E-Paper
Advertisement

ఒకే రోజు పుట్టిన ఇద్దరు పిల్లల వింత కథ… గుండెల్ని పిండేసే ఇద్దరు తల్లుల ఎమోషనల్ జర్నీ

ఒకే రోజు పుట్టిన ఇద్దరు పిల్లల వింత కథ… గుండెల్ని పిండేసే ఇద్దరు తల్లుల ఎమోషనల్ జర్నీ
Advertisement

Melody Drama OTT : ఒక డిఫరెంట్ స్టోరీని చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాపై ఓ లుక్ వేయండి. విమర్శకుల నుండి ఈ సినిమాకు అద్భుతమైన రేటింగ్స్ కూడా వచ్చాయి.ఐయండిబిలో దీనికి 7.1 రేటింగ్ కూడా ఉంది. ఈ కథ ఒకే రోజు ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఇద్దరు మహిళల చుట్టూ తిరుగుతుంది. వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం, వాళ్ళ జీవితాలను ఊహించని మలుపు తిప్పుతుంది.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే

2021లో పెడ్రో అల్మోడోవర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పానిష్ సినిమా పేరు ‘ప్యారలల్ మదర్స్’ (Parallel Mothers). ఇందులో పెనెలోప్ క్రజ్, మిలెనా స్మిత్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమాలో నటనకు గాను పెనెలోప్ క్రజ్ ఉత్తమ నటిగా ఆస్కార్ నామినేషన్ పొందారు. అంతకాకుండా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. మీరు ఈ సినిమాను MUBI, Amazon Prime Videoలో చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

జానిస్ అనే ఒక ఫోటోగ్రాఫర్, అనా అనే ఒక అమ్మాయి, ఇద్దరూ పెళ్లి కాకుండానే గర్భవతులవుతారు. ఒకే రోజు, ఒకే హాస్పిటల్‌లో వీళ్ళిద్దరికీ డెలివరీ అవుతుంది. జానిస్ ఏమో పాప పుట్టిందని సంతోషంగా ఉంటే, అనా మాత్రం భయపడుతూ ఉంటుంది. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు వీళ్ళిద్దరి మధ్య మంచి దోస్తీ కుదురుతుంది. తీరా ఇంటికి వెళ్ళాక కథ అసలు మలుపు తిరుగుతుంది. ట్విస్ట్ ఏంటంటే: జానిస్ ఇంటికి వెళ్ళిన కొన్నాళ్ళకు తన పాప అసలు తన పోలికల్లో లేదని డౌట్ వస్తుంది. ‘డిఎన్ఏ’ టెస్ట్ చేయిస్తే, ఆ పాప తన బిడ్డే కాదని తేలుతుంది. అంటే హాస్పిటల్‌లో పొరపాటున పిల్లలు తారుమారయ్యారన్నమాట. ఈ లోపు అనా కన్న పాప చనిపోయిందని తెలుస్తుంది. అంటే జానిస్ దగ్గర ఉన్నది అనా బిడ్డ, అనా బిడ్డ ఏమో చనిపోయింది. ఈ నిజాన్ని అనాకి చెబితే తట్టుకోలేదని జానిస్ ఆ విషయాన్ని దాచిపెట్టి, అనాను తన ఇంట్లోనే పనికి పెట్టుకుంటుంది. చివరికి అనాకి నిజం తెలిసిపోతుందా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : ఖాకీలకే ముప్పుతిప్పలు పెట్టే కేసు… మూడు సీజన్లతో 7.9 ఐయండిబి రేటింగ్… నిజంగానే తోపు సిరీస్ మావా

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×