E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు సపోర్ట్ గా అవని.. ఏకలింగం తో కలిసిపోయిన పల్లవి.. పిల్లల కోసం పాట్లు..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు సపోర్ట్ గా అవని.. ఏకలింగం తో కలిసిపోయిన పల్లవి.. పిల్లల కోసం పాట్లు..
Advertisement

Intinti Ramayanam Today Episode December 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. తన కుటుంబ సభ్యులతో కలిసిరాజేంద్రప్రసాద్ సొంత ఇంటికి వెళ్లి పోతారు. ఇంటిని చూసి అందరూ చాలా బాగుంది అని అనుకుంటారు. పల్లవి శ్రీయాలు మాత్రం ఈ గొప్ప పెంకుటిల్లు కోసం మనం ఇంత దూరం వచ్చామని అంటారు.. అక్కడున్న పని వాళ్ళ అందరితోనూ రాజేంద్ర ప్రసాద్ చాలా ప్రేమగా మాట్లాడుతాడు. ఇంట్లోకి వెళ్ళగానే పనిమనిషి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్లేటప్పుడు పల్లవి కి చెయ్యి తగులుతుంది. కొంచెం కూడా బుద్ధి లేదా అని పల్లవి ఆమెపై సీరియస్ అవుతుంది..

రాజేంద్రప్రసాద్ అక్కడున్న పని వాళ్ళందరినీ మీరు ఇళ్లకు వెళ్లిపోండి మేము వెళ్లేంతవరకు మీరు ఇక్కడికి రావద్దు అని అంటాడు. పని వాళ్ళని పంపించేస్తే ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు అని శ్రేయ అడుగుతుంది. ఇంట్లో పనులన్నీ మీకు మీరే చేసుకోవాలి అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. ఇక తర్వాత ఆస్తి కోసం పల్లవి, శ్రియాలు పెద్ద రచ్చ చేస్తారు. రాజేంద్ర ప్రసాద్ చెప్పిన కండిషన్ విని అందరూ షాక్ అవుతారు. కానీ పల్లవి శ్రియాలు మాత్రం తొందరగా పిల్లల్ని గాని ఆస్తిని కొట్టేయాలని అనుకుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆస్తుల గురించి మాట్లాడిన రాజేంద్రప్రసాద్ తో శ్రేయ పల్లవిలు గొడవకి దిగుతారు.. ఇప్పుడున్న కోట్ల ఆస్తిని చూసుకోవడానికి తప్ప అనుభవించడానికి అవసరం లేదా అని శ్రేయ అంటుంది.. ముందు మీరు పిల్లల్ని కనండి అప్పుడు ఆస్తి మీ పిల్లల పేరు మీద ఉంటుంది కదా.. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని రాజేంద్రప్రసాద్ కండిషన్ పెడతాడు.. శ్రీయ పల్లవిలు మావయ్య గారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వాటిలో మార్పు ఉండదు.. మనం ఎంత చెప్పినా ఆయన మాట వినరు ముందు మన పని మనం చేసుకోవాలి అని పల్లవి శ్రీయాకు కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. ఆ తర్వాత అక్షయ్ అవనీలు కూడా నాన్న చెప్పిన మాట చాలా బాగుంది. అలా అయినా వాళ్ళు సంతోషంగా ఉంటారు అని మాట్లాడుకుంటారు..

నాన్న ఇక్కడికి తీసుకొచ్చి మంచి పనే చేశాడు.. ఇక్కడ ఉన్న ఆస్తులు గురించి మా అమ్మ పేరు మీద కట్టించిన స్కూల్లు కాలేజీల గురించి మనకి తెలిసింది. అదే కాదు మా అమ్మ పేరు మీద హాస్పిటల్ కూడా ఉందన్న విషయం ఇప్పుడే తెలిసింది.. మా నాన్న వీటిని కట్టించాడు. కానీ వాటిని ఇంకా మెరుగైన సదుపాయాలు అందించి నేను ఇంకాస్త పెంచాలని అనుకుంటున్నాను అని అవనితో అక్షయ్ అంటాడు. బతికున్న అమ్మానాన్నలకి కనీసం ఒక ముద్ద అన్నం పెట్టని పిల్లల్ని చూస్తున్నాము. అలాంటిది మీరు ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అవని సపోర్ట్ చేస్తుంది.

