E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: కూతురు కోసం భానుమతి కన్నీళ్లు..భర్తను కాపాడమని రాజేశ్వరికి రిక్వెస్ట్..చక్రధర్ బయటకు వస్తాడా..?

Intinti Ramayanam Today Episode: కూతురు కోసం భానుమతి కన్నీళ్లు..భర్తను కాపాడమని రాజేశ్వరికి రిక్వెస్ట్..చక్రధర్ బయటకు వస్తాడా..?
Advertisement

Intinti Ramayanam Today Episode December 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి నీళ్ల కోసం వస్తే అక్కడున్న మీనాక్షిని చూసి పక్కకు తప్పుకొని వెళ్ళిపోతుంది. ఇక అక్షయ్ అవనిని మీ అమ్మ గురించి ఏమీ మాట్లాడట్లేదు.. అసలు ఏం జరుగుతుంది మీ అమ్మకి కనీసం కొంచెం కూడా లేదు.. మీరు కూడా అక్రమ సంబంధం అని మాట్లాడుతున్నారా అని బాధపడుతుంది అవని.. అసలు మీ నాన్న గురించి కానీ ఇంటి పేరు గురించి కానీ మీ అమ్మ ఎందుకు చెప్పలేదు కనీసం నీకైనా చెప్పాలి కదా అని అంటాడు.. అక్షయ్ ఎంత అన్న కూడా అవని మౌనంగా ఉండిపోతుంది. మాకు చెప్పకపోయినా సరే కూతురివి కదా నీకైనా మీ అమ్మ మీ నాన్న గురించి నిజం చెప్పిందా అని అక్షయ్ అడుగుతాడు.. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు మా అమ్మ మా నాన్న గురించి చెప్పిందని చెప్పాలా? చెప్పలేదని చెప్పాలా అని అవని తనలో తానే బాధపడుతూ ఉంటుంది. ఒకవేళ చెప్పింది అంటే ఆ చక్రధర్ గురించి నేను నిజం చెప్పాల్సి వస్తుంది. చెప్పలేదండి అని అవని అంటుంది.. మీ దగ్గర నిజం దాచినందుకు క్షమించండి అని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రాజేశ్వరి చక్రధర్ని కలిసి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. రాజేశ్వరిని నమ్మించేందుకు చక్రధర్ ప్రయత్నం చేసి మొత్తానికి రాజేశ్వరుని నమ్మించేస్తాడు.. నిజమేనని నమ్మిన రాజేశ్వరి తన భర్తని ఎలాగైనా జైలు నుంచి విడిపించాలని తన పుట్టింటికి వెళ్తుంది.. ఈశ్వర్ ని కలవడానికి రాజేంద్రప్రసాద్ వెళ్లేందుకు సిద్ధపడుతుంటాడు. అప్పుడే అక్కడికి రాజేశ్వరి రావడంతో షాక్ అవుతారు.. మనమే వెళ్దామని అనుకుంటే రాజేశ్వరిని వస్తుంది అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. తన పుట్టింటి వాళ్ళని చూడగానే రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటుంది.

Advertisement

అందరితో బాధపడుతూ మాట్లాడుతుంది. అందరూ మీరు ఇలా అయిపోతారని అస్సలు అనుకోలేదు అని అంటారు.. ఆ భర్తని జైల్లో చూసి నేను ఇలా మారిపోవాల్సి వచ్చింది అని రాజేశ్వరి అంటుంది. నా భర్త ఇప్పుడు పూర్తిగా మారిపోయారు నా భర్తని మీరు బయటకు తీసుకురండి అని వేడుకుంటుంది.. మీ గురించి ఒకప్పుడు ఎన్నో కుట్రలు చేశాడు నేను మీకు ఆయన చేసిన కుట్రల గురించి బయట పెట్టి సహాయం చేశాను.. అ క్కడ ఉన్నది నా భర్త అని కూడా చూడకుండా మీకు ఎన్నో సార్లు సహాయం చేసిన విషయం మీకు గుర్తుందా అని రాజేశ్వరి అడుగుతుంది..

