E-Paper
Advertisement

Illu  Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి టెన్షన్.. నర్మదకు నిజం చెప్పిన ప్రేమ.. అమూల్యకు దిమ్మతిరిగే షాక్..

Illu  Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి టెన్షన్.. నర్మదకు నిజం చెప్పిన ప్రేమ.. అమూల్యకు దిమ్మతిరిగే షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. మీ మావయ్య గారికి గుండెపోటు రావడం ఏంటి అని వేదవతి ఉంటుంది. తనకి ఇష్టమైన కూతురు తన గుండెల మీద తన్ని పోయిందని ఇంత బాధ పడతారా ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అరె చిన్నోడా మీ నాన్నని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది రా తట్టుకోలేకపోతున్నాను అని భేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. వేదవతి మాటలతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు. ఈ ఎపిసోడ్ ఈ సీన్ ఎమోషనల్ గా ఉంటుంది. ఆడియన్స్ నీ గుండెలు పిండేసి ఎలా ఉంటుంది. భద్ర విశ్వం ని నువ్వు చేసింది ఏం బాగోలేదు రా.

ఆ రామరాజు కూతురు మన ఇంట్లో పనిమనిషి అయింది అందుకే ఇంత ఆనందంగా ఉంది అని అంటాడు. ధీరజ్ రామారాజును ఆ పరిస్థితిలో చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. మా నాన్నని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది గుండె ఆగిపోయినంత పనిగా ఉంది అని అనుకుంటాడు. అయితే అప్పుడే రామరాజుకి పల్స్ నార్మల్ అవ్వడం చూసి సంతోషపడతాడు.. నాన్నకు మళ్లీ మామూలుగా పల్స్ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది నాన్న నీలా చూడమని అనుకుంటాడు. తిరుపతి వెంటనే అక్క బావ పల్స్ కొట్టుకుంటున్నాయి. మళ్ళీ నార్మల్ అయ్యాడు అని వేదవతిని పిలుచుకుని వస్తాడు.. డాక్టర్ చెప్పింది విని షాక్ అవుతారు.. రామరాజు పరిస్థితి క్రిటికల్ గా ఉంది అని చెప్పడంతో అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. విశ్వం అమూల్యతో శోభనం జరగాలి అని అంటాడు కానీ అమూల్య మాత్రం నువ్వు ఇలాంటి దుర్మార్గుడు అని తెలిసి నీతో ఎవరైనా శోభనం చేసుకుంటారని కత్తితో బెదిరిస్తుంది.. ఆ తర్వాత అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకపోతే రామరాజు పరిస్థితి ఇంకా క్రిటికల్ గా ఉంది అని డాక్టర్ చెప్పడంతో చందు సీరియస్ అవుతాడు.. ఈ పరిస్థితికి కారణం ఎవరో నాకు బాగా తెలుసు ఏం చేయాలి అది చేస్తాను అని చందు ఆవేశంగా అక్కడికి వెళ్తాడు. ప్రేమతో మాట్లాడుతున్న ధీరజ్ ని చూసి ప్రేమ తన గురించి ఎక్కడ బయటపడుతుంది అని భయపడుతూ ఉంటుంది.. ఇక ధీరజ్ వెళ్ళిపోవడం చూసి ప్రేమ షాక్ అవుతుంది.

ఒకవైపు రామరాజుకి బాగలేదని అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. భాగ్యం ఆనందరావు ఇద్దరు కలిసి ఒకవైపు ఎదురుగా కూర్చుని క్యాంటీన్లో తింటూ ఉంటారు.. అక్కడున్న వెయిటర్ తో ఇడ్లీ గురించి మాట్లాడతారు.. వాళ్ళని చూసినా శ్రీవల్లి అక్కడికి వెళుతుంది.. శ్రీవల్లి నాకు ఏమో టెన్షన్ పడిపోతూ చచ్చిపోవాలనిపిస్తుంది మీరు మాత్రం ఇలా పొట్టలు పగిలేలా తింటున్నారా అని అంటుంది.. దొంగ సచ్చినోడు మాట్లాడాలని పిలిచి పెళ్లి చేసుకుని వచ్చారు. ఇప్పుడు ఇవన్నీ నేను ఎలా మర్చిపోవాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాను అని శ్రీవల్లి అంటుంది.. కడుపులో ఎలకలు పరిగెడుతూ ఉంటే ఇలాంటి కోపమే వస్తది.

