E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: మళ్ళీ ఫిట్టింగ్ పెట్టేసిన వల్లి.. బాధపడిన ప్రేమ.. విశ్వంను అరెస్ట్ చేసిన పోలీసులు..

Illu Illalu Pillalu Today Episode: మళ్ళీ ఫిట్టింగ్ పెట్టేసిన వల్లి.. బాధపడిన ప్రేమ.. విశ్వంను అరెస్ట్ చేసిన పోలీసులు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode March 19th: నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ మాత్రం ప్రేమ చెప్పిన మాటని వినకుండా తనని అసహ్యించుకుంటాడు.. ప్రేమ ఎంత చెప్తున్నా సరే నువ్వు చేసిన పనికి నిన్ను ప్రేమించాలని అనిపించడం లేదు. పెళ్లి పీటల నుంచి లేచిపోయిన నిన్ను ప్రేమించాను చూడు అది నేను చేసిన తప్పు. నీకు నాలాంటి వాళ్ళు కాదు ఆ కళ్యాణ్ లాంటి వాళ్ళు అయితేనే కరెక్ట్ అంటూ ప్రేమ గురించి ధీరజ్ దారుణంగా మాట్లాడుతాడు.. నీ మొహం కూడా నాకు చూపించడానికి వీల్లేదు అని చెప్పేసి వెళ్తాడు. ఇదంతా విన్న నర్మదా ధీరజ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ అర్థం అవుతుందా అని అడుగుతుంది. నేనేం మాట్లాడాలో నాకు బాగా తెలుసు వదిన మీరు ఏమి ఈ విషయాల్లో కల్పించుకోవద్దు అని ధీరజ్ అంటాడు..

ప్రేమని నర్మద ఎంత ఓదార్చిన సరే ప్రేమ మాత్రం ధీరజ్ నన్ను బాధ పెట్టాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. శ్రీవల్లి మాత్రం తను వేసిన ప్లాను సక్సెస్ అయింది అని డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఇన్ని రోజులు నువ్వు తెలివితక్క దానివి ఎలా బతుకుతావు అని ఆలోచించను ఇప్పుడు మాత్రం నువ్వు మంచి పని చేశావు అని భాగ్యం మెచ్చుకుంటుంది.. రామరాజు విశ్వం దగ్గరికి వెళ్లి చితగ్గొట్టేస్తాడు. నా కూతురునే కిడ్నాప్ చేస్తావా నా కూతురినే నువ్వు కొడతావా అని విశ్వాన్ని కొట్టేస్తాడు.. ధీరజ్ వెళ్లి అమూల్య నువ్వు కిడ్నాప్ చేసినందుకు పోలీసులకు కంప్లైంట్ ఇస్తాడు. ఇక ఇంట్లో ఉగాది పండుగ వాతావరణం మొదలవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. వేదవతి పూజ చేసి ఉగాది పచ్చడిని ఇస్తుంది.. కానీ నర్మదా ప్రేమలకు మాత్రం శ్రీవల్లికి ఇవ్వమని చెప్తుంది. అయితే మరోసారి శ్రీవల్లి తనకి అనుగుణంగా మార్చుకుంటూ వాళ్ళిద్దరిని ఇరికిస్తుంది. మీరు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అత్తయ్య మామయ్యలకు మంచి పేరు తీసుకురండి అని శ్రీవల్లి కావాలని రామరాజు ముందర వాళ్ళిద్దరిని అంటుంది. దానికి రామరాజు వదిలేయమ్మ శ్రీవల్లి వాళ్ళందరూ నీలాంటి మంచి వాళ్ళు కాదు కదా.. నా ఇంటి పెద్ద కోడలుగా నువ్వు ఎంతో గొప్ప స్థానంలో ఉన్నావు.. నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు మారరు వాళ్ళు ఇంతే అని రామరాజు వెళ్లిపోతాడు.. ఇన్ని రోజులు తీపి అనుకున్నవి చేదుగా మారాయి అని వేదవతి కూడా వెళ్ళిపోతుంది.

ఇక ప్రేమ నర్మదా అక్కడి నుంచి వచ్చేస్తారు.. ఏంటి ప్రేమ అలా వచ్చేసావు? ఏమైంది నీకు అని నర్మదా ఎంతగా బ్రతిమలాడిన సరే.  ప్రేమ మాత్రం చూసావా అక్క బల్లి అక్క ఎలా మాట్లాడుతుందో అందరూ నన్ను ఎలా అంటున్నారు అని బాధపడిపోతూ ఉంటుంది.. నర్మదా ఏదానికైనా సరే ఒక టైం వస్తుంది ఆ టైం కి మనం ఏంటో మనం చూపించుకోవచ్చు అంతవరకు ఓపిక పట్టు అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శ్రీవల్లి ఏంటి చెల్లాయి పచ్చడి తీసుకోకుండా వచ్చేసావు అని అంటుంది. మీరు ఇప్పటికైనా మారి ఇలాంటివి చేయకుండా ఉంటే బాగుంటుంది అని శ్రీవల్లి అంటుంది..

Advertisement

ఇకపోతే శ్రీవల్లి అన్న మాటలకి నర్మదా ప్రేమ ఇద్దరు సీరియస్ గా ఉంటారు. చూసావా ఈవిడ ఎంతగా ఎగిరెగిరి పడుతుందో అని ప్రేమ అనగానే నర్మదా నువ్వేం బాధపడకు ప్రేమ ఏదో ఒకరోజు ఆమె బండారం బయటపడుతుంది. అప్పుడు మనం సంతోషంగా ఉందామని అంటుంది. ఇక భద్రావతి ఇంట్లో కూడా ఉగాది పండుగ జరుపుకుంటారు. విశ్వం ఎక్కడికెళ్లాడో తెలియడం లేదు అని అందరూ అనుకుంటారు అప్పుడే విశ్వం దెబ్బలతో లోపలికి వస్తాడు. ఏంట్రా విశ్వం ఏమైంది ఎవరిని ఎలా కొట్టింది అంటే ఆ రామరాజు కొట్టాడు అని చెప్పగానే వాళ్ళందరూ కూడా గొడవకి దిగుతారు.. అప్పుడు అక్కడికి వచ్చిన పోలీసులు విశ్వం ని అరెస్ట్ చేస్తాము అని అంటారు. ఆ రామరాజు మా వాడిని కొడితే మా వాడిని ఎలా అరెస్ట్ చేస్తారు అని భద్ర అంటుంది..

Also Read :అవని, అక్షయ్ ల రొమాన్స్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. మీనాక్షి దగ్గరకు వెళ్లిన చక్రధర్..

కానీ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిన కేసులో మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తున్నాము అని పోలీసులు చెప్పగానే భద్రావతి షాక్ అవుతుంది.. ఇక అమూల్య అనే కేసు పెట్టింది అని తెలుసుకొని విశ్వం అమూల్యని కొట్టబోతాడు. అది చూసిన వేదవతి భద్రా కి వార్నింగ్ ఇస్తుంది. నీ అంత చూస్తాము అని భద్రవతి పోలీస్ స్టేషన్ కి వెళుతుంది.. అక్కడ విశ్వం ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిన సరే ఫలించవు. ఇక ధీరజ్ చేసిన పనికి వేదవతి సీరియస్ అవుతుంది కానీ రామరాజు మాత్రం వాడు చేసింది కరెక్టే అని అంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×