// // Google Free Repair| గూగుల్ ఫ్రీ రిపేర్ ఆఫర్.. పిక్సెల్ ఫోన్లలో సమస్య ఉంటే కొత్త ఫోన్ ఉచితం -->
E-Paper
Advertisement

Google Free Repair: గూగుల్ ఫ్రీ రిపేర్ ఆఫర్.. పిక్సెల్ ఫోన్లలో సమస్య ఉంటే కొత్త ఫోన్ ఉచితం

Google Free Repair: గూగుల్ ఫ్రీ రిపేర్ ఆఫర్.. పిక్సెల్ ఫోన్లలో సమస్య ఉంటే కొత్త ఫోన్ ఉచితం
Advertisement

Google Free Repair| గూగుల్ ఒక అద్భుతమైన కొత్త సపోర్ట్ ప్రోగ్రామ్ ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్ ప్రకారం.. పిక్సెల్ 9 ప్రో (Pixel 9 Pro) సిరీస్ ఫోన్లలో వచ్చిన కొన్ని హార్డ్‌వేర్ సమస్యలకు ఇప్పుడు మూడు ఏళ్లు ఫ్రీ రిపేర్ ఇస్తోంది. ఈ ప్రోగ్రామ్ ఇప్పటికే ప్రారంభమైంది. మీ పిక్సెల్ ఫోన్‌లో సమస్య ఉంటే మీరు ఏ మాత్రం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు!

ఫ్రీ రిపేర్ కావాలంటే కండిషన్స్ ఇవే..

ఈ ఫ్రీ రిపేర్ ప్రోగ్రామ్.. పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో XL, పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ మోడల్స్‌కు వర్తిస్తుంది. ఫోన్ డిస్‌ప్లే స్క్రీన్‌పై వర్టికల్ లైన్ రావడం లేదా స్క్రీన్ ఫ్లికర్ (మినుకుమినుకు మనడం) అవుతుంటే ఫ్రీ రిపేర్ చేస్తారు. ఇవి మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్స్ కాబట్టి గూగుల్ ఉచితంగా సరిచేస్తుందని చెప్పింది.

ఏ సమస్యలకు ఈ ఆఫర్ వర్తించదు?

Advertisement

స్క్రీన్ పగిలిపోవడం, గ్లాస్ బద్దలు కావడం, నీళ్లు పడటం.. ఇలాంటి ఫిజికల్ డ్యామేజ్ లేదా యూజర్లు చేసిన తప్పిదాలకు ఈ ప్రోగ్రామ్ వర్తించదు. అలాంటి సమస్యలు సాధారణ వారంటీలోనే కవర్ అవుతాయి.

ఉచిత డిస్‌ప్లే లేదా కొత్త ఫోన్

ముందు మీ ఫోన్‌ను గూగుల్ అథారైజ్డ్ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి. అక్కడ సమస్యను పూర్తిగా చెక్ చేస్తారు. సమస్య నిజంగా డిస్‌ప్లేకి సంబంధించినదైతే పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో XL లకు ఫ్రీగా కొత్త డిస్‌ప్లే మారుస్తారు. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ కు మాత్రమే పూర్తి కొత్త ఫోన్ ఇస్తారు.

ముఖ్యమైన షరతులు ఏమిటి?

Advertisement

ఈ ప్రోగ్రామ్ ఫోన్ లాంచ్ అయిన తేదీ నుంచి మూడు ఏళ్లు వర్తిస్తుంది. కొనుగోలు బిల్ తప్పనిసరిగా చూపించాలి. కొన్ని దేశాల్లో మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. భారత్‌లో ఉందో లేదో గూగుల్ సపోర్ట్‌లో చెక్ చేసుకోండి.

రిపేర్ తర్వాత వారంటీ ఎలా ఉంటుంది?

రిపేర్ చేసిన భాగానికి 90 రోజుల వారంటీ ఇస్తారు. సమస్య మళ్లీ వస్తే మళ్లీ ఫ్రీగా సరిచేస్తారు. పిక్సెల్ యూజర్లకు ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్.

గూగుల్ గుడ్‌విల్ 

ఈ ప్రోగ్రామ్ గూగుల్ స్వచ్ఛందంగా ప్రకటించింది. కస్టమర్ల హక్కులను తగ్గించడం కోసం కాదు. సమస్య తమదేనని ఒప్పుకొని దానికి పరిష్కరించడం కోసం. ఇలా చేయడం ద్వారా గూగుల్ కస్టమర్ల నమ్మకాన్ని పెంచుకుంటోంది.

పిక్సెల్ యూజర్లకు ఎంత లాభం?

పిక్సెల్ 9 ప్రో యూజర్లకు ఇప్పుడు మూడు ఏళ్లు డిస్‌ప్లే సమస్యలకు ఫ్రీ ప్రొటెక్షన్ ఉంది. వారంటీ ముగిసినా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అథారైజ్డ్ సెంటర్లలో ఒరిజినల్ పార్ట్స్‌తో రిపేర్ చేస్తారు కాబట్టి ఫోన్ లాంగ్ లాస్టింగ్ అవుతుంది.

ఇప్పటికే రిపేర్ చేయించారా?

మీ ఫోన్‌లో డిస్‌ప్లే సమస్య ఉండి ఇప్పటికే డబ్బులు ఇచ్చి రిపేర్ చేయించారా? ఫిజికల్ డ్యామేజ్ లేకపోతే గూగుల్ సపోర్ట్‌ను సంప్రదించండి. మీరు కూడా రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.
గూగుల్ ఈ చర్యతో ఇండస్ట్రీలో మంచి ఉదాహరణ సృష్టించి, బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటోంది. Pixel యూజర్లకు ఇది బిగ్ రిలీఫ్!

Also Read: సైబర్ దొంగల గేమ్ ఓవర్.. పవర్‌ఫుల్ యాంటీ ఫ్రాడ్ ఫీచర్ వచ్చేసింది

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×