E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ వల్ల శ్రీవల్లికి జ్వరం.. విశ్వం పై సీరియస్..భాగ్యంకు నర్మద వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ వల్ల శ్రీవల్లికి జ్వరం.. విశ్వం పై సీరియస్..భాగ్యంకు నర్మద వార్నింగ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఏ కూతురైన తన తండ్రి అరెస్టు అయితే ఎలా బయటికి తీసుకురావాలని ఆలోచిస్తుంది. కానీ నువ్వు మాత్రం నీ తండ్రి చేసిన తప్పుని బయటపెట్టి నన్ను నిర్దోషిగా బయటకు వచ్చేలా చేశావు అని నర్మదా అంటుంది.ప్రేమ మాత్రం నువ్వు నిర్దోషి అక్క అందుకే నువ్వు బయటికి వచ్చావు దీని గురించి నువ్వు పెద్దగా ఆలోచించకు. నీకేమైనా అయితే అత్తయ్య మామయ్య వాళ్ళు తట్టుకోలేరు. నువ్వు తప్పు చేయనప్పుడు ఎవరి దగ్గర తలవంచాల్సిన అవసరం లేదు అని చాలా గొప్పగా చెప్తుంది. ఆ మాటలు విన్న వేదవతి మాత్రం నువ్వు తింగరి మేనకోడలువే, నాలాంటి దానివే అనుకున్నాను కానీ నువ్వు చాలా తెలివైన దానివి గొప్ప మనసున్న దానివి అని కోడలు పై ప్రశంసలు కురిపిస్తుంది. కోపంగా ఉన్న ధీరజ్ దగ్గరికి ప్రేమ వెళుతుంది.. ఏంటి నా మీద అంత కోపంగా ఉన్నావ్ నేనేం చేశాను రా అని అంటుంది. నా మీద కోపంతో మా పుట్టింటికి వెళ్తాను అని వెళ్లావు అక్కడ నువ్వు ఏం చేసావో చెప్పు. నువ్వు ఏదో చేసి వచ్చావు అది చెప్పకపోతే మాత్రం నువ్వు కచ్చితంగా ఇప్పుడు మీ పుట్టింటికి వెళ్లాల్సిందే అని ధీరజ్ కండిషన్ పెడతాడు.. ధీరజ్ ఆ మాట అనగానే ప్రేమ మొదట భయపడుతుంది. అది విన్న ధీరజ్ షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికోస్తే.. సేనాపతిని పోలీసులు అరెస్ట్ చేశారని భద్ర, విశ్వం లాయర్ ను కలుస్తారు.. ఎలాగైనా లాయర్ బయటకు తీసుకొస్తానని చెప్తాడు. భద్రావతి మాత్రం రామరాజు కుటుంబం పై కక్ష తీర్చుకోవాల్సిందే అని అంటుంది.. అమూల్య నాకు పడిపోతుంది నా ట్రాప్ లోకి పడే రోజులు దగ్గరకొచ్చాయి. దాన్ని అడ్డుపెట్టుకొని నేను ఏదో ఒకటి చేసి మన కుటుంబాల్లో మళ్ళీ సంతోషాన్ని నింపుతాను అని విశ్వం భద్రకు మాట ఇస్తాడు.. శ్రీవల్లి మాత్రం నిద్రపోతూ కలగంటుంది. ప్రేమ తన కుటుంబంతో శ్రీవల్లి కలిసిందని తెలిస్తే ఖచ్చితంగా మెడ మీద కత్తి పెట్టి గొంతు కోసేస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నేను అసలు ఊహించలేదు అని నరికేస్తుంది..

Advertisement

అయితే ప్రేమ వచ్చినట్లు కలగన్న శ్రీవల్లి వెంటనే ఉలిక్కిపడి లేచి టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఏంటి నాకిలాంటి కలొచ్చింది అని బాధపడుతూ ఉంటుంది.. అప్పుడే ప్రేమ గొంతు బయటి నుంచి వినిపిస్తుంది.. నిజంగానే ప్రేమ నన్ను చంపడానికి వచ్చిందేమో అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది.. నేనేం చెప్పలేదు నాకేం సంబంధం లేదు అని శ్రీవల్లి ముందే ఏదో ఒకటి వాగేసి ప్రేమకు దొరికిపోతుంది.. ప్రేమ మాత్రం ఏం మాట్లాడుతున్నావ్ అక్క నేను ఊరికే ఏదో మాట్లాడాలని వచ్చాను అని అంటుంది. ఇంట్లో ఇన్ని జరిగాయి కదా అందుకే టెన్షన్ పడుతూ ఉన్నాను అంతే మరేమీ లేదు అని ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది..

