// // Illu Illalu Pillalu Today Episode: సాగర్ ను చూసి నర్మదా హ్యాపీ.. ప్రేమను ఆడుకున్న ధీరజ్.. నర్మదకు శ్రీవల్లి షాక్.. -->
E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: సాగర్ ను చూసి నర్మదా హ్యాపీ.. ప్రేమను ఆడుకున్న ధీరజ్.. నర్మదకు శ్రీవల్లి షాక్..

Illu Illalu Pillalu Today Episode: సాగర్ ను చూసి నర్మదా హ్యాపీ.. ప్రేమను ఆడుకున్న ధీరజ్.. నర్మదకు శ్రీవల్లి షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode February 14th: నిన్నటి ఎపిసోడ్ లో.. నాకు ఇప్పుడు అర్థమైందిరా మీ మామ నిన్ను అల్లుడుగా ఒప్పుకోవాలంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేయాలని చెప్పాడు. అందుకే నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావా? ఇల్లరికం కూడా వెళ్తావా అని రామరాజు అడుగుతాడు. నేను ఎన్నిసార్లు చెప్పాలి నాన్న మీకు. ఇల్లరికం వెళ్ళను అని.. అటు నర్మద కూడా నేను చెప్పేది వినండి మావయ్య గారు అని ఎంత చెబుతున్నా సరే రామరాజు మాత్రం వినడు.. ఇక వేదవతి నర్మదపై సీరియస్ అవుతుంది.. ఆ తర్వాత రైస్ మిల్లు బాధ్యతలని చందు నేను తీసుకుంటాను అని అంటాడు.. శ్రీవల్లి రైస్ మిల్లుకు ఓనర్ మా ఆయన ఎలాగైనా సరే మనం డబ్బులు కూడా పెట్టుకోవాలి అని ప్లాన్ చేస్తారు. ఇక తర్వాత వాళ్ళు ఎలాగైనా సరే రైస్ మిల్లు ని మన చేతికి వచ్చేలా చేసుకోవాలని అనుకుంటారు. నర్మదా సాగర్ పై సీరియస్ గా ఉంటుంది. ఏంటి నర్మదా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు. నాకు ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది గుండెల్లో నుంచి ఒక భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది అని అంటాడు. మీ నాన్న పరిస్థితి తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావ్ ఏంటి సాగర్ కొంచమైనా నువ్వు ఆలోచిస్తున్నావా అని నర్మదా సీరియస్ అవుతుంది.. ఆయన తర్వాత రైస్ మిల్లు బాధ్యతలు నువ్వే తీసుకోవాలని ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ నువ్వు ఒక్కసారిగా అలా చెప్పే లోపల కుమిలిపోతున్నారు.. నువ్వు ఇలా చెప్పడంతో ఆయన ఇంకాస్త బాధ పడిపోతున్నారు.. ఇక చివరికి వేదవతి కొడుకు గవర్నమెంట్ జాబ్ గురించి అలాగే కోడలు పోలీస్ ఉద్యోగం చేయడానికి ఒప్పుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సాగర్ ఉద్యోగానికి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు. సాగర్ రెడీ అవ్వడం చూసి నర్మదా మురిసిపోతూ ఉంటుంది. నా కోరిక ఇన్నాళ్ళకి ఇలా నెరవేరుతుందని నేను అస్సలు అనుకోలేదు. మీరు చాలా బాగున్నారు ఆఫీసర్ గారు ఇకమీదట నన్ను గుర్తు పెట్టుకుంటారో లేదో అని నర్మదా కావాలని వెటకారంగా మాట్లాడుతుంది.. సాగర్ ని ఆ డ్రెస్ లో చూసి మీరు ఇలా చాలా బాగున్నారు.. కానీ ఇంట్లోని వాళ్ళు మీ గురించి తప్పుగా అనుకుంటున్నారు అదే నాకు చాలా బాధగా ఉంది అని నర్మదా అంటుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు నర్మదా నేను ఎప్పుడూ అలానే ఉండాలా ఇలా ఉండాలని నాకు అర్థం కావడం లేదు టెన్షన్ గా ఉంది అని సాగర్ అంటాడు..

Advertisement

అయితే మీరు ఏమి టెన్షన్లు పడకుండా మీ జాబ్ మీరు చేసుకోండి.. ఇంట్లోని సమస్యలను తీసుకొని వెళ్తే అక్కడ ఇంకాస్త బాధలు పడాల్సి వస్తుంది.. అక్కడ వెళ్లి నువ్వు చేయాల్సిన పనిని ఆలోచిస్తూ ఏదో ఒకటి చేసావ్ అనుకో మొదటికే మోసం వస్తుంది అందుకే జాగ్రత్తగా వెళ్లి నీ పని ఏంటో నువ్వు చూసుకొని నర్మదా అంటుంది. ఇంతకీ మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఆటో కి వెళ్లడానికైనా డబ్బులు ఉండాలి కదా అని నర్మదా అడుగుతుంది.. నా దగ్గర ఈడ్చి కొట్టినా చిల్లిగవ్వలేదు అని సాగర్ అంటాడు. అయితే నీకు నేను డబ్బులు ఇస్తాను ఇవి నీ దగ్గర పెట్టుకో అనేసి నర్మదా అంటుంది. అయితే నర్మదా డబ్బులు ఎందుకు ఇస్తున్నావని సాగర్ అడుగుతాడు. నువ్వు కొత్తగా ఆఫీసులో జాయిన్ అయ్యావు కదా..

