E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: 20 లక్షలు అడిగిన రామరాజు.. ప్రేమకు ధీరజ్ సపోర్ట్.. సాగర్ పై నర్మదకు అనుమానం..

Illu Illalu Pillalu Today Episode: 20 లక్షలు అడిగిన రామరాజు.. ప్రేమకు ధీరజ్ సపోర్ట్.. సాగర్ పై నర్మదకు అనుమానం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రాణాలతో బయటపడి ఇంటికి వచ్చిన కన్నతండ్రిని చూస్తూ అమూల్య అక్కడే ఉండిపోతుంది.. నేను తప్పు చేశాను నాన్న నా వల్లే మీకు ఈ పరిస్థితి వచ్చింది నన్ను క్షమించండి అని తన మనసులో అనుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. అమూల్య అక్కడుండటం చూసిన విశ్వం ఇక్కడ ఏం చేస్తున్నావే అని కొడతాడు.. ఇక్కడ ఏం పని నీకు పదా లోపలికి అని అంటాడు. అయితే చందు ధీరజ్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే వేదవతి ఆపుతుంది. ఆ తర్వాత తిరుపతి విశ్వంకి వార్నింగ్ ఇచ్చి వస్తాడు. నా పెళ్ళాం నా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటాను తిట్టుకుంటాను అడగడానికి నువ్వు ఎవడు అని విశ్వం అంటాడు. వేదవతి తిరుపతిని రమ్మని చెప్తుంది. ప్రేమకు కొరియర్ వచ్చిందని పిలవగానే ప్రేమ వచ్చి ఆ కొరియర్ ని తీసుకుంటుంది.

ఎస్ఐ జాబ్ కి ఎగ్జామ్ కి హాల్ టికెట్ వచ్చిందని సంతోషంగా ఫీల్ అవుతుంది.. అయితే ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉండగా నేను ఎగ్జామ్ ఎలా రాయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. ప్రస్తుతం మావయ్య గారి పరిస్థితి బాగోలేదు కదా అది చూసుకోవాలి. ఆ తర్వాతే ఎగ్జామ్ గురించి ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శ్రీవల్లి అక్కడికి వచ్చి ఏంటి ప్రేమ దాస్తున్నావు అని అడుగుతుంది. ఏమీ లేదు ఆయన నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అని ప్రేమ అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. రామరాజు అమ్మ నర్మదా సాగర్ ఎక్కడ కనిపించలేదు అని అడుగుతాడు.. ఏదో పని ఉందని బయటికి వెళ్లాడు మామయ్య వచ్చేస్తాడు అని నర్మదా అంటుంది.. తనకు జాబ్ వచ్చిన విషయాన్ని చెప్పాలని సాగర్ నర్మదతో చెప్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతుందని అనుకుంటాడు.. కానీ రామరాజు ఎక్కడికి వెళ్లావు అని అడగడంతో ఆ విషయం గురించి చెప్తే తిడతాడు అని భయపడతాడు.. రైస్ మిల్లులో చాలా పనులు ఉన్నాయి అందుకే బయటకు వెళ్లాను అని అంటాడు.. రైస్ మిల్లు పనిమీద వెళ్లావా నేను ఇంకా ఎక్కడికో వెళ్ళావని కంగారు పడ్డాను అని రామరాజు అంటాడు.. అయితే ఏంటి నాన్న ఇందాకటి నుంచి నన్ను వెతుకుతూ పిలుస్తున్నావు ఏదైనా కావాలా అని సాగర్ అడుగుతాడు.

