E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి అనుమానం.. సాగర్ పై ఫోకస్ పెట్టిన భాగ్యం.. ప్రేమ ఎస్సై అవుతుందా..?

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి అనుమానం.. సాగర్ పై ఫోకస్ పెట్టిన భాగ్యం.. ప్రేమ ఎస్సై అవుతుందా..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. సాగర్ ఉద్యోగానికి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు. సాగర్ రెడీ అవ్వడం చూసి నర్మదా మురిసిపోతూ ఉంటుంది. నా కోరిక ఇన్నాళ్ళకి ఇలా నెరవేరుతుందని నేను అస్సలు అనుకోలేదు. మీరు చాలా బాగున్నారు ఆఫీసర్ గారు ఇకమీదట నన్ను గుర్తు పెట్టుకుంటారో లేదో అని నర్మదా కావాలని వెటకారంగా మాట్లాడుతుంది.. సాగర్ ని ఆ డ్రెస్ లో చూసి మీరు ఇలా చాలా బాగున్నారు.. కానీ ఇంట్లోని వాళ్ళు మీ గురించి తప్పుగా అనుకుంటున్నారు అదే నాకు చాలా బాధగా ఉంది అని నర్మదా అంటుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు నర్మదా నేను ఎప్పుడూ అలానే ఉండాలా ఇలా ఉండాలని నాకు అర్థం కావడం లేదు టెన్షన్ గా ఉంది అని సాగర్ అంటాడు..

అయితే మీరు ఏమి టెన్షన్లు పడకుండా మీ జాబ్ మీరు చేసుకోండి.. ఇంట్లోని సమస్యలను తీసుకొని వెళ్తే అక్కడ ఇంకాస్త బాధలు పడాల్సి వస్తుంది.. అక్కడ వెళ్లి నువ్వు చేయాల్సిన పనిని ఆలోచిస్తూ ఏదో ఒకటి చేసావ్ అనుకో మొదటికే మోసం వస్తుంది అందుకే జాగ్రత్తగా వెళ్లి నీ పని ఏంటో నువ్వు చూసుకొని నర్మదా అంటుంది. ఇంతకీ మీ దగ్గర డబ్బులు ఉన్నాయా?  ఆటో కి వెళ్లడానికైనా డబ్బులు ఉండాలి కదా అని నర్మదా అడుగుతుంది.. నా దగ్గర ఈడ్చి కొట్టినా చిల్లిగవ్వలేదు అని సాగర్ అంటాడు. అయితే నీకు నేను డబ్బులు ఇస్తాను ఇవి నీ దగ్గర పెట్టుకో అనేసి నర్మదా అంటుంది. అయితే నర్మదా డబ్బులు ఎందుకు ఇస్తున్నావని సాగర్ అడుగుతాడు. నువ్వు కొత్తగా ఆఫీసులో జాయిన్ అయ్యావు కదా.. అంటూ సరదాగా నర్మదా భర్తను కాపాడుకొనే ప్రయత్నాలు చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ప్రోమో విషయానికి వస్తే..మనం ఏదైనా చేసినప్పుడు ఇలాంటివి కామనే. కొన్నిసార్లు దెబ్బలు తగులుతుంటాయి మరికొన్నిసార్లు ఎదురు దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుంటే మనం ఏది చేయలేము. అందుకే మనం అన్ని పట్టించుకోకుండా మనం ఏం చేయాలనుకుంటున్నామో అదే చేయాలి అని శ్రీవల్లితో భాగ్యం చెబుతుంది. ఆ నర్మదపై ఎలాగైనా సరే రివేంజ్ తీర్చుకోవాలి. సాగరు కచ్చితంగా పరీక్ష రాసి పాస్ అవ్వలేదు డబ్బులు కట్టినట్లే ఉంది.. దాని గురించి మనం కూపి లాగే తెలుసుకోవాలి అని భాగ్యం శ్రీవల్లి ప్లాన్ చేస్తారు. సాగర్ కి అన్ని తెలివితేటలు లేవు కాబట్టి లంచం ఇచ్చే పాస్ అయి ఉంటాడు అని నా నమ్మకం అని భాగ్యం అంటుంది..

