E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లిని ఇరికించేందుకు ప్లాన్..వల్లి కొత్త నాటకం.. పరుగులు పెట్టిన భాగ్యం..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లిని ఇరికించేందుకు ప్లాన్..వల్లి కొత్త నాటకం.. పరుగులు పెట్టిన భాగ్యం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode December 22 nd : నిన్నటి ఎపిసోడ్ లో.. తను గవర్నమెంట్ జాబ్ చేసి అందరిలో గౌరవంగా ఉండాలని సాగర్ అనుకుంటాడు. అయితే ఎగ్జామ్ రాసిన పాస్ అవ్వకపోవడంతో మరోసారి రాసిన పాస్ అవ్వను అని ఫిక్స్ అయిపోతాడు.. ఎలాగైన సరే డబ్బులు సంపాదించి ఆ జాబ్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటాడు.. తన ఫ్రెండ్ మాట విని షేర్స్ లో పెట్టడానికి డబ్బులు ఇస్తాడు.. కానీ ఫ్రెండ్ అని నమ్మినందుకు మోసపోయినట్లు తెలుసుకుంటాడు సాగర్.. వీడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయట్లేదు వీళ్లు నన్ను మోసం చేశాడా డబ్బులు కోసం ఆశపడి నేను మోసపోయానా అని ఆలోచిస్తూ ఉంటాడు సాగర్..

లక్ష రూపాయలు నాన్నకి ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు..అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా సాగర్ ఏమైంది చెప్పు అని అడుగుతుంది. కానీ సాగర్ మాత్రం చెప్పాలని అనుకోడు..  నర్మదా గట్టిగా అరుస్తుంది. ఎందుకు నువ్వు నాకు చెప్పాలనుకోవట్లేదు అని అంటుంది. ఏమైంది అసలు నువ్వు ఎందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నావు అని నర్మదా అడుగుతుంది. సాగర్ చెప్పిన విషయాన్ని విని నర్మదా షాక్ అవుతుంది.. శ్రీవల్లికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సాగర్ విఆర్వో ఎక్సామ్ రాసినట్లు ఇలాగే శ్రీవల్లి పాయసం చేసే అందరికీ తెలిసిన చేసింది కదా మనం కూడా ఆ శ్రీవల్లి ని ఇరికించేందుకు పాయసం చేసి అందరికీ చెబుదాం అని అంటుంది నర్మదా.. ప్రేమ నర్మద ఇద్దరూ కూడా వంటగదిలో మాట్లాడుకోవడం విన్న శ్రీవల్లి గదిలోకి వెళ్లి తలపేసుకొని కంగారు పడుతూ ఉంటుంది.. ఓయమ్మో, ఓరి నాయనో వీళ్లు మంచితనానికి మారుపేరు అనుకున్న కానీ నా మీద ఇలాంటి రివేంజ్ ప్లాన్ చేస్తారని అస్సలు అనుకోలేదు. నన్ను ఇరికించేందుకు ప్లాన్ చేశారు అని భయపడుతుంది. అప్పుడే నర్మదా ప్రేమ ఇద్దరు కూడా పాయసం తీసుకుని వచ్చి మావయ్య గారు అత్తయ్య గారు రండి అని అందరిని పిలుస్తారు. శ్రీవల్లి తలుపు తెరుచుకొని గుంట నక్కలాగా తొంగి చూస్తూ ఉంటుంది..

ఏంటి ఉదయం లేవగానే హడావిడి చేస్తున్నారు అని వేదవతి అడుగుతుంది.. ఈ పాయసము హడావిడి ఏంటి అని రామరాజు కూడా అడుగుతాడు.. ఏం లేదు మామయ్య మీకు ఒక తీపి కబురు చెప్పాలని పాయసం చేసానని నర్మదా అంటుంది. శ్రీవల్లి అక్క ఈరోజు ఇంటర్వ్యూ కి వెళ్తుంది కదా తను సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అందరి నోరు తీపి చేయాలని అనుకుంటున్నాను అని నర్మదా అంటుంది. అవునమ్మా నువ్వు చెప్పింది కూడా నిజమే అని రామరాజు అంటాడు. వీళ్లు నన్ను ఎలాగైనా సరే ఇవాళ ఇరికించేసి మా ఇంటికి పంపించాలని చూస్తున్నారు.. ఇంటర్వ్యూ నుంచి నేను ఎలాగైనా తప్పించుకొని బయటపడాలి అని అనుకుంటుంది.. వంటగదిలోకి వెళ్లి ఉల్లిపాయని కట్ చేసుకుని తెచ్చుకుంటుంది..

