E-Paper
Advertisement

హోమ్‌ స్టేలో ఏం జరిగింది? ఫిజియో థెరపిస్ట్ అనుమానాస్పద మృతి, ప్రియుడు మాటేంటి?

హోమ్‌ స్టేలో ఏం జరిగింది? ఫిజియో థెరపిస్ట్ అనుమానాస్పద మృతి, ప్రియుడు మాటేంటి?
Advertisement

Bengaluru: వారిద్దరి ప్రేమించుకున్నారు.. రేపో మాపో ఒకటి కావాలని డిసైడ్ అయ్యారు. అంతలోనే ఏం జరిగిందో తెలీదు. ప్రియురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పక్కనే ప్రియుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. సంచలనం రేపిన ఈ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. అసలేం జరిగింది?

కర్ణాటకలో దారుణం.. హోమ్ స్టేలో ఫిజియో థెరపిస్ట్ అనుమానాస్పద మృతి

Advertisement

కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో యువ ఫిజియోథెరపిస్ట్ సురభి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. మృతురాలు బెంగళూరుకు చెందిన సాయి సురభి. ఆమె వయస్సు దాదాపు 25 ఏళ్లు. ముద్దేనహళ్లిలోని ఓ ఆసుపత్రిలో ఫిజియో థెరపిస్ట్‌గా పని చేస్తోంది.

సురభి కేరళాకు చెందిన సంజీత్ అలీ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అలీ, బెంగళూరులో క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రేపో మాపో వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు. మతాంతర ప్రేమ కావడంతో యువతి ఫ్యామిలీ తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. మరి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు.

Advertisement

ప్రియురాలి మృత దేహం పక్కనే అపస్మారక స్థితిలో ప్రియుడు

సోమవారం ఉదయం అనుమానాస్పద స్థితిలో సురభి మృతి చెందింది. పక్కనే ఆమె ప్రియుడు సంజీత్ అలీ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. సోమవారం తలుపులు తీయకపోవడంతో హోమ్‌స్టే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులను పగలగొట్టి ప్రవేశించారు. అప్పటికే యువతి మృతి చెందింది. ప్రియుడు అలీ అపస్మారక స్థితిలో ఉండడంతో పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

హోమ్ స్టేలో ఒక తాడు, కొన్ని మాత్రలు, వాంతులకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు పోలీసులు. సురభి శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చిక్‌బళ్లాపూర్ పోలీసులు తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు. లవ్ జిహాద్ హత్యేనని, తన కూతుర్ని పక్కా ప్రణాళికతో సంజీత్ అలీ హత్య చేశాడని మృతురాలి తల్లి ఫిర్యాదు చేశారు.

ALSO READ: పల్నాడు జిల్లాలో దొంగల బీభత్సం.. 56 తులాల బంగారం చోరీ!

అలీతో రిలేషన్ షిప్ కొనసాగుతున్న సమయంలో తమ కూతురికి మద్యం, డ్రగ్స్‌ని అలీ అలవాటు చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సురభిపై దాడి చేసి చంపేశాడని అంటున్నారు.  మరోవైపు సురభి కుటుంబం కూతుర్ని మాదక ద్రవ్యాలకు దూరంగా పెట్టేందుకు మైసూరులోని ఓ పునరావాస కేంద్రంలో చేర్పించారు. ఆమె ఆరు నెలల పాటు మద్యం, మాదకద్రవ్యాల వ్యసనానికి చికిత్స పొందింది.

పునరావాసం పూర్తి తర్వాత బెంగళూరులోని తన తల్లితో కలిసి ఉండటానికి వచ్చింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అలీ స్పృహలోకి వస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. యువతి పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదిక కోసం చూస్తున్నారు అధికారులు.

Related News

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన స్లీపర్ బస్సు.. 8 మంది మృతి!

Gold Seized: బంగారం అక్రమ రవాణా.. 37 కేజీల గోల్డ్ సీజ్, తెర వెనుక ఇంటర్నేషనల్ ముఠా

ORRపై అర్ధరాత్రి కలకలం.. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌పై పోలీసుల కాల్పులు!

పల్నాడులో ఘోరం.. ఆగివున్న లారీని ఢీకొన్న మరో లారీ.. నలుగురు సజీవ దహనం!

Farm Pond: మేకను కాపాడబోయి.. నీటిలో పడి మహిళ మృతి!

పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్.. రూ. 2.6 కోట్ల విలువైన గాంజా స్వాధీనం

Murder Case: ప్రియుడితో కలిసి భార్య దారుణం.. నిద్రిస్తున్న భర్తపై రుబ్బురోలు రాయితో దాడి..!

గన్నవరం బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు!

Big Stories

Advertisement
×