E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. కోపంతో రగిలిపోయిన నర్మదా.. ప్రేమపై అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: హమ్మయ్య శ్రీవల్లి ఫుల్ హ్యాపీ.. కోపంతో రగిలిపోయిన నర్మదా.. ప్రేమపై అనుమానం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 30th: ఉదయం లేవగానే నర్మదా బాక్స్ కట్టుకోవడానికని వంట గదిలోకి వెళ్తుంది.. శ్రీవల్లి వేదవతి నర్మదపై ఎలా అరుస్తుందో చూడాలి అని రెడీ అయి మరి అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది.. అయితే నర్మదా వంటగదిలోకి వెళ్లి వేదవతి తో చాలా ప్రేమగా మాట్లాడుతుంది.. తను మాత్రం చాలా కోపంగా వంటగదిలో ఉన్న గిన్నెలని విసిరి కొడుతూ ఉంటుంది.. నర్మద మాట్లాడుతుంటే వేదవతి చాలా కోపంగా ఉంటుంది.. కానీ నర్మద మాత్రం వేదవతిని పొగిడిస్తూ ఉంటుంది.. నాకు కొంచెం కూర కావాలి అని అడగడంతో అది తీసుకుంటున్న నర్మదను చూసి వేదవతి గిన్నెలు విసిరి కొట్టేస్తుంది. రామరాజు ఏమైందని కంగారుపడుతూ వంటగదిలోకి వస్తాడు.. వేరే కాపురం పెట్టారు కదా వంట చేసుకోవడం రాదా ఏంటి మళ్లీ కోర్ ఇస్తారా ఇప్పిస్తారా పంపిస్తారా అంటూ వస్తున్నారు అని నర్మదను భారత జల మాట్లాడుతుంది వేదవతి.. అది విన్న రామరాజు ఏమైంది బుజ్జమ్మ అలా మాట్లాడుతున్నావు అని అంటాడు..

నర్మదకు రామరాజు క్షమాపణలు..

నర్మదా వేదవతి అన్న మాట విని బాధపడిపోతూ ఉంటుంది.. నువ్వు ఏమి బాధపడకు అమ్మ వల్లికి నిన్న అలా జరగడం వల్లే మీ అత్తయ్య అలా మాట్లాడుతుంది. కోపం పాల మీద నురగ లాంటిది ఇలాగే వస్తుంది అలాగే పోతుంది.. చిన్న విషయాలకి బాధపడి మనసుని పాడు చేసుకోవద్దు అని రామరాజు నర్మదకు చెప్తాడు.. నర్మదా వేదవతి అన్న మాటల్ని తలుచుకొని బాధపడిపోతూ ఉంటుంది. రామరాజు మాట విని తన మనసులో బాధ ఉన్నా సరే పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తుంది.. నర్మద పై వేదవతి అరవడం చూసినా శ్రీవల్లి సంతోషంగా డాన్స్ చేస్తుంది. ఇన్ని రోజులు ముద్దుల కోడలు అంటూ నెత్తిన పెట్టుకొనింది కదా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ సుకన్యతో చెప్తూ ఆనందంగా ఉంటుంది.

శ్రీవల్లి ఎంట్రీతో వేదవతి ఫైర్..

Advertisement

ఇక శ్రీవల్లి నర్మదని తిట్టడం ఆపేసిన తర్వాత వంటగదిలోకి ఎంట్రీ ఇస్తుంది. నర్మదా అత్తయ్య గారు నాకు అలా అయిందని నిన్ను తిట్టారు తప్ప.. నిన్ను మామూలుగా అయితే తిట్టారు కదా అని కావాలని మాట్లాడుతుంది. అసలు శ్రీవల్లి ఎంట్రీ ఇవ్వడంతోనే వేదవతి ఇంకాస్త సీరియస్ గా బయటికి వెళ్లిపోతుంది. నిన్ను అత్తయ్య గారు తిట్టడం వల్ల నీకు కేవలం బాధ మాత్రమే కలుగుతుంది. నాకు కడుపు పోయిందన్న విషయం నువ్వు గుర్తు పెట్టుకోవాలి అని పదేపదే గుర్తు చేసి ఇంకాస్త కోపాన్ని పెంచేలా చేస్తుంది శ్రీవల్లి.. నర్మద మాత్రం బయటికి చాలా కోపంగా వచ్చేస్తుంది. నా గురించి అత్తయ్య గారు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు నాకు అర్థం కావడం లేదు అని చాలా కోపంగా ఉంటుంది.

