్ అంటాడు.. అవని అందరికీ కాఫీ ఇస్తుంది.. కానీ పల్లవిశ్రియాలకు మాత్రం కాఫీ ఇవ్వదు. అదేంటి మాకు కాఫీ ఇవ్వట్లేదు అని అంటుంది పల్లవి. మీరు వెళ్లి ముందు బ్రష్ చేసుకున్నాక స్నానం చేశారండి అని అంటుంది. వాళ్లెవరు కూడా స్నానం చేయలేదు కదా మరి మీవెందుకు స్నానం చేయాలి అని అంటారు.. శ్రీయా పల్లవిలు స్నానం చేసి రెడీ అయ్యి రాగానే రాజేంద్ర ఫామ్ హౌస్ కు వెళ్లమని చెప్తాడు. ఉర్లో కట్టించిన స్కూల్ గురించి నిజాలు తెలుసుకునేందుకు అవని అక్షయ్ వెళ్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. తమ ఊరిని చూస్తూ అవని, అక్షయ్ లు వెళుతూ ఉంటే స్కూల్లో పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి మీరు వెళ్తే డిస్టర్బెన్స్ అవుతుంది అని ఆపుతాడు ఏకలింగం.. ఆ తర్వాత హాస్పిటల్ కన్నా వెళ్తాము అంటే అక్కడ మీరు వస్తున్నారని తెలిసి ఏర్పాట్లు చేయలేదు నేను ఒక రెండు రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసి అక్కడికి తీసుకొని వెళ్తాను అని అంటాడు.. పల్లవి, శ్రియాలు అక్కడికి వెళ్ళగానే అక్కడ వాళ్ళు చెప్పింది విని షాక్ అవుతారు.. మనల్ని ఎందుకు ఇలా చూస్తున్నారు అని అనుకుంటారు. పల్లవిశ్రియాలు అక్కడ పనిచేయడానికి మొదట ఒప్పుకోకపోయినా సరే కమల్ ఆస్తి గురించి చెప్పగానే వాళ్ళు పని చేయడానికి ఒప్పుకుంటారు. మొత్తానికి గెటప్ మార్చుకొని వ్యవసాయం చేసేందుకు సిద్ధపడతారు.

ఇక అవని, అక్షయ్ రాజేంద్రలు ఊరంతా చూస్తూ వెళుతుండగా అక్కడ ఆరాధ్య కనిపిస్తుంది. అక్కడున్న పిల్లలతో ఆడుకుంటూ కనిపిస్తుంది. వాళ్ళని చూసి ఆగిన అవని అక్షయ్ రాజేంద్రులు పిల్లల్ని ఏంటి స్కూల్ కి వెళ్లకుండా ఆడుకుంటున్నారు అని అడుగుతారు.. అయినా మీ ఊర్లో మీకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అంట కదా మరి స్కూల్ కి వెళ్ళకుండా ఇలా ఉన్నారేంటి అని అవని అడుగుతుంది. మాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయా? ఎవరు చెప్పారు మీకు అని అక్కడున్న పిల్లలు అంటారు. మీ ఊరి ప్రెసిడెంట్ స్కూల్లో మీకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పాడు మరి అది నిజం కాదని అడుగుతుంది అవని..

Advertisement

మా ఊర్లో అసలు స్కూలే లేదు అని పిల్లలు చెప్పగానే అవని, అక్షయ్, రాజేంద్ర షాక్ అవుతారు. స్కూల్ లేదా అదేంటి అని వాళ్ళు అనుమాన పడతారు. మీరు చదువుకోడానికి ఎక్కడికి వెళ్తారు అని అవని అడుగుతుంది. మేము ఇక్కడ స్కూల్ లేదు కాబట్టి చదువుకోడానికి పక్క ఊరికి వెళ్తున్నాము అని ఆ పిల్లలు చెప్పగానే.. ఇదంతా ఆ ఏక లింగం పనే అని అవనికి అనుమానం వస్తుంది. ఇక్కడ స్కూలు ఉంది అని మనతో అబద్ధం చెప్పాడు. కానీ ఇక్కడ స్కూల్ లేదు అతను చెప్పేదంతా మొదటి నుంచి ఏదో తేడాగా ఉంది అని అంటుంది.

నాక్కూడా అనుమానం వస్తుంది అవని అసలు ఏం జరుగుతుందో మనం ఒకసారి వెళ్లి తెలుసుకుందామని రాజేంద్ర అంటాడు.. ఆ స్కూలు హాస్పిటల్ ఎలా ఉన్నాయో ఒకసారి వెళ్లి చూసేసి వద్దామని అక్షయ అవనీలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ముందుగా స్కూలుకి వెళ్తారు అక్కడికి రాజేంద్రప్రసాద్ కూడా వస్తాడు. ఏకలింగం మనుషులు ఆ స్కూల్లో గోడౌన్ గా మార్చేసి అన్ని వేయడం చూసినా అక్షయ్ సీరియస్ అవుతాడు. ఏంట్రా ఇది ఎవరిది ఈ గోడను ఎవరు చేశారు అని అక్షయ్ అడగ్గానే వాళ్ళు ఏకలింగం అని అంటారు.. అక్కడ చెట్ల కింద పాఠాలు చెబుతున్నా టీచర్ తో వాళ్ళు మాట్లాడి అసలు నిజాన్ని తెలుసుకుంటారు.

Also Read :ఓడిపోయిన ప్రభావతి.. జడ్జిలను మెప్పించిన మీనా, బాలు.. విన్నర్ ఎవరంటే..?

ఇక కోటిలింగం రూల్స్ పిచ్చిలో డాన్స్ చేస్తూ ఉంటాడు. అది చూసిన ఆరాధ్య అతని చూసి నవ్వుకుంటుంది. ఆ తర్వాత అతను డాన్స్ వేస్తూ నీళ్లలో పడిపోతుంటే పట్టుకొని కాపాడుతుంది. కోటిలింగం ఆరాధ్యకు మంచి ఫ్రెండ్ అవుతాడు. నా ప్రాణాలు కాపాడావు నీ రుణాన్ని తీర్చుకుంటాను అని అతను అంటాడు.. మనిద్దరం ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి ఆడుకుందామని కోటిలింగం ఆరాధ్య వెళ్ళిపోతారు. ఇక స్కూల్ ఇలా ఉంది అంటే హాస్పిటల్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మామయ్య. ముందు వెళ్లి ఆస్పిటల్ ఉందో లేదో ఒకసారి తెలుసుకుందామని అవని అంటుంది. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన అవని,అక్షయ్, రాజేంద్ర లు అక్కడున్న పరిస్థితిని చూసి షాక్ అయిపోతారు.. అది మొత్తం బారుగా ఉంటుంది. తాగుబోతులందరూ ఒక్కొక్కరుగా బయటికి వస్తుంటారు అది చూసి ఏకలింగానికి తగిన బుద్ధి చెప్పాలని అనుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఏక లింగం చెంప పగలగొడుతుంది అవని. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×