E-Paper
Advertisement

Most Common Lies: అబద్ధం చెప్పని మనిషి ఉంటారా? లోకమంతా వాడే మోస్ట్ కామన్ అబద్ధాల లిస్ట్!

Most Common Lies: అబద్ధం చెప్పని మనిషి ఉంటారా? లోకమంతా వాడే మోస్ట్ కామన్ అబద్ధాల లిస్ట్!
Advertisement

Most Common Lies: జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పని మనిషి ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని అబద్ధాలు ఇతరులను ఇబ్బంది పెట్టడానికి చెబితే.. మరికొన్ని కేవలం ఆ సమయానికి పరిస్థితిని చక్కదిద్దడానికి లేదా ఇతరుల మనసు నొప్పించకుండా ఉండటానికి చెబుతుంటాం. వీటినే మనం ‘వైట్ లైస్’ అంటాం. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా చెప్పే అత్యంత సాధారణ అబద్ధాల గురించి ఈ ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1. “నేను బయలుదేరాను.. దారిలో ఉన్నాను”

ఇది ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది అబద్ధం. ఎవరైనా మన కోసం ఎదురుచూస్తున్నప్పుడు.. మనం ఇంకా ఇంట్లోనే రెడీ అవుతున్నా లేదా అప్పుడే బండి తీస్తున్నా.. “ఇప్పుడే మెయిన్ రోడ్డు మీదకు వచ్చాను”, “ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటాను” అని చెబుతుంటాం. నిజానికి అప్పటికి మనం బయలుదేరనే లేదని.. అవతలి వ్యక్తికి కూడా తెలుసు, కానీ ఆ క్షణానికి తప్పించుకోవడానికి ఇది ఒక ఆయుధం.

Advertisement

2. “నేను బాగున్నాను

మన మనసులో ఎంత బాధ ఉన్నా, ఒత్తిడి ఉన్నా.. ఎవరైనా “ఎలా ఉన్నావు?” అని అడిగినప్పుడు వెంటనే వచ్చే సమాధానం “నేను బాగున్నాను”. మన సమస్యలను అందరికీ వివరించడం ఇష్టం లేకనో లేదా వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకనో ఈ అబద్ధాన్ని ఆశ్రయిస్తాం. ఇది భావోద్వేగాలను దాచుకోవడానికి వాడే అతిపెద్ద ముసుగు.

3. “అయ్యో.. నీ మెసేజ్/కాల్ చూడలేదు!”

ఎవరితోనైనా మాట్లాడటం ఇష్టం లేనప్పుడు లేదా బిజీగా ఉన్నప్పుడు వారి ఫోన్ కాల్‌ను ఇగ్నోర్ చేస్తాం. తర్వాత వారు కలిసినప్పుడు “ఫోన్ సైలెంట్‌లో ఉంది”, “మెసేజ్ చూశాను కానీ రిప్లై ఇవ్వడం మర్చిపోయాను” అని చెబుతుంటాం. నిజానికి మనం ఫోన్ చూస్తూనే ఆ కాల్‌ను కావాలనే పక్కన పెట్టి ఉంటాం.

4. “రూల్స్ చదివాను

ఇది డిజిటల్ యుగంలో మనం ప్రతిరోజూ చెప్పే అబద్ధం. ఏదైనా యాప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు లేదా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ అయినప్పుడు వచ్చే పేజీల కొద్దీ నిబంధనలను ఎవరూ చదవరు. కానీ కింద ఉన్న బాక్స్‌లో టిక్ మార్క్ పెట్టి “చదివాను” అని అబద్ధం చెబుతాం.

Aso Read: ప్రేమలో ఉన్న అమ్మాయిలు చేసే 10 పనులు.. వీటిని బట్టి ఆ ఇష్టాన్ని ఇట్టే పట్టేయొచ్చు

5. “రేపటి నుంచి కచ్చితంగా మొదలుపెడతాను”

డైటింగ్ చేయడం, వ్యాయామం చేయడం లేదా ఏదైనా కొత్త పని నేర్చుకోవడం వంటి విషయాల్లో ఈ అబద్ధం మనకు మనమే చెప్పుకుంటాం. “ఈ ఒక్క రోజుకు తినేద్దాం, రేపటి నుంచి డైటింగ్ పక్కా” అని మనల్ని మనం మోసం చేసుకుంటాం. కానీ ఆ ‘రేపు’ త్వరగా రాదు.

6. “నిజం చెప్పు.. నేనేం అనుకోను”:

ఎవరైనా మన గురించి ఏదైనా నెగటివ్ విషయం చెప్పబోతున్నప్పుడు.. మనం ఈ డైలాగ్ వాడుతుంటాం. కానీ వారు నిజంగా మన లోపాన్ని చెబితే కచ్చితంగా మనసులో బాధ కలుగుతుంది లేదా కోపం వస్తుంది. అయినప్పటికీ.. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి మనం అబద్ధం చెబుతాం.

అబద్ధం అనేది సందర్భాన్ని బట్టి మారుతుంటుంది. కొన్ని అబద్ధాలు సంబంధాలను కాపాడితే.. మరికొన్ని నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. అయితే.. పైన చెప్పుకున్న సాధారణ అబద్ధాలు దాదాపు అందరి జీవితంలో ఒక సరదా భాగమే..

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×