E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: కొత్త కారు కొన్న ధీరజ్.. ఫీల్ అవుతున్న ప్రేమ..విశ్వం రీ ఎంట్రీ అదుర్స్..

Illu Illalu Pillalu Today Episodes: కొత్త కారు కొన్న ధీరజ్.. ఫీల్ అవుతున్న ప్రేమ..విశ్వం రీ ఎంట్రీ అదుర్స్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode May 15th: శ్రీవల్లి కడుపు పండేందుకు రాత్రి సుకన్య ఏదో ప్లాన్ చేసింది. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అయిందో అర్థం కావడం లేదు కదా ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటాను అని భాగ్యం అనుకుంటుంది. అయితే ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా శ్రీవల్లి కట్ చేయడంతో నా ఫోనే కట్ చేస్తున్న దీని సంగతి నేను చెప్తాను అని భాగ్యం అంటుంది.. అప్పుడే శ్రీవల్లి అలాగే సుకన్య అక్కడికి వస్తారు. రాత్రి దీని ప్లాను బెడ్స్ కొట్టింది అని చెప్పగానే భాగ్యము ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆ తర్వాత నర్మదా నన్ను వేరే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాను అని చెప్పింది అని అనగానే ఆ నర్మదని శాశ్వతంగా దూరం చేసే ప్లాన్ చేస్తాను అని భాగ్యం అంటుంది.. ఏంటమ్మా నువ్వు అనేది అని శ్రీవల్లి షాక్ అవుతుంది..

ధీరజ్ పై వేదవతి సీరియస్..

వేదవతి వంట చేసుకుంటూ ఉండగా ధీరజ్ అక్కడికి వచ్చి అమ్మ ఏంటమ్మా నామీద అంత కోపం ఉన్నావు అని అడుగుతాడు. ఎందుకమ్మా మనం అంత కోపంగా ఉన్నావో చెప్పమ్మా నీ ధీరజ్ ఎంతగా బలవంతంగా అడిగినా సరే వేదవతి మాత్రం మాట్లాడకుండా సీరియస్ గా ఉంటుంది. నువ్వు అలా ఉంటే నేను తట్టుకోలేను అమ్మ ఏం జరిగిందో చెప్పమ్మా అని ధీరజ్ అంటాడు.. నువ్వు కారు కొనడానికి మీ నాన్న డబ్బులు ఇస్తాడు అంటే ఎందుకు తీసుకోలేదు.. కనీసం నా గాజులైన తీసుకుని వెళ్లి పెట్టరా నీకు డబ్బులు వస్తాయి అని వేదవతి అంటుంది. కానీ నేను కార్ కొనేశానమ్మ.. మరి కాసేపట్లో కారు వచ్చేస్తుంది అని చెప్పగానే వేదవతి అవునా నిజమా నాకెందుకు చెప్పలేదు అని ఆశ్చర్య పోతుంది.. అప్పుడే కారొచ్చిన సౌండ్ వినిపించడంతో అమ్మ కారు వచ్చేసింది చూద్దామని వేదవతిని బయటకు తీసుకుని వెళ్తాడు ధీరజ్.

కొత్త కారు కొన్న ధీరజ్…

Advertisement

కొత్త కార్ ని ఎలాగైనా కొనాలని అనుకున్న ధీరజ్ కళ మొత్తానికి నెరవేరుతుంది. కారు రావడంతో వేదవతి చాలా సంతోషంగా ఇంట్లోని వాళ్లందరినీ కూడా పిలుస్తుంది. అందరూ రండి ధీరజ్ కొన్న కొత్త కారు వచ్చేసింది అని చెప్పగానే అందరూ చాలా సంతోషంగా కారుని చూడ్డానికి అని బయటికి వెళ్తారు. రామరాజు కూడా అక్కడ ఉండడంతో వేదవతి మీరు కూడా రండి మా కొడుకుని ఎన్నెన్నో మాటలు అన్నారు కదా అని తీసుకొని వెళ్తుంది. ఆ కారణం చూసిన అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కారు చాలా బాగుంది అంటూ అందరూ కంగ్రాట్స్ చెప్తారు.

ధీరజ్ మాటతో వేదవతి ఎమోషనల్..

ధీరజ్ గుడికి వెళ్ళాలి పద అని వేదవతి అంటే.. ఈ గుడికి అవసరం లేదమ్మా దేవత లాంటి మా అమ్మ ఇక్కడే ఉండగా మా అమ్మతో పూజ చేయించుకోవాలి అన్నది నా కోరిక అని ధీరజ్ అంటాడు. నీ చేత్తో పూజ చేసి మంచిగా ఉండాలని కోరుకో అమ్మ అని వేదవతిని అనగానే ఆమె చాలా ఎమోషనల్ అయిపోతుంది. నా కొడుకుకి నేనంటే ఎంత ప్రేమ అని తెగ సంబరపడిపోతుంది.. మొత్తం పూజ అయ్యాక ప్రేమ ధీరజ్ కి నేనంటే ఇష్టం కదా అక్క నన్నే ముందు తీసుకుని వెళ్తాడు అని అంటుంది. కానీ ధీరజ్ మాత్రం ప్రేమకు షాక్ ఇచ్చేలా తన కన్న తల్లిదండ్రులని కారులో తీసుకుని బయటికి వెళ్తాడు.. వేదవతి కారుని చూసి చాలా మురిసిపోతుంది. రామరాజు పై సెటైర్లు కూడా వేస్తుంది. మనం ఇంట్లోనే వాళ్ళందరిని తీసుకొని బయటికి వెళ్దామని రామరాజు ఇంటికి వెళ్దాం పద అని అంటాడు.

విశ్వం రీ ఎంట్రీ..

Advertisement

కారు ఇంట్లోకి తీసుకొని వెళ్ళగానే బ్యాండ్ మేళం రావడంతో తిరుపతి పని అయి ఉంటుందని అనుకుంటారు.. కానీ వెంటనే భద్రావతి వాళ్ళు కారులో రావడం చూసి అందరూ ఏమై ఉంటుందని షాక్ అయి చూస్తూ ఉంటారు.. విశ్వం కార్ లోంచి బయటికి రావడం చూసి మిగిలిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు.. పులి లాగా నువ్వు బయటికి రారా అని భద్రావతి విశ్వం ని బయటకు తీసుకొని వచ్చి గ్రాండ్గా వెల్కమ్ చెప్తుంది. వచ్చి రాగానే ధీరజ్ వాళ్లతో గొడవకు దిగుతారు.. అమూల్య మాత్రం విశ్వం వచ్చాడంటే తనకి ఏమైనా చేస్తాడేమో అని భయపడుతూ ఉంటుంది.. ధీరజ్ మాత్రం బెయిల్ మీద వచ్చాడు అది గుర్తుపెట్టుకొని ఉంటే మంచిది లేదంటే మళ్లీ మీ ముగ్గురు జైలుకు వెళ్లాలని వార్నింగ్ ఇస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :ఫ్యాన్స్ కు షాకిచ్చిన మీనా.. ఇది అస్సలు ఊహించలేదు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×