E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode June 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు వీడియో ప్లే చేసిన ఐశ్వర్య 

Brahmamudi Serial Today Episode June 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు వీడియో ప్లే చేసిన ఐశ్వర్య 
Advertisement

Brahmamudi serial today Episode: మదన్‌ ఐస్‌క్రీమ్‌ తింటుంటే.. స్వాతి వెళ్లి లాక్కుని తినబోతుంది. మదన్‌ తన ఐస్‌క్రీమ్‌ తనకు ఇవ్వమని వెంటపడుతుంటాడు. వాళ్లిద్దరినీ అలా చూసి భ్రమరాంబ, శేషు హ్యాపీగా ఫీలవుతారు. కానీ రేఖ వాళ్ల పెళ్లికి ఒప్పుకోదు కదా అనుకుంటూ వెళ్లిపోతారు.

మరోవైపు ఐశ్వర్య తన దగ్గర ఉన్న పెన్‌డ్రైవ్‌ తీసుకెళ్లి పార్టీలో ప్లే చేయమని చెప్తుంది. ఇందు, రాజు వైపు చూసి ఇంకొద్ది సేపట్లో మీ బండారం మొత్తం బయటపడుతుంది అనుకుంటుంది. అప్పుడే వీడియో రాజ తమకు పెళ్లే జరగలేదని.. తమ పెళ్లి అబద్దం అని లక్కీతో చెప్పడం అందరూ వీడియో చూస్తారు. రాజు, ఇందు, అపర్ణ, సుభాష్‌, రేఖ, భ్రమరాంబ అందరూ షాక్‌ అవుతారు. శేషు కోపంగా ఏయ్‌ ముందు ఆ వీడియో ఆపు అంటూ అల్లుడు ఏంటి మీ పెళ్లి అవ్వలేదా..? అని అడగ్గానే.. భ్రమరాంబ కూడా కోపంగా నేను ఎక్కడా చూడలేదు.. ఏంటి మీ పెళ్లి అబద్దమా..? అంటుంది. అపర్ణ కూడా ఇందు ఏంటమ్మా ఇది మీ పెళ్లి అబద్దమా..? అని అడగ్గానే.. సుభాష్‌ కూడా  చెప్పమ్మా అసలు ఏంటమ్మా ఇదంతా.. అని అడగ్గానే.. స్వాతి కూడా ఈ వీడియో అంతా అబద్దం అక్క ఎప్పుడూ అబద్దం చెప్పదు.. అక్కా చెప్పక్క ఇదంతా అబద్దం అని అంటుంటే..

Advertisement

రేఖ కోపంగా స్వాతి నువ్వాగు అసలేం జరుగుతుంది ఇక్కడ మమ్మల్ని మోసం చేశారా..? మీకు పెళ్లి కాలేదా..? తను నీకు అద్దె మొగుడా..? చెప్పు.. అని రేఖ ప్రశ్నించగానే.. ఐశ్వర్య వచ్చి బాగుంది చాలా బాగుంది. మీకు ఇంకా అర్థం కాలేదా..? దొంగ దగ్గరికి వెళ్లి నువ్వు దొంగవి అంటే ఒప్పుకుంటాడా..? ఏంటి..? ఇందుకు రాజుకు పెళ్లి కాలేదు అన్నది నిజం.. తను అద్దె మొగుడిగా నటిస్తున్నాడని అర్థం. నేను నీకు ముందే చెప్పాను.. మీరు నన్ను నమ్మలేదు. అందుకే ఇలా వీడియో తీసి అందరి ముందు పెట్టేశాను.. ఏంటి రాజు నీ ఫ్రెండ్‌ ఓ నాలుగు పెగ్గులు పోయగానే.. మొత్తం కక్కేశావు కదా..? అనగానే.. రాజు ఇలా దొరికిపోయానేంట్రా బాబు ఇప్పుడు ఏం చేసినా వర్కవుట్‌ అవ్వదు.. అని మనసులో అనుకుంటాడు.. ఐశ్వర్య మాత్రం మీకు పెళ్లి అయిందనేందుకు సాక్ష్యం ఏంటి..? అని అడుగుతుంటే..

సాక్ష్యం ఉంది అంటూ నందు ఒక పేపర్‌ తీసుకుని వస్తుంది. వీళ్లిద్దరికీ పెళ్లి అయిందని నా దగ్గర సాక్ష్యం ఉంది అని చెప్పగానే.. ఐశ్వర్య ఏంటది అని అడగ్గానే.. మ్యారేజ్‌ సర్టిఫికెట్‌.. పోలీసుల సమక్షంలోనే వీళ్ల పెళ్లి అయింది. అందుకు సంబంధించిన మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అంటూ తన చేతిలో ఉన్న పేపర్స్‌ రేఖకు ఇస్తుంది. అవి చూస్తుంటారు.. రేఖ, ఐశ్వర్య. ఐశ్వర్య అనుమానంగా ఇదంతా కట్టుకథ ఇవన్నీ ఫేక్‌ సర్టిఫికెట్స్‌ అని చెప్పగానే.. ఇందు వెంటనే ఈ వీడియోనే ఫేక్‌ ఇదంతా ఏఐ టెక్నాలజీ అంటూ ఇద్దరూ చెప్పగానే.. ఐశ్వర్య షాక్‌ అవుతుంది.

Advertisement

రాజు తన ఫోన్‌లో ఐశ్వర్య ఫోటో తీసి ఏఐలో ఐశ్వర్య, రేఖను తిట్టినట్టు వీడియో క్రియేట్‌ చేసి చూపిస్తాడు. ఆ వీడియో చూసిన రేఖ కోపంగా ఐశ్వర్యను తిడుతుంది. పార్టీ అయిపోయింది అందరూ వెళ్లిపోవచ్చు అంటూ చెప్పగానే.. అందరూ వెళ్లిపోతారు. ఐశ్వర్య కోపంగా ఈ మ్యారేజ్‌ సర్టిఫికేట్‌ ఇదంతా ఎలా క్రియేట్ చేశావు అని అడుగుతుంది ఇందును. ఇందు తనకు నిజం ముందే తెలుసని ఇందు చెప్పగానే.. ఐశ్వర్య షాక్ అవుతుంది. ఇందు కోపంగా ఇదే నీకు లాస్ట్‌ వార్నింగ్‌ నా విషయంలో ఇన్వాల్వ్‌ అయితే సహించను అంటూ వెళ్లిపోతుంది.

తర్వాత ఇందు, నందుకు థాంక్స్‌ చెప్తుంది. నువ్వు టైంకు రాకుంటే పరిస్తితి ఇంకోలా ఉండేది. ఆ రాజు గాడు చేసిన దానికి ఇదంతా జరిగింది. అంటూ చెప్తుంటే.. అదంతా తర్వాత నాన్నమ్మకు కూడా డౌటు వచ్చి ఉంటుంది. ఆమెకు ఏదో ఒకటి చెప్పు అంటూ వెళ్లిపోతుంది నందు. తర్వాత ఇందు కోపంగా రూంలోకి వచ్చిన రాజును తిడుతుంది. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×