E-Paper
Advertisement

ACB Raids: ఆర్డీవో ఆఫీసర్ కిషన్ నాయక్ ఇంట్లో ఏసీబీ దాడులు.. ఆస్తులను చూసి ఏసీబీ షాక్..

ACB Raids: ఆర్డీవో ఆఫీసర్ కిషన్ నాయక్ ఇంట్లో ఏసీబీ దాడులు.. ఆస్తులను చూసి ఏసీబీ షాక్..
Advertisement

ACB Raids: తెలంగాణ రవాణాశాఖలో అవినీతి తిమింగలం బయటపడింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో మహబూబ్‌నగర్ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కిషన్‌ నాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో, ప్రభుత్వ రికార్డుల ప్రకారం 12.72 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. 41 ఎకరాల వ్యవసాయ భూములు, కిలో బంగారు ఆభరణాలు, పెద్ద హోటల్‌, ఫర్నీచర్‌ దుకాణాల్లో వాటాలున్నట్టు తేల్చారు. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ వందల కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 12 చోట్ల ఏకకాలంలో సోదాలు
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు నిన్న హైదరాబాద్‌లో ఓల్డ్‌ బోయినపల్లి ఆర్‌ఆర్‌ నగర్‌ కాలనీలోని కిషన్‌నాయక్‌ నివాసం, హైదరాబాద్‌, నిజామాబాద్‌, నారాయణఖేడ్‌లలో ఆయన బంధువులు, సన్నిహితుల నివాసాలు, మహబూబ్‌నగర్‌లోని జిల్లా రవాణాశాఖ కార్యాలయం సహా 12 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. కిషన్‌నాయక్‌ స్వగ్రామం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బల్కంచెల్క తండాలోని ఆయన నివాసం, సమీప బంధువుల ఇళ్లలో, బాచేపల్లికి చెందిన ఆయన సన్నిహితులు గోపాల్‌, కిరణ్‌ల నివాసాల్లోనూ తనిఖీలు చేశారు.

Advertisement

కిషన్ నాయక్ ఇంట్లో వందల కోట్ల ఆస్తులు గుర్తింపు
నిజాంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఆయనకు సంబంధించి భూముల వివరాలు సేకరించారు. కిషన్‌నాయక్‌కు నారాయణఖేడ్‌లో 31 ఎకరాలు, నిజామాబాద్‌లో 10 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆయన నివాసంలో కిలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాల్లో 1.37 కోట్ల నగదు, నిజామాబాద్‌లో లహరి ఇంటర్నేషనల్‌ హోటల్‌లో సగం వాటా, అక్కడి రాయల్‌ ఓక్‌ ఫర్నీచర్‌ దుకాణానికి అద్దెకు ఇచ్చిన మూడు వేల గజాల వాణిజ్య ప్రదేశం, అశోకా టౌన్‌షి్‌పలో రెండు ఫ్లాట్లు, నాలుగు వేల చదరపు అడుగుల స్థలంలో పాలిహౌస్‌ ఉన్నట్టు గుర్తించారు.

కిషన్ నాయక్ ఇంట్లో ముగిసిన సోదాలు
దిల్‌సుఖ్‌నగర్‌లో ఆయన బంధువు విజయ్‌ ఇంట్లో పలు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పత్రాలపై లెక్కల ప్రకారం కిషన్‌నాయక్‌ ఆస్తులు 12.72కోట్లు అని, బహిరంగ మార్కెట్‌ విలువ దాదాపు 200కోట్ల వరకు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. నిన్న రాత్రి సోదాలు ముగియడంతో కిషన్‌ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, ఆయన్ను రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Also Read: నింగిలోకి వ్యోమనౌక.. బ్లూబర్డ్‌ బ్లాక్‌-2 సిద్ధం

ఏవీఐ నుంచి డీటీసీ వరకు కిషన్ నాయక్ అక్రమ ప్రస్థానం
1994లో ఏవీఐగా కెరీర్ ప్రారంభించిన కిషన్, ప్రస్థానం ఆది నుంచి వివాదాస్పదంగానే ఉంది. నిజామాబాద్, మద్నూర్ చెక్‌పోస్టు, బోధన్, మెహిదీపట్నం, మేడ్చల్ ప్రాంతాల్లో పనిచేసిన కాలంలోనే ఆయన ఈ భారీ అక్రమాస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ నిర్ధారించింది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా పనిచేశారు. ఏడాది క్రితమే ఆయన మహబూబ్‌నగర్ డీటీసీగా పదోన్నతిపై వెళ్లారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×