నేను జైలుకు వెళ్లి ఆయన చూసి వచ్చాను ఆయన పరిస్థితి ఏమీ బాగోలేదు.. నాకు మీరందరూ పతిభిక్ష పెట్టండి అని వేడుకుంటుంది.. నువ్వు మమ్మల్ని అలా అడగడం ఏంటి అని భానుమతి అంటుంది. మీరు ఆవేశంగా బాధపడుతున్నారు పిన్ని గారు మీరు కూర్చోండి నేను కాఫీ తీసుకొస్తాను అని అవని అంటుంది. నాకు మీ మర్యాదల అవసరం లేదు నా భర్తని బయటకు తీసుకురండి అని రాజేశ్వరి వేడుకుంటుంది.. అన్నయ్య నీ చెల్లెలు పసుపు కుంకుమలను నువ్వు కాపాడతావో.. లేక నువ్వే నీ చేతులతో నీ చెల్లెలు సింధూర నీ చెడిపేస్తావో నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Advertisement

అందరూ కూడా ఎలా ఉన్న రాజేశ్వరి ఎలా అయిపోయింది అని బాధపడతారు.. రాజేంద్రప్రసాద్ పార్వతి రాజేశ్వరి అన్న విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు.. ఇక భానుమతి కూడా రాజేశ్వరి చెప్పిన దాంట్లో గురించి ఏం ఆలోచించావు అని అడుగుతుంది.. నా ఒక్కరి నిర్ణయం కాదు కదా అమ్మ ఇంట్లోని వాళ్ళందరినీ కనుక్కొని ఏమనుకున్నారో అప్పుడు నిర్ణయం తీసుకోవాలి.. ఎంత అన్యాయం చేస్తారో నీకు తెలుసు అని రాజేంద్రప్రసాద్ అంటాడు.. రేపు ఉదయం రాజేశ్వరి వస్తానని చెప్పింది మరి ఏం చెప్తావు అని అడుగుతుంది భానుమతి..

ఇక ఇంట్లోని వాళ్లందర్నీ పిలిచి వాళ్ళ నిర్ణయం ఏమిటో కనుక్కోవాలని రాజేంద్రప్రసాద్ అనుకుంటాడు.. శ్రీకర్ శ్రియాలను పిలుస్తారు.. మేము ఇంట్లో లెక్కలోనే లేము మా నిర్ణయాల గురించి అభిప్రాయాల గురించి మీకెందుకు అని శ్రియ అంటుంది.. శ్రీకర్ మాత్రం అలాంటి దుర్మార్గుడు బయటికి రాకపోవడమే మంచిది అని అంటాడు.. కమల్ పల్లవిలను పిలుస్తారు.. అలాంటి ఎదవ బయట ఉంటే నేనే చంపేసేవాన్ని వాడిని బయటకు తీసుకొస్తానని అంటావేంటి నాన్న అని కమల్ సీరియస్ అవుతాడు.. అన్నిటికీ ఆవేశపడకుండా ఆలోచించరా అనేసి భానుమతి అంటుంది..

అవని భానుమతికి కాఫీ తీసుకొని వెళ్లి ఇస్తుంది.. నిన్న రాజేశ్వరి అన్న మాట గురించి ఏం ఆలోచించావు… నా అల్లుడు నీ బయటికి తీసుకొచ్చేదానికి నువ్వేమీ ఆలోచించలేదు అని అడుగుతుంది.. అవని మౌనంగా ఉంటుంది.. అందరి మంచి కోరే దానివి అని అనుకుంటున్నావు కదా.. నా కూతురిని ఎందుకు బాధ పెడతావు అని భానుమతి అవనిని దారుణంగా తిడుతుంది. మీ అమ్మ కోసం అయితే ఎవరు ఒక్క మాట అనకుండా కాపాడుకుంటావు మరి మా అమ్మ కన్నీళ్లు నీకు గుర్తుకు రాలేదా అని పల్లవి అంటుంది. నీకు నీ సంతోషమే ముఖ్యం నా అల్లుడిని అరెస్టు చేయడానికి చూపించిన చొరవ బయటకు తీసుకురావడానికి చూపించట్లేదు అని భానుమతి అవనిని తిడుతుంది.

Also Read: రోహిణికి క్లాస్ పీకిన శృతి..మీనాను అవమానించిన ప్రభావతి.. కొత్త కారు కొన్న బాలు…

అక్షయ్ ఏమంటున్నాడో తెలుసా అమ్మ అని రాజేంద్రప్రసాద్ అడుగుతాడు.. అక్షయ్ ఎక్కడమ్మా అని పార్వతి అడుగుతుంది.. ఆయన రెడీ అవుతున్నాడు అత్తయ్య వస్తాడు ఏమనుకుంటున్నాడో మీరే అడగండి అని అవని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో రాజేశ్వరి ఇంటికి వచ్చి అందరిని అడుగుతుంది. కానీ అక్షయ్ మాత్రం ఆమెకు సమాధానం చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది… రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×