E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode May 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు షాక్ ఇచ్చిన లాయరు

Brahmamudi Serial Today Episode May 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు షాక్ ఇచ్చిన లాయరు
Advertisement

Brahmamudi serial today Episode: ఇందు వేలి ముద్ర వేసిన పేపర్స్‌ తీసుకుని లాయరు దగ్గరకు వెళ్లిన రేఖ, భూషణ్‌లకు లాయరు షాక్‌ ఇస్తాడు. వాళ్ల అమ్మానాన్న రాసిన వీలునామా ప్రకారం ఇందు సంతకం చేసిన పేపర్స్‌ చెల్లవని వీలునామా ప్రకారం ఇందు పెళ్లి చేసుకోవాలి. వాళ్లిద్దరూ సంతోషంగా ఉండాలి. వాళ్లే కంపెనీ వ్యవహారాలు చూసుకోవాలి. ఆ తర్వాతే ఆస్థి మీద పూర్తి అధికారం వస్తుంది. అప్పుడే వాళ్లు ఎవరికైనా ఆస్థిని ట్రాన్స్‌ఫర్‌ చేసే హక్కు వస్తుంది అని చెప్పగానే.. రేఖ కోపంగా నో అలా జరగడానికి వీల్లేదు అంటూ అరుస్తుంది.

భూషణ్‌ కూడా అయినా వీలునామా రాసిన వాళ్లు చనిపోయారు. ఈ వీలునామాది ఏముంది..? ఆస్థి ట్రాన్స్‌ఫర్‌ చేయించండి అనగానే.. లాయరు ఏం మాట్లాడుతున్నారండి ఒక్కసారి వీలునామా రాస్తే చేంజ్‌ చేయాలంటే వాళ్లకు మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ వాళ్లు ఇప్పుడు లేరు కదా..? చెప్పాను కదా ఇందు పెళ్లి చేసుకుని తన భర్తతో కంపెనీ వ్యవహారాలు చూసుకుంటేనే తనకు హక్కు వస్తుంది. అప్పటి వరకు తను సంతకం చేసిన ఈ పేపర్స్‌ చిత్తు కాగితాలు అంటూ ఆ పేపర్స్‌ చింపేసి వెళ్లిపోతాడు లాయరు.

Advertisement

మరోవైపు ఇందు, అపర్ణ, సుభాష్‌లతో నిజం చెప్తుంది. నాకు పెళ్లి అయ్యేంత వరకు నాకు ఈ ఆస్థి మీద ఎటువంటి అధికారం లేదు. నేను వేసిన వేళి ముద్ర దేనికీ పనికిరాదు అని చెప్పగానే.. అంటే ఈ విషయం నీకు ముందే తెలిసి వాళ్లను పిచ్చి వాళ్లను చేశావా..? అంటూ స్వాతి అడగ్గానే.. అవును లేకపోతే అంత ఈజీగా నేను వేలిముద్ర వేస్తానా..? నాన్నమ్మ నేను మీ గురించి భయపడింది నిజమే వాళ్లు మిమ్మల్ని ఎప్పుడు ఏం చేస్తారో అని టెన్షన్‌ పడిపోయాను. నాకు ఆస్థికన్నా మీరే ముఖ్యం అనుకున్న కానీ ఎప్పుడైతే మీరు మా అమ్మ జీవితం చదువు అని ఆ పుస్తకం ఇచ్చావో ఆ పుస్తకం చదివాకే నాకు ధైర్యం వచ్చింది. నాకు మీరు ఆస్థి రెండు కావాలి అనిపించింది. ఏ ఒక్కటి వదులుకున్నా నా జీవితానికి అర్థం ఉండదనిపించింది. అందుకే మిమ్మల్ని ఆస్థిని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాను.. అదీకాక మా అమ్మానాన్నలు ముందు చూపుగానే ఆ వీలునామా రాశారు. మా అమ్మానాన్న కోరుకున్నట్టుగానే ఎలాంటి సిచ్యుయేషన్‌ ఎదురైనా నేను ధైర్యంగా పోరాడతాను.