ధీరజ్ క్యాబ్ బుక్ చేసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్తాడు.. అతని క్యాబ్లో ఎక్కించుకొని తన ఇంటి దగ్గరికి తీసుకుని వస్తాడు.. ఈ క్రమంలో క్యాబ్లో ఉన్న బుక్ ని ఆ పెద్దాయన చదువుతాడు.. ఇందులో రాసి ఉన్న వాటిని చదివి నీకు పోలీసు అవ్వాలని కోరిక ఉందా అని అడుగుతాడు. నాకు కాదు నా భార్యకు అని అంటాడు. ఏంటి నీకింత చిన్న వయసులోనే పెళ్లయిపోయిందని ఆ వ్యక్తి షాక్ అవుతాడు. దేవుడు నా ఆడిన నాటకంలో నేను బలయ్యాను సార్ పెళ్లి జరిగిపోయింది అలా అని దీనంగా చెప్తాడు ధీరజ్..

Advertisement

నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందిలే నీతో మాట్లాడుతూ వస్తుంటే నాకు చాలా థ్రిల్ గా అనిపిస్తుంది అసలు ప్రయాణం చేసినట్లు కూడా లేదు అని ఆ వ్యక్తి అంటాడు. 200 అయితే 500 ఇచ్చేసి అతను వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత శ్రీవల్లి ఈ కుటుంబాల మధ్య నేను ఇరుక్కుని చచ్చిపోతున్నాను ముందు చూస్తే నువ్వు ఈ వెనక చూస్తే గొయ్యి అన్నట్టు ఉంది నా పరిస్థితి అని ఆలోచిస్తూ ఉంటుంది. శ్రీవల్లికి అప్పుడే విశ్వం ఫోన్ చేస్తాడు. నాకు టైం లేదు త్వరగా ఏదో ఒకటి చేయాలి అని అంటాడు. అమూల్యని నేను కచ్చితంగా పెళ్లి చేసుకోవాలి అని విశ్వం అనుకుంటాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా బండ సచ్చినోడా నీకు ఎప్పుడు పడితే అప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదా అని శ్రీవల్లి దారుణంగా తిడుతుంది.

Also Read: భానుమతిని రెచ్చగొట్టిన పల్లవి.. మీనాక్షి డబ్బులిచ్చిన శ్రీకర్.. దొరికిపోయిన శ్రీకర్…

నీకు నేను ఎటువంటి సాయం చేయలేను నావల్ల కాదు నన్ను వదిలేసేయని శ్రీవల్లి అంటుంది. అయితే నువ్వు మా దగ్గర తీసుకున్న 10 లక్షలు వడ్డీతో సహా తీసుకొని బయటికి రా అనేసి అంటాడు. డబ్బులు పేరు చెప్పి నన్ను అడ్డంగా ఇరికిస్తున్నావు కదా ఏదో ఒకటి నా తల తాకట్టు పెట్టిన నీకు తెచ్చిస్తాను అని శ్రీవల్లి శపదాలు చేస్తుంది.. చివరికి ఏదో ఒకటి చేసి తగలడుతాను అని కమిట్ అయిపోతుంది.. ఆ తర్వాత రోజు భాగ్యం ఆనందరావు శ్రీవల్లి దగ్గరికి వస్తారు. ఏంటి నిన్ననే వెళ్లారు కదా మళ్ళీ ఇప్పుడు తగలడారు ఏంటి అని శ్రీవల్లి అడుగుతుంది. రామరాజు అన్నయ్య గారి దగ్గర ఓ ఎలాగైనా ఒప్పించి పాతిక లక్షలు తీసుకోవాలని ప్లాన్ తో వచ్చాము అని అంటారు. ముందు వేదవతి వదినను అడిగి ఒప్పిద్దాం అని అంటారు. వేదవతి దగ్గరికి వచ్చి ఈ విషయం చెప్పగానే నర్మదా మీకేం కావాలో చెప్పండి అని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×