E-Paper
Advertisement

Mystery thriller OTT : స్టూడెంట్ ను వేధించే టీచర్… తల్లి ఇచ్చే ట్విస్ట్ కు ఫ్యూజులు అవుట్

Mystery thriller OTT : స్టూడెంట్ ను వేధించే టీచర్… తల్లి ఇచ్చే ట్విస్ట్ కు ఫ్యూజులు అవుట్
Advertisement

Mystery thriller OTT :  ఓటీటీలో ఒక క్రేజీ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాను చూడాలనుకుంటే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాపై ఓ లుక్ వేయండి. ఇది ఒకే సంఘటనను, ముగ్గురు వేర్వేరు వ్యక్తుల కోణంలో చూపించే ఒక అద్భుతమైన స్టోరీ. ఈ సినిమా స్క్రీన్‌ప్లే కి ప్రశంసలు కూడా వచ్చాయి. ఆడియన్స్ ను ఆలోచనలో పడేసే సినిమా ఇది. దీని పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఎందులో స్ట్రీమింగ్ అంటే

2023లో వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ జపనీస్ చిత్రం పేరు ‘మాన్‌స్టర్’ (Monster). (జపనీస్ టైటిల్: Kaibutsu) ఇది హిరోకాజు కొరే ఎడా దర్శకత్వంలో వచ్చిన ఒక అద్భుతమైన సైకలాజికల్ డ్రామా. లెజెండరీ కంపోజర్ ర్యూచి సకమోటో చనిపోయే ముందు అందించిన చివరి సంగీతమిది. ఇది 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘ఉత్తమ స్క్రీన్‌ప్లే’ అవార్డును గెలుచుకుంది. ఈ సినిమా ప్రస్తుతం MUBI, Amazon Prime Video ప్లాట్‌ ఫామ్‌లలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

సింగిల్ మదర్ సావోరి ముగినో తన 5వ తరగతి చదువుతున్న కొడుకు మినాటో తో కలసి ఉంటుంది. మినాటో గత కొంత కాలంగా చాలా వింతలగా ప్రవర్తిస్తుంటాడు. తన జుట్టు కట్ చేసుకోవడం, ఒక్క షూ మాత్రమే వేసుకొని ఇంటికి రావడం, రాత్రి ఇంటికి లేటుగా రావడం వంటివి చేయడంతో అతని తల్లి కంగారుపడుతుంది. ఒక రోజు మినాటో అసలు ఇంటికి రాకుండా పోతాడు. సావోరి వెతికగా, ఒక ట్రైన్ టన్నెల్‌లో కనిపిస్తాడు. గట్టిగా అడిగితే అసలు విషయం చెప్తాడు. మినాటోని టీచర్ మిస్టర్ హోరి తన్నాడని, టార్చర్ చేశాడని చెబుతాడు. సావోరి స్కూల్‌కి వెళ్లి టీచర్ ని గట్టిగా అడుగుతుంది. స్కూల్ అథారిటీస్ దాచిపెట్టడానికి ప్రయత్నిస్తారు. సావోరి టీచర్ హోరిని బాధ్యుడిగా చూస్తుంది.

ఇప్పుడు హోరి తన జీవితం రెక్ అవుతుందని భయపడతాడు. కానీ సినిమా ఇక్కడే ట్విస్ట్ తీసుకుంటుంది. కథను మూడు భిన్నమైన కోణాల నుంచి చూపిస్తారు. మొదట సావోరి (తల్లి) వైపు నుంచి, తర్వాత హోరి (టీచర్), చివరికి మినాటో (బాలుడు) దృష్టిలో కథను చూపించడం జరుగుతుంది. ఇక్కడ అసలు నిజాలు బయటపడతాయి. ఇక్కడ అసలు విలన్ ఎవరు? ఎందువల్ల ఆ అబ్బాయి డిప్రెషన్ లోకి వెళ్ళాడు ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : మతిపోగొట్టే ట్విస్టులు… థియేటర్లలో దుమ్మురేపుతున్న ఈ సూపర్ హిట్ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×