Advertisement

చిన్నప్పుడు బడి ఎగ్గొట్టడానికి ఈ ప్లాను బాగా వర్కట్ అయింది. ఇప్పుడు కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది అని ఆ ఉల్లిపాయల్ని చంకలో పెట్టుకొని పడుకుంటుంది.. జ్వరం వచ్చింది అని పడుకుంటుంది. మేము దగ్గరుండి తీసుకొని వస్తాము అని అంటారు నర్మదా ప్రేమ.. వల్లి లోపల వణుకుతూ పడుకుంటుంది. అది చూసిన నర్మదా ప్రేమలు నువ్వు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి కదా అక్క ఏంటి ఇలా పడుకున్నావ్ అని అడుగుతారు. రాత్రికి బాగానే ఉన్నావు కదా ఇప్పుడు జ్వరం ఎలా వచ్చింది అని అంటే దానికి పెద్ద స్టోరీ చెప్తుంది శ్రీవల్లి.

అయితే నీ జ్వరం పోగొట్టి వెంటనే నిన్ను ఇంటర్వ్యూకి పంపించే బాధ్యత మాది అని ప్రేమ నర్మదలు అంటారు. ఇక భాగ్యం ఆనంద్ రావు రౌడీల నుంచి తప్పించుకోవడానికి పారిపోతుంటారు.. ఏంటి విశ్వం గాడు 10 లక్షల కోసం రౌడీలు పంపించి చంపేసేలా ఉన్నాడని ఊరంతా పరుగులు పెట్టేస్తారు. అయితే వాళ్లు ఒకచోట దాక్కొని శ్రీవల్లికి ఫోన్ చేస్తారు.. శ్రీవల్లి మాత్రం ఆ రౌడీలు వచ్చారు అని చెప్పగానే.. అయితే చచ్చిపోండి వాళ్ళ చేతిలోనే నన్ను ఎంఏ ఇంగ్లీష్ అని చెప్పి ఇరికించారు కదా అని అంటుంది.. అయితే ఏవండీ ఆయన గారు మనమే కాదు. అక్కడ మన అమ్మాయి కూడా బాధపడుతుంది ఇబ్బందులు పడుతుంది అని అనుకుంటూ పరిగెడుతూ ఉంటారు..

Also Read : తల్లి కోసం కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్.. ఆస్తుల కోసం శ్రీయ గొడవ.. రాజేంద్ర కిడ్నాప్..

ఇక శ్రీవల్లికి జ్వరం వచ్చిన విషయాన్ని నర్మదా ప్రేమలో ఇంట్లో చెప్తారు.. అయ్యో వల్లీకి జ్వరం వచ్చిందా అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. మీరేం కంగారు పడకండి.. మేము ఆల్రెడీ డాక్టర్ కి ఫోన్ చేసాము. చాలా పెద్ద పేరున్న డాక్టర్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పాము ఆయన త్వరగా నే వచ్చేస్తాడు అని అంటారు.. అప్పుడే ఇంట్లోకి ఒక డాక్టర్ రాగానే ఆ డాక్టర్ తో తిరుపతి కామెడీ చేస్తాడు.. ఆ డాక్టర్ నీ ప్రేమ నర్మదలు వల్లి రూమ్ లోకి తీసుకొని వెళ్తారు.. ఈ డాక్టర్ని తేడాగా ఉన్నారు అని వల్లి అంటుంది. ప్రేమ నర్మదలు ఇద్దరూ శ్రీవల్లిని ఆడేసుకుంటారు. మొత్తానికి నిజం చెప్పేసేసి వల్లి బయటపడుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×