E-Paper
Advertisement

ఇంటింటి రామాయణం.. ఏప్రిల్ 2 : పల్లవి ప్లాన్ రివర్స్.. మీనాక్షికి నిజం తెలుస్తుందా..? రాజేశ్వరి బిడ్డ ఏమయ్యాడు..?

ఇంటింటి రామాయణం.. ఏప్రిల్ 2 : పల్లవి ప్లాన్ రివర్స్.. మీనాక్షికి నిజం తెలుస్తుందా..? రాజేశ్వరి బిడ్డ ఏమయ్యాడు..?
Advertisement

Intinti Ramayanam Today Episode April 2nd : నిన్నటి ఎపిసోడ్ లో..  చక్రధర్ పూజకు టైం అవుతుంది ఎలా వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అక్కడ కిటికీలోంచి చక్రధర్ వెళ్ళిపోతాడు. అవని ఏంటి ఇంకా నాన్న రాలేదు ఫోన్ చేస్తే పిన్ని ఎత్తి రాడు అంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. చక్రధర్ ఇంట్లోంచి వెళ్లిపోయి ఉంటాడు. అయితే భానుమతి రాజేశ్వరి ఇద్దరు కూడా ఈ నా లోపల ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం పదమ్మ అని వెళ్తారు. అక్కడ లోపలికి వెళ్లి చూడగానే చక్రధర్ లేకపోవడంతో ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు..

ఒసేయ్ రాజేశ్వరి అల్లుడు గారు కిటికీలోంచి పారిపోయాడు అని భానుమతి అనగానే.. రాజేశ్వరి ఆ విషయం వెంటనే పల్లవికి ఫోన్ చేసి చెప్తుంది. డాడీ ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావడం లేదు అని పల్లవి ఆలోచిస్తూ ఉండగా.. అప్పుడే అక్కడికి చక్రధర్ రావడంతో పల్లవి రెచ్చిపోతుంది..  మీనాక్షి దగ్గర ఏముంది మా మమ్మీకి ఎందుకు దూరం చేయాలని అనుకుంటున్నావు అని పల్లవి అడుగుతుంది. మాకు అన్యాయం చేయాలని చూస్తున్నావా ఎందుకు ఇలా చేస్తున్నావ్ డాడీ అని పల్లవి అడుగుతుంది. అసలు ఆ మీనాక్షి నీకు అంతగా నచ్చేసింది అని దారుణంగా పల్లవి మాట్లాడడంతో చక్రధర్ సీరియస్ అవుతాడు.. ఏం మాట్లాడుతున్నావే.. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు అని చక్రధర్ పల్లవికి దిమ్మతిరిగిపోయే షాక్ ఇస్తాడు. తన గొంతు పట్టుకొని నీలాంటిదాన్ని బ్రతకనివ్వను అని అనగానే అప్పుడే అక్కడికి వచ్చిన ఆవని ఏం చేస్తున్నారు నాన్న అని అంటుంది. అవని రావడంతో పల్లవి ప్రాణాలతో బయటపడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవనికి పల్లవి పుట్టుక గురించి చక్రధర్ అని నిజాలను బయటపెట్టేస్తాడు. 30 ఏళ్ల నుంచి నాలోనే నేను దాచుకున్న ఈ భయంకర నిజాన్ని ఈరోజు బయట పెట్టక తప్పలేదు అని చక్రధర్ అంటాడు. మరి ఇన్ని రోజులు ఈ నిజాన్ని ఎందుకు దాచారు నాన్న అని అవని అడగగానే మీ పిన్ని బతకదు అని ఆలోచించానమ్మ అందుకే దాచాను అని అంటాడు.. పల్లవిని మీరు అలా సపోర్ట్ చేసి అలానే పెంచారు.. ఎదుటివాళ్లు గొప్పగా ఉంటే తట్టుకోలేని మనస్తత్వం పల్లవిది. ఇప్పుడు రాజేశ్వరి పిన్ని కూతురు కాదు అని చెప్పినా కూడా పల్లవి వినే స్టేజిలో లేదు. ఇక మన చేసేదేమీ లేదు తనంతట తానే నిజం తెలుసుకొని తన తల్లికి దగ్గర అవ్వడమే అని అవని చక్రధర్ అనుకుంటారు..