ఏంటమ్మా నువ్వు చెప్పేది అలా కూడా జాబులు కొనవచ్చా.. అయితే ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి.. ఈ నర్మదా ఎగిరెగిరి పడుతుంది కదా దాన్ని పొగరుయాలంటే ఇదే సరైన మార్గం అసలు సాగర్ కి ఉద్యోగం ఎప్పుడు? ఎలా? ఎక్కడ? వచ్చిందో తెలుసుకోవాలి అని ప్లాన్ చేస్తుంది.. ఇక సాగర్ రెడీ అయ్యి వాళ్ళ నాన్న ఆశీర్వాదం కోసం అని అక్కడికి వస్తాడు. సాగర్ ఆలా కొత్తగా కనిపించడంతో ఇంట్లోని వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. నా కొడుకుని ఇలాంటి బట్టల్లో చూడడం ఇదే మొదటి సారి అని వేదవది చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది.

Advertisement

నర్మద మాట విని నేను మొదటిసారి ఆఫీస్ కి వెళ్తున్నాను నాన్న నన్ను ఆశీర్వదించండి అని రామరాజు కాళ్ళు పట్టుకో పోతాడు సాగర్. కానీ రామరాజు మాత్రం తన కాళ్ళని పక్కకు తీసుకుంటాడు. అది చూసిన సాగర్ బాధపడతాడు. నేనంటేనే ఎవరికి ఇష్టం లేదు. ఇక నాకు జాబ్ వచ్చింది అని సంతోషం కూడా లేకుండా పోయింది. నేను జాబ్ చేయడం ఇక్కడ ఎవరికీ ఇష్టం లేదు వెళ్ళిపోతాను అని సాగర్ అంటాడు. కానీ నర్మద మాత్రం అలా కాదు. సాగర్ మీ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళు మీకు అంతా మంచి జరుగుతుంది కదా అని అంటుంది.

అయితే వేదవతి సాగర్ జాబ్ కి వెళ్తున్న విషయాన్ని రామరాజుకి మరోసారి గుర్తు చేస్తుంది. కానీ నా రామరాజు మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. కానీ వేదవతి మాత్రం ఆగురా నడిపొడ అని ఆపుతుంది. నా కొడుకు పైకి ఎదుగుతున్నాడు అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఏ తల్లి అయిన కూడా తన కొడుకుని మంచి ఉద్యోగం చేస్తూ గొప్పగా బతకాలని కోరుకుంటుంది.. నీకోసం నేను పూజ చేశాను బొట్టు పెట్టుకొని వెళ్ళు అని వేదవతి అంటుంది. ఆ మాట విన్న సాగర్ చాలా సంతోషంగా ఉంటాడు. అయితే ఇక ఇంట్లోని వాళ్ళందరూ కూడా వేదవతి చేసిన పనిపై ప్రశంసలు కురిపిస్తారు.

Also Read :డైరెక్టర్ బాబీ లవ్ స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లా.. సినిమా తియొచ్చు..

రామరాజు మాత్రం సాగర్ పై కోపంగానే ఉంటాడు. ఆ తర్వాత ప్రేమ ఇలాంటి టైంలో మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తే ఎవరికైనా తెలిస్తే.. ఇంట్లో చెప్తే ఏం జరుగుతుందో ఊహించలేము అని ధీరజ్ తో అంటుంది. నువ్వేమీ కంగారు పడకుండా రా వెళ్దాం అనేసి ధీరజ్ ప్రేమను తీసుకొని వెళ్ళిపోతాడు. అటు సాగర్ కూడా తన మొదటి రోజు కాబట్టి ఆఫీస్ కి తొందరగా వెళ్ళిపోతాడు. అమూల్య తన అన్నయ్యకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఎలాంటి ట్విస్ట్ ఎదురవుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×