E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ఇంట్లోంచి వెళ్లిపోతున్న నడిపోడు.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి.. ఫిట్టింగ్ పెట్టేసిన ధీరజ్..

Illu Illalu Pillalu Today Episodes: ఇంట్లోంచి వెళ్లిపోతున్న నడిపోడు.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి.. ఫిట్టింగ్ పెట్టేసిన ధీరజ్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 5th: ఏమంటున్నాడు అని సాగర్ ని అడుగుతాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ కనిపించడం చూసిన రామరాజు నాన్న చెయ్యి పట్టుకుని రైస్ మిల్లు కెళ్తే అవమానంగా భావించాడు.. ఇప్పుడు ఎర్రటి ఎండలో నిలబడి ఇలా ఉద్యోగం చేస్తున్నాడు అని అవమానించేలా రామరాజు మాట్లాడుతాడు. ఇక సాగర్ ఆయన దగ్గర అసలు ఉండకూడదు అని నిర్ణయించుకుంటాడు.. ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సరదాగా భోజనం చేస్తూ ఉంటే వేదవతి సాగర్ ఇంకా రాలేదు అని అరుస్తుంది. దాంతో సాగర్ బ్యాగ్ తో బయటికి రావడం చూసి వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాము అని చెప్పగానే రామరాజు కూడా షాక్ అవుతాడు.

ఏంట్రా.. ఎక్కడకు వెళ్తున్నావ్ రా…

అరే నడిపోడా ఈ చేతిలో బ్యాగ్ ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావ్.. భోజనం చేయకుండా బ్యాగుతో బయటకు వచ్చావ్ ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావ్ అసలు అని వేదవతి కంగారు పడిపోతూ అడుగుతుంది. నేను నర్మదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని సాగర్ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వేదవతి. ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావా ఏం మాట్లాడుతున్నావ్ రా? నీకు కొంచెమైనా బుద్ధి లేదా అని వేదవతి ఎంత చెప్తున్నా సరే. అసలేం జరిగిందో మీ ఆయన నీకు చెప్పడం లేదా అని సాగర్ అంటాడు. ఆ మాట వినగానే వేదవతి ఏం జరిగింది నేను కనుక్కుంటా నాకు అని కంగారు పడిపోతుంది. అసలేం జరిగింది అని వేదవతి అడగగానే తిరుపతి జరిగిన విషయాన్ని చెప్తాడు..

రచ్చచేసిన సాగర్..

Advertisement

నన్ను నా ఆఫీస్ వాళ్ళ ముందర నా పని వాళ్ళ ముందర అవమానించాడు. ఎన్నిసార్లు నన్ను అలా అవమానిస్తాడు ఇంట్లో ఉన్నప్పుడు అంతే.. బయట కూడా నా వాళ్ళ ముందర నన్ను అవమానించేసాడు. కొడుకు బాగుపడుతున్నాడు అంటే ఎంతోమంది తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉంటారు.. ఈయన మాత్రం నువ్వు అడుగడుగునా అవమానిస్తూనే ఉన్నాడు.. నేను ఫస్ట్ జీతం వచ్చిన తర్వాత చాలా సంతోషంగా అందరికీ బట్టలు తీసుకొనొచ్చాను. వాటిని ఆయన తగలబెట్టేసి నన్ను చాలా బాధ పెట్టాడు అని వేదవతితో చెప్పి బాధపడతాడు సాగర్.. కానీ ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అని సాగర్ నీ వేదవతి అడుగుతుంది. వేదవతి మాట వినని సాగర్ నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్తాడు.

5 లక్షలు కట్టి వెళ్లాల్సిందే..

అరె చిన్నోడా పెద్దోడా వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటున్నాడు రా మీరు వాడికి నచ్చితే ఆపండ్రా అనేసి వేదవతి అంటుంది. ప్రతిసారి ఏంట్రా ఇది నాన్న కోపం కూడా ప్రేమే రా అని చందు అనగానే.. నువ్వు ఆయనకు ముద్దుల కొడుకువి నీ మీద ఆయనకే బోలెడు ప్రేమ ఉంది.. కానీ నేనంటే ఆయనకి ఎంత కోపం ఉందో నాకు తెలుసు. ప్రతిసారి నువ్వే చేశావు అంటూ నన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నాడో నాకు మాత్రమే తెలుసు అని సాగర్ అంటాడు.. అరె చిన్నోడా నువ్వేనా వాడికి సద్ది చెప్పు రా నీ వేదవతి అనగానే.. వెళ్లాలనుకుంటే వెళ్లిపోని ప్రతిసారి ఇలా బెదిరించడం ఎందుకు అని ధీరజ్ అంటాడు. నాన్నకి వలసిన ఐదు లక్షలు కట్టిన తర్వాతే వెళ్లాలి అని అనగానే రామరాజు కూడా చిన్నోడి మాటకి సపోర్ట్ గా నిలుస్తాడు.. వదిన నన్ను క్షమించు వదిన అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా చేయడానికి ఇలా మాట్లాడను అని ధీరజ్ అనగానే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు..

భాగ్యంకు చెప్పిన వల్లి..

Advertisement

భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా చాలా సంతోషంగా చేపల కూర తినడానికి రెడీ అవుతుంటారు. అప్పుడే శ్రీవల్లి ఫోన్ చేసి కడుపుతో ఉన్న వాళ్లకి చాలా కోరికలు ఉంటాయి కదా.. నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి అని అనగానే ఆనంద్ రావు అమ్మాయిని బాధ పెడుతున్నావు అని అంటాడు.. నేనేమీ బాధ పెట్టలేదు. ఇప్పుడు అది చాలా సంతోషంగా ఉంది కదా అలానే ఉండనివ్వండి అని భాగ్యం అంటుంది. నాకు పీతల పులుసు తినాలని ఉందమ్మా అని అనగానే సరే అమ్మ నీకు పంపిస్తాను అని అంటుంది భాగ్యం.. ఇంట్లో ఇందాక పెద్ద గొడవ జరిగిందే బాబా అని మొత్తం పూసకొచ్చినట్లు వల్లి తన తల్లికి చెప్తుంది. చందు మీ అమ్మకి మొత్తం చెప్పేసావా ఇకనైనా నీకు కాపురం నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యు అని అంటాడు.

నర్మదకు దొరికిపోయిన సాగర్..

ఏంటి సాగర్ ఇది? ఇంత కోపం ఆవేశం ఎందుకు నీకు.. అసలు ఇంట్లో నుంచి వెళ్లాలన్న ఐడియా నీదా మా నాన్నదా అని అనగానే బయట కూర్చుని ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అవమానాలు పడుతూ ఇక్కడే ఉండాలంటే నావల్ల కాదు. ఐదు లక్షలు అడిగారు కదా వాటిని కట్టేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఈ నరకం నుంచి బయట పడదామని సాగర్ అనగానే రామరాజు ఫీల్ అయిపోతాడు. నర్మదా ఇంట్లో నుంచి వెళ్లకుండా ధీరజ్ చేసిన ప్రయత్నం పై ప్రేమ ఎమోషనల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: ఆస్తి కోసం శ్రీయా రచ్చ.. ప్రణతి కోసం వెళ్లిన భరత్.. అవనికి దిమ్మతిరిగే షాక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×