ప్రేమ పై నర్మదా సీరియస్..

ప్రేమ ధీరజ్ కి తెలియకుండా ఎలాగైనా సరే ఈ డాన్స్ కాంపిటీషన్ కి వెళ్లి ప్రైజ్ ని 10 లక్షలు సొంతం చేసుకోవాలి అని అనుకుంటుంది. నేను వెళ్తానంటే ధీరజ్ అసలు వద్దు అని అంటాడు. నన్ను ఎక్కడికి వెళ్లదు అని ఆపుతాడు. కానీ ధీరజ్ కి కారు కొనిచ్చి జీవితంలో పైకొచ్చేలా చేయాలని నా తపనంత అని ప్రేమ బాధ పడిపోతూ ఉంటుంది. ధీరజ్ కి ఎలా చెప్పినా కానీ వాడు వినడు. ఎలాగైనా సరే నేను ఆ కాంపిటేషన్ కి వెళ్లి వాడికి కారు కొనివ్వాలి అని ఫిక్స్ అవుతుంది ప్రేమ. ఇక తర్వాత నర్మదా అక్క అయితే ధీరజ్ ని ఒప్పిస్తుంది అని అక్కడికి వెళ్ళగానే నర్మదా అగ్గి మీద వేసిన నిప్పులాగా ఎగిరి పడుతుంది.. మీ అత్తయ్య చేసిన పనికి నాకు చాలా కోపంగా ఉంది ప్రేమ అంటూ చెప్పడంతో ప్రేమ షాక్ అవుతుంది.. నువ్వు అలా కోపంగా ఉండదక్కా అత్తయ్య కోపం నీకు తెలిసిందే కదా అని ప్రేమ చెప్పిన సరే నర్మదా వినదు. ఇక తర్వాత ప్రేమ కాంపిటీషన్ గురించి చెప్తే ధీరజ్ వద్దన్నాడు కదా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇది చూస్తే ఖచ్చితంగా నిన్ను చంపేస్తారు అని నర్మద చెప్తుంది..

ధీరజ్ ను మోసం చేసిన ప్రేమ..

Advertisement

వల్లి నర్మదని తిట్టడంతో చాలా సంతోషంగా ఉందని తన తల్లితో పంచుకుంటుంది. కానీ భాగ్యం మాత్రం ఆ నర్మదని ఎక్కువ రోజులు మీ అత్తయ్య తిట్టలేదు ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు అని అంటుంది. ఇక తర్వాత ప్రేమ తన ఫ్రెండ్ ని ఇంటికి రమ్మని చెప్పి పెద్ద డ్రామా ని మొదలు పెడుతుంది.. ఎలాగైనా సరే ఇంట్లో నుంచి బయటపడి ఆ కాంపిటీషన్ కి వెళ్ళాలి అని ప్రేమ తన ఫ్రెండ్ తో నాటకం ఆడిస్తుంది.. ఆ మాట విన్న ఇంట్లోని వాళ్ళందరూ కూడా అది నిజమే అని నమ్ముతారు.. ఇక ప్రేమని హాస్పిటల్ కె కదా వెళ్ళమని చెప్తారు.. ప్రేమ ఎలాగోలాగా ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. శ్రీయాకు నొప్పులు..చివరిలో ట్విస్ట్ అదిరింది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×