E-Paper
Advertisement

ఇంటింటి రామాయణం.. ఏప్రిల్ 1 : పల్లవి పై చక్రధర్ సీరియస్.. అవనికి నిజం చెప్పిన చక్రధర్.. గ్రాండ్ గా సీతారాముల కళ్యాణం..

ఇంటింటి రామాయణం.. ఏప్రిల్ 1 : పల్లవి పై చక్రధర్ సీరియస్.. అవనికి నిజం చెప్పిన చక్రధర్.. గ్రాండ్ గా సీతారాముల కళ్యాణం..
Advertisement

Intinti Ramayanam Today Episode April 1st : నిన్నటి ఎపిసోడ్ లో.. గుడికి వెళ్ళడానికి  అందరూ కూడా పద్ధతిగా పట్టు వస్త్రాల్లో తయారయ్యి వస్తారు. పార్వతి మిమ్మల్ని ఇలా చూస్తుంటే అందరి దిష్టి తగిలేలా ఉంది నేను దిష్టి తీస్తాను అని అంటుంది..శ్రీరామనవమి సందర్భంగా పూజ కోసం అందరూ గుడికి వెళ్తారు. పార్వతి వాళ్ళని చూసిన పంతులుగారు మీరు వచ్చారు చాలా సంతోషంగా ఉంది. మీరు మీ వారు ప్రతి ఏడాది కూడా సీతారాముల కళ్యాణం కు మంగళసూత్రం ఇస్తారు. ఇవాళ జరిగే కళ్యాణానికి కూడా మీ కుటుంబ సభ్యులే మంగళసూత్రం ఇవ్వడం చాలా మంచిది చాలా సంతోషంగా ఉంది. అమ్మ అని అంటాడు ఇక రండి ముందుగా మీరు విగ్రహాలకు అభిషేకం చేయించాలి అని పంతులుగారు చెప్పడంతో అందరూ సరే అని అంటారు..

ఇక అందరూ కలిసి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొని వచ్చి గుడిలో కళ్యాణం కోసం ఏర్పాటుచేసిన స్థలంలో ఉంచుతారు. పార్వతి కమల్ పల్లవిలను ప్రదక్షిణాలు చేయమని పంపిస్తుంది.. తనకి సంబంధించిన అన్నిటిని మీనాక్షి అలాగే ప్రణతి తీసుకొని వస్తారు. కానీ చక్రధర్ ఇంకా రాలేదు అని అందరూ టెన్షన్ పడిపోతుంటారు.. ఎందుకు నాన్న ఇంకా రాలేదు అని అవని టెన్షన్ పడిపోతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చక్రధర్ పూజకు టైం అవుతుంది ఎలా వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అక్కడ కిటికీలోంచి చక్రధర్ వెళ్ళిపోతాడు. అవని ఏంటి ఇంకా నాన్న రాలేదు ఫోన్ చేస్తే పిన్ని ఎత్తి రాడు అంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. చక్రధర్ ఇంట్లోంచి వెళ్లిపోయి ఉంటాడు. అయితే భానుమతి రాజేశ్వరి ఇద్దరు కూడా ఈ నా లోపల ఏం చేస్తున్నాడో ఒకసారి చూద్దాం పదమ్మ అని వెళ్తారు. అక్కడ లోపలికి వెళ్లి చూడగానే చక్రధర లేకపోవడంతో ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోతారు.. ఒసేయ్ రాజేశ్వరి అల్లుడు గారు కిటికీలోంచి పారిపోయాడు అని భానుమతి అనగానే.. రాజేశ్వరి ఆ విషయం వెంటనే పల్లవికి ఫోన్ చేసి చెప్తుంది.