ఆ వనజ గారు ఇచ్చిన 20 లక్షలు మనం ఇచ్చేయాలి కదరా నువ్వు బ్యాంకులోనే వేసావా అని అడుగుతాడు. ఆ 20 లక్షలు వాళ్ళు ఇప్పుడు అడగలేదు కదా నాన్న మనం ఎందుకు ఇప్పుడు ఇవ్వాలి అని సాగర్ అడుగుతాడు. పెళ్లి ఆగిపోయింది కదరా మనము మన బాధ్యత ప్రకారం ఇవ్వాలి కదా అని రామరాజు అంటాడు. సరేగాని నువ్వు 20 లక్షలు బ్యాంకులో వేసావు కదా నేను తీసుకు రమ్మన్నప్పుడు తీసుకురా వాళ్లకి చేద్దామని అంటాడు.. గదిలోకి వచ్చిన ప్రేమ తన చేతిలో ఉన్న లెటర్ ని ఎక్కడ దాచి పెట్టాలని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది చూసిన ధీరజ్ ఏంటి అప్పటినుంచి ఏదో దాచి పెట్టాలని చూస్తున్నావు ఏం చూస్తున్నావ్ చేతిలో ఏదో ఉంది కదా ఏంటి అది అని తీసుకుంటాడు..

Advertisement

అయితే ఆ లెటర్ ని తీసుకున్న ఎస్ఐ ఎగ్జామ్ కి హాల్ టికెట్ కదా మరి సంతోషించాల్సిన విషయమే కదా.. నువ్వెందుకు ఇలా దాచి పెట్టాలి అనుకుంటున్నావు అని అడుగుతాడు. ఇంట్లో ఉన్న పరిస్థితులను చూస్తుంటే భయంగా ఉంది రా ఇప్పుడు ఎగ్జామ్ గురించి చెప్తే ఇంట్లో వాళ్ళు నన్ను ఏమనుకుంటారో ఎలా అనుకుంటారు అని కంగారు పడిపోతూ ఉంటుంది ప్రేమ. ఇక నర్మదా సాగర్ దగ్గరికి వెళ్తుంది సాగర్ నర్మదకు జాబ్ వచ్చిన విషయాన్ని చెప్తాడు.. నర్మదా జాబ్ వచ్చిందని చాలా సంతోషంగా ఉంటుంది. అని ఇంట్లో నాన్నకి ఎలా చెప్పాలి అర్థం కావడం లేదు అని సాగర్ కంగారు పడిపోతూ ఉంటాడు..

అర్ధరాత్రి రామరాజు అమూల్యని గుర్తుచేసుకొని బయట అమూల్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వేదవతి అమూల్య అంటూ ఉలిక్కిపడి లేస్తుంది. పక్కన చూస్తే రామరాజు లేకపోవడంతో ఈరా ఎక్కడికి వెళ్ళాడు అని వెతుక్కుంటూ బయటకు వస్తుంది. రామరాజు అమూల్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అది చూసిన వేదవతి ఏంటి ఇలా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. అయితే అమూల్య తిందో లేదో నాకు చాలా కంగారుగా ఉంది అని రామరాజు అంటే, మీ మీద ఏ మాత్రం ప్రేమ లేకుండానే తను ఇష్టపడిన వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అది తినే పడుకుంటుంది అని వేదవతి అంటుంది.. మన కూతురు ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు కానీ తను సంతోషంగా ఉంటే చాలు అని రామరాజు వేదవతి అనుకుంటారు…

Also Read :ఆస్తి కోసం శ్రీయ రచ్చ.. తండ్రికోసం కమల్ కన్నీళ్లు.. రాజేంద్రను లేపేసేందుకు పల్లవి ప్లాన్..

ఆ తర్వాత నర్మదా ప్రేమ ఇద్దరు కూడా ముగ్గు వేయడానికి బయటకి వస్తారు.. అయితే నర్మదా ముందుగా రావడం చూసి ప్రేమ ఇద్దరం కలిసి వెళ్తామని అంటుంది. నీకు ఒక న్యూస్ చెప్పాలి ప్రేమా అని నర్మదా అంటుంది.. అలాగే ప్రేమ కూడా నీకు ఒక న్యూస్ చెప్పాలి అక్క అని అంటుంది. ఏంటి ఆ న్యూస్ అని అడగ్గా నాకు ఎస్సై ఎగ్జామ్ కి హాల్ టికెట్ వచ్చింది అని చెప్పగానే నర్మదా సంతోషిస్తుంది. ఇక నర్మదా సాగర్ కి జాబ్ వచ్చింది అని చెప్పగానే ప్రేమ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.. ఇతర సంతోషాన్ని చూసిన అమూల్య సంతోషంగా ఉండడం నర్మదా ప్రేమలు చూస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×