E-Paper
Advertisement

Rashmika – Vijay: ఇట్స్ అఫీషియల్… స్టేజ్ పైనే రష్మికకు ముద్దుపెట్టిన విజయ్ దేవరకొండ!

Rashmika – Vijay: ఇట్స్ అఫీషియల్… స్టేజ్ పైనే రష్మికకు ముద్దుపెట్టిన విజయ్ దేవరకొండ!
Advertisement

Rashmika – Vijay:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పుడు రూమర్డ్ జంటగా పేరు సొంతం చేసుకున్న రష్మిక మందన్న (Rashmika Mandanna), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఎక్కడ చూసినా వెకేషన్ లకు వెళ్లడం.. ఒకే చోట కలిసి కనిపించడం లాంటివి చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. కానీ ఏ రోజు కూడా తమ బంధాన్ని ఈ జంట రివీల్ చేయలేదు. ఇదిలా ఉండగా ఇటీవల వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ దానిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. కానీ వీరిద్దరి వేళ్ళకి ఉన్న ఉంగరాలను బట్టి అందరూ వీరిద్దరికి నిశ్చితార్థం అయిపోయిందని ఫిక్స్ అయిపోయారు. ఇక వచ్చే ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

పబ్లిక్ లో రష్మికకి ముద్దు పెట్టిన విజయ్..

ఇదిలా ఉండగా రష్మిక తాజాగా నటించి విడుదల చేసిన చిత్రం ది గర్ల్ ఫ్రెండ్.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ వస్తాడని నిర్మాత అల్లు అరవింద్ స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆయన ఈవెంట్ కి హాజరు కాలేదు..కానీ ఇప్పుడు సక్సెస్ ఈవెంట్ నిర్వహించడంతో ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా విచ్చేశారు విజయ్ దేవరకొండ. అయితే ఈ ఈవెంట్ లో తమ నిశ్చితార్థం గురించి , పెళ్లి గురించి ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ అలాంటివేమి చేయలేదు. కానీ సడన్గా రష్మికకు ముద్దు పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు విజయ్ దేవరకొండ.

ఇట్స్ అఫీషియల్ గురూ..

Advertisement

అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సక్సెస్ ఈవెంట్ లో భాగంగా చీఫ్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ అల్లు అరవింద్ ను కలిసిన వెంటనే పక్కనే ఉన్న రష్మికను పలకరించి.. పబ్లిక్ లో ఆమె చేతికి ముద్దు పెట్టారు. విజయ్ దేవరకొండ అందరి ముందు ముద్దు పెట్టడంతో సిగ్గు పడుతూ బ్లష్ అయిపోయింది రష్మిక. మొత్తానికి అయితే ఇన్ని రోజులు నిశ్చితార్థం, పెళ్లి అంటూ వస్తున్న వార్తలు స్వయంగా ప్రకటించకపోయినా.. ఇప్పుడు పబ్లిక్ గా ఆమెకు ముద్దు పెట్టి అఫీషియల్ చేసేసారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

also read:Bigg Boss 9: మరీ ఇంత దారుణమా.. టీఆర్పీ రేటింగ్లో వంటలక్కను కూడా దాటేయలేని పరిస్థితా?

రష్మిక మందన్న కెరియర్..

Advertisement

రష్మిక కెరియర్ విషయానికి వస్తే.. గత మూడు సంవత్సరాలుగా వరుస విజయాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది. అలాగే మైసా, రెయిన్బో వంటి చిత్రాలలో నటిస్తోంది.

విజయ్ దేవరకొండ కెరియర్..

విజయ్ దేవరకొండ కెరియర్ విషయానికొస్తే.. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో.. ఒక సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ.. మరొకవైపు రౌడీ జనార్ధన్ అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. అంతేకాకుండా విక్రమ్ కే కుమార్ మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×