E-Paper
Advertisement

Reels Download: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ డౌన్‌లోడ్ ఎలా చేయాలి? సరైన విధానం ఇదే

Reels Download: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ డౌన్‌లోడ్ ఎలా చేయాలి? సరైన విధానం ఇదే
Advertisement

Reels Download| ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అంటే ఇప్పుడు చాలా పాపులర్. వినోదం, నేర్చుకోవడం, క్రియేటివ్ ఐడియాల కోసం రీల్స్ ఉపయోగిస్తారు. కానీ కొందరు రీల్స్‌ని ఆఫ్‌లైన్‌లో చూడాలనుకుంటారు. ఇంటర్నెట్ స్లోగా ఉన్నప్పుడు ఆఫ్‌లైన్‌లో బఫరింగ్ ఇబ్బంది లేకుండా చూడవచ్చు. ఎడ్యుకేషనల్, మోటివేషనల్ రీల్స్ మళ్లీ మళ్లీ చూడటానికి ఉపయోగపడతాయి. కంటెంట్ క్రియేటర్లు ఇన్‌స్పిరేషన్ కోసం సేవ్ చేస్తారు. స్నేహితులతో షేర్ చేయడానికి కూడా కావాలనుకుంటారు. అందుకే సులభమైన డౌన్‌లోడ్ మార్గాలు అవసరమవుతాయి.

మొదటి మార్గం: థర్డ్-పార్టీ వెబ్‌సైట్లతో రీల్స్ డౌన్‌లోడ్

ఇది చాలా సులభమైన, సురక్షితమైన మార్గం. ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటిలోనూ పనిచేస్తుంది.

  • ఇన్‌స్టాగ్రామ్ యాప్ ఓపెన్ చేయండి.
  • డౌన్‌లోడ్ చేయాలనుకున్న రీల్ ఓపెన్ చేయండి.
  • పైన ఉన్న మూడు డాట్స్ మీద ట్యాప్ చేసి “Copy Link” సెలెక్ట్ చేయండి.
  • మొబైల్ బ్రౌజర్ ఓపెన్ చేసి “Instagram Reel Downloader” అని సెర్చ్ చేయండి.
  • నమ్మకమైన వెబ్‌సైట్ ఓపెన్ చేసి లింక్ పేస్ట్ చేయండి.
  • డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేస్తే రీల్ ఫోన్ గ్యాలరీలో సేవ్ అవుతుంది.
  • ఈ మెథడ్‌లో యాప్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అనవసర డేటా యాక్సెస్ రిస్క్ తక్కువ.

రెండవ మార్గం: మొబైల్ యాప్స్ ద్వారా డౌన్‌లోడ్

Advertisement

ప్లే స్టోర్, యాప్ స్టోర్‌లో కొన్ని యాప్స్ రీల్స్ డౌన్‌లోడ్ చేస్తాయి. కానీ అన్నీ సేఫ్ కావు. చాలా యాప్స్ ఎక్కువ పర్మిషన్లు అడుగుతాయి. పర్సనల్ డేటా రిస్క్ ఉంటుంది. యాప్ రివ్యూస్, రేటింగ్స్ బాగా చూసి ఇన్‌స్టాల్ చేయాలి. ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ డీటెయిల్స్ ఇవ్వకూడద్దు. అవసరమైన పర్మిషన్లు మాత్రమే ఇవ్వాలి. యాప్స్ సౌకర్యవంతమే కానీ ప్రైవసీ రిస్క్ ఎక్కువ.

స్క్రీన్ రికార్డింగ్ చేయడం సరైదేనా?

చాలా ఫోన్లలో బిల్ట్-ఇన్ స్క్రీన్ రికార్డర్ ఉంటుంది. రీల్ ప్లే చేసి రికార్డ్ చేయవచ్చు. థర్డ్-పార్టీ టూల్స్ అవసరం లేదు. కానీ వీడియో క్వాలిటీ కొంచెం తగ్గవచ్చు. ఎడిటింగ్ అవసరం కావచ్చు. త్వరగా పర్సనల్ ఉపయోగానికి బాగుంటుంది.

Advertisement

సురక్షితంగా డౌన్‌లోడ్ చేయడానికి ముఖ్యమైన గైడ్‌లైన్స్
ఎవరి కంటెంట్ అయినా క్రెడిట్ ఇవ్వకుండా రీపోస్ట్ చేయవద్దు.
కమర్షియల్ ఉపయోగం కోసం వినియోగించవద్దు.
క్రియేటర్ల కాపీరైట్‌ని గౌరవించాలి.
ఇన్‌స్టాగ్రామ్ పాలసీలు.. అన్‌ఆథరైజ్డ్ షేరింగ్‌ని అనుమతించదు.
పర్సనల్ లెర్నింగ్, ఆఫ్‌లైన్ వ్యూయింగ్ కోసం మాత్రమే వినియోగించకండి.

Also Read: ఏఐతో భయపడాల్సిన అవసరం లేదు.. ఈ ఉద్యోగాలు పూర్తిగా సురక్షితం

సేఫ్ డౌన్‌లోడ్ కోసం ఈ జాగ్రత్తలు పాటించండి

తెలియని యాప్స్ కంటే వెబ్‌సైట్లనే ఎంచుకోండి.
ఎక్కడా ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ డీటెయిల్స్ ఇవ్వకూడదు.
డౌన్‌లోడర్ పేజీలలో యాడ్స్ క్లిక్ చేయవద్దు. అవి ప్రమాదకరం అయ్యే అవకాశం ఉంది.
యాంటీవైరస్ ఉపయోగించి ఎక్స్‌ట్రా సెక్యూరిటీ తీసుకోండి.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ రోజూ చాలా విలువైన కంటెంట్ ఇస్తాయి. సరైన రీతిలో డౌన్‌లోడ్ చేస్తే చాలా ఉపయోగకరం. ప్రస్తుతం థర్డ్-పార్టీ వెబ్‌సైట్లు సురక్షితమైనవి. కంటెంట్ ఓనర్‌షిప్, ప్లాట్‌ఫామ్ రూల్స్ గౌరవిస్తే సెక్యూరిటీ, లీగల్ సమస్యలు రావు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×