E-Paper
Advertisement

Allu Arjun: ‘ధరంధర్ 2’ సినిమాపై పాన్ ఇండియా స్టార్ ప్రశంసలు.. దేశం గర్వపడేలా..

Allu Arjun: ‘ధరంధర్ 2’ సినిమాపై పాన్ ఇండియా స్టార్ ప్రశంసలు.. దేశం గర్వపడేలా..
Advertisement

Allu Arjun: ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో మోస్ట్ అవేటెడ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా చూసిన సెలబ్లరిటీలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని వీక్షించి, చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ స్వయంగా ఒక సినిమాని పొగడటంతో ఆ సినిమా ప్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Read also-Samantha : చీరలో బాపుబొమ్మలా మెరిసిపోతున్న సమంత.. ఎంత అందంగా ఉందో…

దేశభక్తికి ‘స్వాగ్’ తోడైతే..

Advertisement

సినిమా చూసిన తర్వాత బన్నీ తన ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు. “దేశభక్తిని ఎంతో స్టైలిష్‌గా, పక్కా ‘స్వాగ్’తో చూపించిన చిత్రమిది” అని ఆయన పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ సినిమా ఉందని, థియేటర్లలో ఈలలు వేయించే సన్నివేశాలు సినిమాలో కోకొల్లలుగా ఉన్నాయని ఆయన కొనియాడారు. ఈ చిత్రాన్ని ఒక ‘బ్లాస్ట్’ గా అభివర్ణిస్తూ, యూనిట్ మొత్తానికి అభినందనలు తెలిపారు.

నటీనటుల ప్రతిభకు ఫిదా

ముఖ్యంగా సీనియర్ నటుడు మాధవన్ నటనను అల్లు అర్జున్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. మాధవన్ గారితో పాటు మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారని ప్రశంసించారు. ఇక తన సోదరుడుగా భావించే రణవీర్ సింగ్ గురించి చెబుతూ.. “రణవీర్ లాంటి అద్భుతమైన, వెర్సటైల్ నటుడు మన దేశంలో ఉండటం మనందరికీ గర్వకారణం. రణవీర్ సింగ్ ఈ సినిమాలో నిప్పులు చెరిగాడు” అంటూ రణవీర్ ఎనర్జీని ఆకాశానికెత్తేశారు.

Advertisement

Read also-Ustaad Bhagath Singh OTT : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడు అవుతుందంటే..?

దర్శకుడి మేకింగ్‌పై ప్రశంసలు

‘ఉరి’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శకుడు ఆదిత్య ధర్ రూపొందించిన చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. అల్లు అర్జున్ స్పందిస్తూ.. “ఆదిత్య ధర్ ఈ సినిమాతో బంతిని స్టేడియం దాటించేశారు. మన దేశంలో ఇలాంటి ప్రతిభావంతులైన దర్శకులు ఉండటం ఎంతో సంతోషం” అని పేర్కొన్నారు. సినిమాలోని సాంకేతిక విలువలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని బన్నీ అభిప్రాయపడ్డారు. “ఒక స్వచ్ఛమైన భారతీయ కథకు అంతర్జాతీయ స్థాయి స్టైల్ అద్ది తీర్చిదిద్దారు” అంటూ తన రివ్యూను ముగించారు అల్లు అర్జున్. చివరగా ‘జై హింద్’ అంటూ తన దేశభక్తిని చాటుకున్నారు. అల్లు అర్జున్ వంటి ఒక పాన్ ఇండియా స్టార్ నుంచి ఇలాంటి రివ్యూ రావడంతో ‘ధురంధర్ 2’ టీమ్ మెంబర్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×