అంతే కానీ ఆస్థిలో చిల్లిగవ్వ కూడా ఆ రేఖ ఆంటీకి దక్కనివ్వును అంటూ చెప్పగానే.. సుభాష్‌ సూపర్‌ అమ్మా నువ్వు నిజంగా నిన్ను చూస్తుంటే.. మీ అమ్మను చూసినట్టే ఉంది అంటాడు. అపర్ణ కూడా మీ అమ్మానాన్న ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది. పిల్లాపాపలతో అంతా బాగుంది అనుకున్నప్పుడే ఆ యాక్సిడెంట్‌ జరిగి మనం మన ఇంట్లోనే ఒక మూలన పడాల్సి వచ్చింది అంటూ ఏడుస్తూంది. దీంతో ఇందు నాన్నమ్మ వాళ్లు ఇక ఏమీ చేయలేరు.. మీరు ధైర్యంగా ఉండండి అంటూ భరోసా ఇస్తుంది. ఇంతలో స్వాతి అవునక్కా నీకు పెళ్లి అయ్యే వరకు ఆస్థి మీద హక్కు లేదని నీకెలా తెలిసింది అని అడగ్గానే.. నిన్న రాత్రి లాయరు సత్యదేవ్‌ గారు ఫోన్‌ చేశారు. అంటూ లాయరు తనకు ఫోన్‌ చేసి మాట్లాడిన విషయం చెప్తుంది. ఆయనే ఈ నిజం చెప్పారు అంటూ నవ్వుతూ చెప్తుంది ఇందు.

Advertisement

ఇంటికి వచ్చిన రేఖ, భూషణ్‌ డల్లుగా కూర్చుని ఉంటే భ్రమరాంబ వచ్చి నిజం తెలుసుకుని డల్లుగా ఆలోచిస్తూ కూర్చుంటుంది. అప్పుడే శేషు తడిగుడ్డలు తీసుకొచ్చి వాళ్ల నెత్తుల మీద కప్పుతుంటాడు. రేఖ తిడుతుంది. శేషు తన మాటలతో వాళ్లను ఇరిటేట్‌ చేస్తాడు. రేఖ మాత్రం ఆ ఆస్థిని ఎలా చేజిక్కించుకుంటానో మీరు చూస్తారుగా అంటూ చెప్పగానే.. శేషు మౌనంగా ఉండిపోతాడు. మరోవైపు రాజు నిద్రపోతుంటే.. లక్ష్మీ, చలపతి వెళ్లి చూస్తూ.. గొప్పొళ్ల ఇంట్లో పుట్టి మన ఇంట్లో ఇలా బతుకుతున్నాడని బాధపడతారు. నిజం ఎప్పటికీ రాజుకు చెప్పకూడదని చలపతి, లక్ష్మీకి చెప్తాడు. ఎందుకంటే ఆ ఇంటి వారసుడు అని తెలిస్తే ఆ రేఖ వీడిని చంపేస్తుందేమోనని భయపడతారు.

మరోవైపు రేఖ ఆస్థి కోసం  తన కొడుకు మదన్‌ ను రంగంలోకి దించుతుంది. ఇందు ఆస్థిని మనం లాక్కోవాలి అంటే మదన్‌, ఇందును పెళ్లి చేసుకోవాలని చెప్తుంది. మదన్‌ ఒప్పుకోకపోతే ఆస్థి మన చేతికి వచ్చాక దానితో విడాకులు ఇప్పిస్తాను.. తర్వాత నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తాను అని నచ్చజెప్తుంది రేఖ. అయితే భ్రమరాంబ స్వాతిని మదన్‌కు ఇస్తామన్నాం కదా అంటూ అడ్డుపడుతుంది. దీంతో రేఖ భ్రమరాంబను తిట్టి వెళ్లిపోతుంది. దీంతో భ్రమరాంబ కోపంగా ఆస్థిని నువ్వు ఒక్కదానివే కొట్టేయాలని చూస్తున్నావా..? అదెలా జరుగుతుందో నేను చూస్తాను అని మనసులో అనుకుంటుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×