Advertisement

అవని మాట విన్న అక్షయ్అత్తమామలు బ్రతికుండగానే ఎప్పుడు పోతారని ఆలోచించే ఈ రోజుల్లో లేని ఆమె గురించి నువ్వు ఇలా మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది అవని అని అంటాడు. ఇద్దరు కూడా ఆ ఊర్లోని స్కూల్ ని అలాగే హాస్పిటల్ ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచిద్దామని అనుకుంటారు.. ఇక పల్లవి ఆ ఊరి ప్రెసిడెంట్ ఏక లింగాన్ని లైన్లో పెట్టేస్తుంది.. అతనితో మాట్లాడుతూ వెళ్లిన పల్లవి మా నాన్న మీ గురించి చాలానే చెప్పారు.. మీ నాన్న నేను ఇద్దరు ఒకేసారి కెరియర్ స్టార్ట్ చేసాం మీ నాన్న సిటీలో మారిపోయాడు నేను ఇక్కడే ఉండి ఈ ఆస్తులని కూడబెడుతున్నాను అని అంటాడు..

నువ్వు ఆ అవని గురించి తెలియదు.. అవని ఎలాంటి వారినైనా సరే ఇట్టే పసిగట్టే గలదు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని సలహా ఇస్తుంది పల్లవి.. మీకు నా గురించి తెలియదు అనుకుంటాను.. మన ముందు ఎలాంటి వారైనా సరే తల వంచాల్సిందే అని ఏకలింగం అంటాడు. ఇక్కడ ఆస్తులు గురించి మాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి ఈ ఆస్తులు అక్కడ హైదరాబాదులో ఉన్న ఆస్తులన్నీ నా పేరు మీదకు వచ్చేలా చెయ్యండి. నీకు కావలసినవి నేను చేస్తాను అని పల్లవి అంటుంది. అవి తర్వాత మాట్లాడుకుందాం.. ముందు ఆస్తులు ఎలా రావాలా అవి చూద్దాం లేండి అని ఏకలింగం అంటాడు. పల్లవి వెళ్ళగానే ఈవిడకు నా గురించి తెలియదు అనుకుంటాను ఇక్కడ ఆస్తులు అక్కడ ఆస్తులు ఈమకే కావాలా..? ఈ ఊర్లో ఉన్న ప్రతిదీ నా ఆస్తి అది ఈవిడ కనుక్కోలేక పోతుంది అని ఏకలింగం అంటాడు.

తర్వాత పార్వతి రాజేంద్రప్రసాద్ దగ్గరికి వచ్చి అక్కడున్నప్పుడే మన మాట విల్లినట్లు లేదు ఇప్పుడు ఇలాంటి పనులు చేయాలంటే వాళ్ళు చేస్తారని అడుగుతుంది. అందరూ అవని అంత ఓర్పుతో అయితే ఉండరు కదా చూద్దాం ఏం జరుగుతుందో అని అంటాడు రాజేంద్రప్రసాద్. పార్వతి మాత్రం అక్కడ ఉంటేనే వినలేదు ఇక్కడ ఉంటే ఎలా వింటారు ఈయన ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటుంది. పల్లవి మల్లెపూలు పెట్టుకొని కమల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.. కమల్ బయటికి వెళ్తూ ఉంటే సెంటు కొట్టుకొని మల్లెపూలు పెట్టుకుని నీకోసమే.. బయట పడుకుంటేనే మజా ఉంటుంది అని కమల్ అంటాడు.. ఆ తర్వాత శ్రియా కూడా శ్రీకర్ తో రొమాన్స్ చేస్తుంది.. పిల్లలు కంటేనే ఆస్తిస్తానని మీ నాన్న అన్నారు కదా ఇప్పుడు కచ్చితంగా మనం పిల్లల్ని కనాల్సిందేనని శ్రీయ అంటుంది..

Also Read: పోటీలో పాల్గొన్న మీనా, బాలు.. రోహిణిని బుక్ చేసిన బాలు.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్..

ఉదయం లేవగానే అవని అందరి కోసం అన్ని పనులు చేసి వంట చేసే పనిలో బిజీగా ఉంటుంది.. పల్లవి శ్రియాలు ఆలస్యంగా లేచి వస్తారు. మీరు ఇంత ఆలస్యంగా లేచి వచ్చారు కదా.. తొందరగా లేవాలని తెలియదా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అయితే మేము ఉదయం తొందరగా లేచి ఏం చేయాలి అని పల్లవి అంటుంది.. ఆ నిద్ర మొహాలతో ఉండడం పక్కన పెట్టేసి ముందు వెళ్లి బ్రష్ చేసుకుని ఫ్రెష్ చేయండి అని పార్వతి అంటుంది. పల్లవి శ్రీయాలు మాత్రం మాకు పేస్టు బ్రష్ కావాలని అంటారు.. ఇక వాళ్ళిద్దరూ కలిసి చేసిన రచ్చ అంత ఇంత కాదు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×