అప్పుడే అక్కడకు వచ్చిన మీనాక్షిని చూసి ఇద్దరు ఒక్కసారి షాక్ అవుతారు.. పంతులుగారు పూజకు రమ్మని పిలుస్తున్నారు. తర్వాత మాట్లాడుకుందురు ముందు రండి అని మీనాక్షి తీసుకొని వెళుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి స్వామివారికి మంగళసూత్రాన్ని అందిస్తారు.. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మీనాక్షి దగ్గరికి పల్లవి వెళ్తుంది.. నా బిడ్డలకి తండ్రి ఎవరో తెలిస్తే చాలు.. మీ ఆస్తి గాని మీ నాన్న గాని నాకు అక్కర్లేదని ఆరోజు అన్నావు.. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావ్ మా నాన్నతో కలిసి కూర్చొని పూజలు చేస్తున్నావా అని దారుణంగా అవమానిస్తుంది. ఆ మాట వినగానే మీనాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది..

Advertisement

నా తండ్రిని నాకు దూరం చేసి నీకు మీ పిల్లలకి మా నాన్నని తోడుగా ఉండాలని చూసుకుంటున్నావా ? మా అమ్మకి అన్యాయం చేయాలని చూసుకుంటున్నావా అని పల్లవి మీనాక్షిని దారుణంగా అవమానించేలా మాట్లాడుతుంది.. ఈ వయసులో నీకు భర్త కావాలా? మళ్లీ పిల్లలు కనలని అనుకుంటున్నావా అంటూ పల్లవి గోరంగా మాట్లాడడం మీనాక్షి తట్టుకోలేక పోతుంది. పల్లవి తో మీనాక్షి తప్పుగా మాట్లాడొద్దమ్మా నేను కూడా నీకు కన్న తల్లి లాంటి దాన్ని అంతగా చెప్తున్నా సరే వినకుండా తనని అవమానించేలా మాట్లాడుతుంది. పల్లవి నువ్వు అలా మాట్లాడడం తప్పు అని మీనాక్షి ఒక వైపు అంటున్న సరే పల్లవి మాత్రం తనని ఈ వయసులో మొగుడు కోసం ప్రాకులాడుతున్నవా? అని దారుణంగా మాట్లాడుతుంది..

Also Read :‘పొదరిల్లు’ గాయత్రి లవ్ స్టోరీలో ట్విస్టులు.. భర్త బ్యాగ్రౌండ్ ఇదే..?

ఆ మాటలు విన్న చక్రధర్ పల్లవి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా అని తిడతాడు. పల్లవి ఎంత చెప్తున్నా సరే చక్రధర్ మాట వినకుండా మీనాక్షి తిట్టడంతో సీరియస్ అయ్యి పల్లవి విన కొడతాడు. అదేంటండి మీరు అలా కొట్టేశారు అని మీనాక్షి అడుగుతుంది. నీకు తెలియదు మీనాక్షి పల్లవి బుద్ధి ఇలానే ఉంటుంది . అవని లాగా మంచి దానిలాగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా సరే తను మాత్రం వినకుండా ఇలానే మొండిగా ఉంటుంది అని చక్రధర ఉంటాడు. మీరు తనని ఎలా పెంచారు కాబట్టి అలా పెరిగింది తనను తప్ప ఏమీ లేదు అని మీనాక్షి ఎంతగా చెప్తున్నా సరే చక్రధర్ మాత్రం పల్లవిని ఎలాగైనా మార్చాలి అని అనుకుంటాడు. అవని పల్లవిని అలాగే చూస్తూ ఉండడంతో పల్లవి ఏంటక్కాలా చూస్తున్నావు ఏమైంది అని అడుగుతుంది. ఏమీ లేదులే ఊరికే చూశాను ఈరోజు నువ్వు కొత్తగా ఉన్నావని పల్లవిని అంటుంది. ఇక పల్లవికి నిజం తెలిస్తే ఎలా తట్టుకుందో ఏంటో అని అవని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×