E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లిని ఆడుకున్న తోడికోడళ్లు.. నోరుజారిన సుకన్య.. ప్రేమ ఫుల్ హ్యాపీ..

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లిని ఆడుకున్న తోడికోడళ్లు.. నోరుజారిన సుకన్య.. ప్రేమ ఫుల్ హ్యాపీ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode june 22nd: వల్లి చేతిలో చిప్స్ మరో చేతిలో కూల్ డ్రింక్ బాటిల్ పట్టుకోవడం చూసిన సుకన్య.. ఏంటి వల్లి ఎక్కడికైనా సినిమాకు వెళ్తున్నావా? ఆ చేతిలో చిప్స్ ఏంటి ఈ చేతిలో కూల్ డ్రింక్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావ్ అసలు నువ్వు అని అడుగుతుంది. తినబోతూ రుచి గురించి అడగడం ఎందుకు? నీకే తెలుస్తుంది పదా అనేసి మళ్లీ సుకన్యను కూడా తీసుకోమంటుంది. ఇక ప్రేమ నర్మదలు బల్లక్క పారా నువ్వు రారా అంటే పాటతో స్వాగతం చెప్తారు. చేతిలో చిప్స్ కూల్ డ్రింక్స్ మామూలుగా లేదక్కా నేను సెటప్ అని వల్లిని చూస్తున్నా వాళ్ళు మాట్లాడుతారు. నాకు చుక్కలు చూపిస్తారని అర్థం అయిపోయింది. మళ్లీ టైం వేస్ట్ ఎందుకని ముందే తెచ్చుకున్నాను అని మళ్లీ అనగానే సుకన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది.

అబ్బా.. వల్లి అడ్డంగా ఇరుక్కుందే..

నేను కడుపుతో ఉన్నాను కదా నాకు పెద్దగా పరిగెత్తేవి ఎగిరేవి కాకుండా.. చిన్నగా కూర్చుని చెమ్మచెక్క అలాంటివి అష్టాచమ్మా లాంటివి ఇస్తే బాగుంటుంది అని వల్లి అడుగుతుంది.. నువ్వు అంతగా ముచ్చట పడిపోతుంటే ఎందుకు కాదంటాం అక్క అలానే ఇష్టం లే అని నర్మదా అనగానే వల్లి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే ఈసారి మొదటిసారి లాగా కాకుండా కళ్ళకు గంతులు కట్టుకొని గేమ్ ఆడదాం అని చెప్తారు. ఓసి కళ్ళు గంతలు కట్టుకోవడం అదెంత పని అలానే చేసేద్దాం అని వల్లి అంటుంది.. ఇక నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వల్లికి చుక్కలు చూపిస్తారు.. మధ్యలో సుకన్యను కూడా జత చేసి ఇద్దరు ఆడుకోవడంతో సుకన్య నోరు జారేస్తుంది.. మొత్తానికి తోడికోడలతో వల్లికి బడిత పూజ జరుగుతుంది..

వల్లిని ఇరికించిన సుక్కు..

Advertisement

అయితే ఈ ఆటలో ఎక్కువగా సుకన్యకు దెబ్బలు పడడంతో సుకన్య ఒకసారిగా నోరు విప్పుతుంది.. ఎందుకు నన్నే కొడుతున్నారు వల్లిని ఎందుకు కొట్టలేదు అని అడుగుతుంది.. కానీ ప్రేమ బల్లి అక్క కడుపుతో ఉంది కదా అందుకే తనకి ఎక్కువగా పడట్లేదు. అక్కకి కేర్ గా నువ్వు వచ్చావు కదా నీకే ఎక్కువగా పడతాయని వాళ్ళు అనడంతో.. సుకన్య ఒక్కసారిగా తను కడుపుతో లేదు ఏమీ లేదు అని గట్టిగా అరుస్తుంది.. ఏంటి మళ్లీ అక్క కడుపుతో లేదా ఏం మాట్లాడుతున్నారు అని ప్రేమ నర్మద ఇద్దరు షాక్ అవుతారు.. కడుపుతో లేదా అంటే ఇప్పుడు కడుపు ఎక్కువగా లేదు కదా దాని గురించి సుకన్య అంటుంది అని వల్లి ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. కానీ ప్రేమ నర్మదలకు మాత్రం వల్లి మీద డౌట్ వస్తుంది..

అయ్యో.. తిరుపతికి బొమ్మ కనిపించింది..

వాళ్ళ దెబ్బలని తట్టుకోలేక సుకన్య బయటకి పారిపోతూ ఉంటుంది.. ఈ క్రమంలో దోమల కోసం పొగ వేస్తున్న తిరుపతి దగ్గర ఆగిపోతుంది. ప్రేమ ఒక్కసారిగా పిలవడంతో సుకన్య భయపడిపోయి.. ఇద్దరూ గుద్దేసుకుంటారు ఈ క్రమంలో చేతిలో ఉన్న నిప్పుల కుంపటి కింద పడిపోతుంది.. ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది అంటే నాకు మాత్రం ఇలా కాల్చుకునేలా పరిస్థితి ఎదురయింది అని తిరుపతి బాధపడిపోతూ ఉంటాడు. అయినా కూడా సుకన్యని ఎలాగైనా సరే తన లైన్లో పెట్టుకోవాలి అని తిరుపతి అనుకుంటాడు. తిరుపతి సుకన్య డైలాగులు ఎపిసోడ్కి కాస్త హైలైట్ గా నిలుస్తాయి.. వీళ్ళిద్దరిని చూసినా ఎవరైనా సరే కాస్త నవ్వేసుకుంటారు.

ప్రేమ సెలెక్ట్ అయ్యిందిరో..

Advertisement

ప్రేమకు డాన్స్ స్కూల్ నుంచి కాల్ రావడంతో ప్రేమ మొదట టెన్షన్ పడినా కూడా తను సెలెక్ట్ అయింది అని అతను చెప్పగానే చాలా సంతోష పడిపోతుంది.. ఏంటి నేను సెలెక్ట్ అయ్యాను నిజంగానే ఈరోజు నాకు చాలా మంచి రోజు అని ప్రేమ గాల్లో తేలిపోతూ ఉంటుంది.. ప్రేమని అలా చూసినా ధీరజ్ ఏమైంది అని అడుగుతాడు. నేను నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అని చెప్పాను కదా అందుకే ఈ ఆనందం అని అంటుంది.. నువ్వు ఇంత ఆనందంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదే ఏమైంది అని ధీరజ్ అడుగుతాడు.. నేను నీకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అని ప్రేమ చాలా సంతోషంగా ఉంటుంది.. ఇక వల్లి డెలివరీ బాయ్ తో ముచ్చట్లు పెట్టుకోవడం కాస్త హైలెట్ గా మారుతుంది. ఏది ఏమైనా కూడా డెలివరీ బాయ్ వల్లిని కూడా ఒక ఆట ఆడుకుంటాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ అతని దగ్గర ఇరుక్కుంటుందా? లేదా ధీరజ్ తనని కాపాడుతాడా అన్నది చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. అయ్యో.. అడ్డంగా దొరికిందిగా.. కమల్ ఝలక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×