డాడీ ఎందుకు ఇలా చేస్తున్నారు అర్థం కావడం లేదు అని పల్లవి ఆలోచిస్తూ ఉండగా.. అప్పుడే అక్కడికి చక్రధర్ రావడంతో పల్లవి రెచ్చిపోతుంది.. మీనాక్షి దగ్గర ఏముంది మా మమ్మీకి ఎందుకు దూరం చేయాలని అనుకుంటున్నావు అని పల్లవి అడుగుతుంది. మాకు అన్యాయం చేయాలని చూస్తున్నావా ఎందుకు ఇలా చేస్తున్నావ్ డాడీ అని పల్లవి అడుగుతుంది. అసలు ఆ మీనాక్షి నీకు అంతగా నచ్చేసింది అని దారుణంగా పల్లవి మాట్లాడడంతో చక్రధర్ సీరియస్ అవుతాడు.. ఏం మాట్లాడుతున్నావే.. నీకు కన్న తల్లి లాంటి ఆమెను పట్టుకొని ఇలా మాట్లాడతావా అని చక్రధర అంటాడు.. కన్న తండ్రి నువ్వంటున్నవ్ కదా మరి కన్న తండ్రిని అడ్డు తొలగించుకోవాలని విషయం కలిపి అన్నం తినిపించాలి అనుకున్నావు కదా అది తప్పు కదా అని చక్రధర్ అంటాడు.. పల్లవి ఆ మాట వినగానే షాక్ అవుతుంది..

Advertisement

నేను మిమ్మల్ని చంపాలని అనుకోవడం ఏంటి డాడీ ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది.. అయితే నువ్వు అన్నంలో విషయం కలపడం నేను చూశాను.. నన్ను చంపాలని నువ్వు వేసిన ప్లాన్ నుంచి నేను తప్పించుకున్నాను నీళ్లు కావాలని నేను పడేసాను అని చెప్పగానే పల్లవి ఫీజులు అవుట్ అవుతాయి.. నీలాంటి దాన్ని అసలు బతకనివ్వకూడదు అని పల్లవి మెడను పట్టుకొని చంపే ప్రయత్నం చేస్తాడు చక్రధర్.. అప్పుడే అక్కడికి వచ్చిన అవని ఏంటి నాన్న మీరు చేస్తున్నది అని అంటుంది. పల్లవిని లోపలికి వెళ్ళమని చెప్పగానే తన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. చూసావా అమ్మ తన కన్నతల్లి గురించి ఎంత ఘోరంగా మాట్లాడుతుందో అని చక్రధర్ సీరియస్ అవుతాడు..

ఏంది అన్న మీరు మాట్లాడేది పల్లవి మా అమ్మకి కూతురా..? నిజం చెప్పండి నాన్న నా మీద ఒట్టేసి అని అవని అడుగుతుంది.. మీ అమ్మను అలాగే మీ పిన్ని ఒకేరోజు కాన్పుకి హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చింది.. నేను ఇద్దరినీ ఒకరికి తెలియకుండా మరొకరికి ఒకే హాస్పిటల్లో జాయిన్ చేశాను.. ఒకేసారి ఇద్దరు కూడా డెలివరీ అయ్యారు.. మీ అమ్మకు ఆడపిల్ల పుట్టింది అంటే పల్లవి పుట్టింది.. మీ పిన్నికి గుండె సమస్యతో ఉన్న బాబు పుట్టాడు.. ఇక డాక్టర్ తో మాట్లాడి ఆ బిడ్డల్నిందని మార్చేసాను అని చక్రధరి చెప్పగానే షాక్ అవుతుంది.. అయితే అప్పుడు అక్కడికి వచ్చిన మీనాక్షిని చూసి వాళ్లకి ఈ విషయం తెలిసిపోయిందేమో అని అనుకుంటారు.

Also Read :జ్యో ప్లాన్ సక్సెస్.. పారిజాతం మాటలకు ఫ్యూజుల్ అవుట్.. నిజం బయటపడుతుందా..?

పంతులుగారు పూజకు రమ్మని పిలుస్తున్నారు. తర్వాత మాట్లాడుకుందురు ముందు రండి అని మీనాక్షి తీసుకొని వెళుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి స్వామివారికి మంగళసూత్రాన్ని అందిస్తారు.. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మీనాక్షి దగ్గరికి పల్లవి వెళ్తుంది.. నా బిడ్డలకి తండ్రి ఎవరో తెలిస్తే చాలు.. మీ ఆస్తి గాని మీ నాన్న గాని నాకు అక్కర్లేదని ఆరోజు అన్నావు.. అయితే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావ్ మా నాన్నతో కలిసి కూర్చొని పూజలు చేస్తున్నావా అని దారుణంగా అవమానిస్తుంది. ఆ మాట వినగానే మీనాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×