Advertisement

ప్రశాంతంగా కూర్చొని తిను అప్పుడు కూల్ డ్రింక్ టైం అంట కూల్ గా ఐడియాలు వస్తాయి అని భాగ్యం అంటుంది.. నువ్వు ముందు కూర్చోవే ఇడ్లీ తిందువు కానీ అని భాగ్యం కూర్చోబెట్టి మరి ఇడ్లీ తినిపిస్తారు.. అయితే శ్రీవల్లిని భాగ్యం నర్మద వచ్చిన విషయాన్ని చూస్తారు. చిరుత పులి వచ్చింది అనగానే నా శ్రీవల్లి భయపడుతూ.. టేబుల్ కింద కూర్చుంటుంది.. ఏంటి ఇంట్లో ఇంతమంది బాధపడుతూ టెన్షన్ పడిపోతూ ఉంటే మీరు మాత్రం ఎలా కూల్ గా తినాలని అనుకుంటారు అని అంటుంది. మీ బాబాయ్ గారికి షుగరు. ఆయన టైంకి తినకపోతే అస్సలు ఆగలేడు. అందుకే ఆయన తింటే గాని ఏ పని చేయలేనని అనుకున్నాడు.. అవునా అయితే మీరు తినండి అని నర్మదా అంటుంది..

అయినా శ్రీవల్లి నన్ను చూసి ఎందుకు టేబుల్ కింద దాక్కుంది అని అనుమాన పడుతుంది నర్మదా.. అయితే శ్రీవల్లికి నర్మదా వాటర్ ఇస్తుంది. అది చూసిన భాగ్యం షాక్ అవుతుంది. వెంటనే శ్రీవల్లి బయటకు వచ్చి అమ్మయ్య నా ప్రాణాలు కాపాడేవే అని అనుకుంటుంది.. ఆ చీల రాకాసి వెళ్ళిపోయిందా? అడుగుతుంది.. అది చూసిన నర్మదా నన్ను చూసి టేబుల్ కింద ఎందుకు దాక్కున్నావు అని అడుగుతుంది.. నేనేమో అస్సలు ఆకలికి ఉండలేను నువ్వు మావయ్య గారికి అలా జరిగిన తర్వాత ఎలా తింటున్నావ్ అని అంటావని భయపడి దాక్కున్నాను అని శ్రీవల్లి అంటుంది.. అంతేనా ఇంకేదైనా చేసేవా అని నర్మదా అడుగుతుంది.. అప్పుడే ప్రేమ నర్మదను పిలుస్తుంది. నర్మదకు జరిగిన విషయాన్ని చెప్తుంది.. అలా ఇద్దరు కలిసి నువ్వు ఈ విషయం గురించి ఎవరికీ చెప్పదు మౌనంగా ఉండు ఏం జరుగుతుందో అది జరుగుతుంది అని ప్రేమకు ధైర్యం చెబుతుంది నర్మదా..

Also Read : అవనికి అడ్డంగా దొరికిన పల్లవి.. మర్డర్ చేసినట్లు తేల్చేసిన పోలీసులు.. పల్లవి దొరుకుతుందా..?

అమూల్య దగ్గరకొచ్చిన చందు అమూల్య చంప పగలగొట్టి మా నాన్నకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఇదే అని సీరియస్ అవుతాడు.. మా ఇంట్లో అడుగు పెట్టడానికి నువ్వు ఎవరు రా నీకు భద్రం ఒకవైపు అంటున్న సరే చందు మాత్రం అమూల్యని కొడుతూ తన బాధని చెప్పుకుంటాడు. నాన్నకి హార్ట్ ఎటాక్ వచ్చిందని భద్ర పెద్దమ్మతో చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. కానీ భద్ర మాత్రం అలాంటి వాడికి హార్ట్ ఎటాక్ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఆ తర్వాత రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×