// // Fuel rates hiked: సామాన్యుడి జేబుకు చిల్లు పడింది.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్-డీజిల్ ధరలు, లీటర్ ఎంతంటే.. -->
E-Paper
Advertisement

సామాన్యుడి జేబుకు చిల్లు పడింది.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్-డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ మాటేంటి?

సామాన్యుడి జేబుకు చిల్లు పడింది.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్-డీజిల్ ధరలు, గ్యాస్ సిలిండర్ మాటేంటి?
Advertisement

Fuel rates hiked:  ఎట్టకేలకు అనుకున్నట్లుగా దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై మూడేసి రూపాయలు పెంచుతూ ఆయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో సామాన్యుడి జేబుకు చిల్లుపడింది. పెరిగిన ధరల ప్రకారం దేశంలోని నాలుగు మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.

దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్-డీజిల్ ధరలు

Advertisement

పశ్చిమాసియా నెలకున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. కొంతకాలంగా నార్మల్‌గా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు కంపెనీలు సవరించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్‌పై వెయ్యి రూపాయలకు వడ్డించాయి.

తాజాగా పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఆయిల్ ధరలు పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.97.77కు చేరింది. డీజిల్ ధర రూ.90.67కు పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు భారీగా పెరిగాయి. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.74 లకు చేరింది. ముంబైలో రూ.106.68 లు కాగా, చెన్నైలో రూ.103.67 లకు చేరింది.

Advertisement

లీటర్‌కు మూడు రూపాయలు చొప్పున వడ్డన, సామాన్యూడి జేబుకు చిల్లు

ఇక డీజిల్ ధరల విషయానికి వద్దాం. కోల్‌కతాలో రూ.95.13 కాగా, ముంబైలో రూ.93.14లకు చేరింది. ఇక చెన్నైలో రూ.95.25లకు చేరింది. వివిధ నగరాలను బట్టి పెంపులో కాస్త అటు ఇటుగా చిన్నపాటి తేడా ఉండనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత చమురు ధరలు పెంచడం ఇదే తొలిసారి. ఆన్‌లైన్ పోర్టల్‌లో ధరల మార్పును గమనించాలని బంకు యాజమానులకు ఏపీఎఫ్పీటీ సమాచారం ఇచ్చింది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ3.29, డీజిల్‌పై రూ.3.14 పెరిగాయి. తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌పై రూ.3 చొప్పున పెరిగాయి. ఆయిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి.

ALSO READ: 588 మంది వాంగ్మూలం.. 7,500 పేజీల చార్జి షీట్.. ఎర్రకోట బ్లాస్టింగ్ కేసులో సంచలనాలు..!

పశ్చిమాసియాలో కొనసాగుతోన్న సంక్షోభం నేపథ్యంలో ముడి చమురు ధరలు అమాంతంగా పెరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వరంగ చమరు కంపెనీలు దాదాపు 11 వారాల పాటు ధరలను స్థిరంగా ఉంచే ప్రయత్నం చేశాయి. 2022 ఏప్రిల్‌ నుంచి పెట్రోల్‌-డీజిల్‌ ధరలు ఏ మాత్రం మారలేదు. లోక్‌సభ ఎన్నికలకు ముందు అంటే 2024 మార్చిలో లీటరకు రూ.2 చొప్పున తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. వంట గ్యాస్ సిలిండర్‌పై 30 నుంచి 50 రూపాయలు పెరిగే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్చి ఫస్ట్ వీక్‌లో వంట గ్యాస్ సిలిండర్‌పై కేంద్రం 60 రూపాయిలు పెంచిన విషయం తెల్సిందే.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×