అందరూ పార్టీ అని అడుగుతారు నీ దగ్గర డబ్బు లేకపోతే బాగోదు కదా.. అని ఇస్తున్న అని నర్మదా అనగానే నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అంటూ సాగర్ ఎమోషనల్ అవుతాడు.. ఇక ప్రేమ ఎగ్జామ్ కోసమని రెడీ అవుతూ ఉంటుంది.. అయితే ధీరజ్ లోపలికి వచ్చి ఇంకా రెడీ అవ్వడం పూర్తవ లేదా ఎగ్జామ్ కి టైం అవుతుంది వెళ్ళాలి కదా అని అంటాడు. మీ అబ్బాయిలైతే ప్యాంటు చొక్కా వేసుకొని రెడీ అయిపోతారు కానీ అమ్మాయిలు కాలా కాదు కదా అన్ని మ్యాచ్ చేయాలో లేదో తెలుసుకొని రెడీ అవుతారు అని ప్రేమ అంటుంది. అంతా ఓకే గాని ఈ డ్రెస్ అస్సలు బాగోలేదు ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని ఒక డ్రెస్ ఇస్తాడు. ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత ప్రేమని హెయిర్ స్టైల్ ని కూడా మార్చమని చెప్తాడు. దగ్గరుండి ధీరజే ప్రేమకు జడవేసి రెడీ చేస్తాడు. కానీ ప్రేమ మాత్రం రామరాజుకి చెప్పకుండా వెళ్లడం బాగోదు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.

Advertisement

అరె ధీరజ్ మనం ఇలా అబద్దం చెప్పి ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం కదా.. నాకు చాలా భయంగా ఉంది రా.. ఇప్పుడు అవసరం అంటావా అని ప్రేమ అంటుంది. నువ్వు అవన్నీ ఏం పట్టించుకోకు ముందు ఎగ్జామ్ ఎలా రాయాలో దానిమీద మాత్రమే ఫోకస్ చెయ్. ఎగ్జామ్ కి టైం అవుతుంది కదా తొందరగా వెళ్ళాలి అని అంటాడు.. శ్రీవల్లి మాత్రం నర్మదాత అని కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఆ నర్మదపై రివేంజ్ తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.. సాగర్ జాబ్ చేయడం వెనక ఏదో మతలబ్ ఉంది దాన్ని వెంటనే కనిపెట్టాలి అని అనుకుంటారు భాగ్యం శ్రీవల్లి..

రెడీ అయ్యావు కదా సాగర్.. ఇక నేను నీకోసం బాక్స్ తీసుకొని వస్తాను అని నర్మదా వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన శ్రీవల్లి, భాగ్యం, ఆనందరావు ముగ్గురు కలిసి నర్మదని ఎలాగైనా సరే రెచ్చగొట్టాలని అనుకుంటారు.. ఇంట్లో పందికొక్కులు బాగా తిరుగుతున్నాయి వాటికి మందు పెట్టి ఎలాగైనా సరే చంపి పడేయాలి అని నర్మదని చూసిన శ్రీవల్లి అంటుంది. అవును ఆ పంది కుక్కలకు మూతి మీద వాత పెట్టి మరి అసలు నిజాలని బయట పెట్టాలి అని నర్మద కూడా అంటుంది. అయితే చూసావా అమ్మ ఇది నన్ను పందికొక్కు అంటుంది అని శ్రీవల్లి అంటుంది.

Also Read :పల్లవికి మైండ్ బ్లాక్.. పల్లవి దెయ్యం డ్రామా సక్సెస్.. అవనికి పల్లవి పై అనుమానం..

మనం ఏదైనా చేసినప్పుడు ఇలాంటివి కామనే. కొన్నిసార్లు దెబ్బలు తగులుతుంటాయి మరికొన్నిసార్లు ఎదురు దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుంటే మనం ఏది చేయలేము. అందుకే మనం అన్ని పట్టించుకోకుండా మనం ఏం చేయాలనుకుంటున్నామో అదే చేయాలి అని శ్రీవల్లితో భాగ్యం చెబుతుంది. ఆ నర్మదపై ఎలాగైనా సరే రివేంజ్ తీర్చుకోవాలి. సాగరు కచ్చితంగా పరీక్ష రాసి పాస్ అవ్వలేదు డబ్బులు కట్టినట్లే ఉంది.. దాని గురించి మనం కూపి లాగే తెలుసుకోవాలి అని భాగ్యం శ్రీవల్లి ప్లాన్ చేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×