E-Paper
Advertisement

Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం.. మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌కు సిట్ నోటీసులు

Telangana Phone Tapping Case:  ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం.. మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌కు సిట్ నోటీసులు
Advertisement

Telangana Phone Tapping Case: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్-SIT విచారణ చేస్తోంది. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఐఏఎస్, మాజీ ఐపీఎస్ అధికారులకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై చర్చ మొదలైంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం

Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్తగా ఏర్పాటైన సిట్ టీమ్ ఆదివారం భేటీ అయ్యింది. ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించిన సేకరించిన వివరాలపై అధికారులు చర్చించారు. ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో ప్రతి విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు కాగా, ఇంకా లోతుగా దర్యాప్తు చేయాలని డిసైడ్ అయ్యింది.

తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. ముగ్గురు ఐఏఎస్‌లతోపాటు ఐపీఎస్ అధికారులను విచారించింది సిట్. వారిలో ముగ్గురు మాజీ ఐఏఎస్, మాజీ ఐపీఎస్ లను సాక్షులుగా విచారించింది. ఇద్దరు మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను విచారించిందట సిట్. వారి స్టేట్ మెంట్ ని రికార్డు చేసింది. జీఏడీ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్‌ని విచారించింది తెలుస్తోంది.

Advertisement

ఈ క్రమంలో పలువురికి నోటీసులు ఇస్తోంది. మాజీ సీఎం సోమేష్‌కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్‌కు సిట్ నోటీసులు ఇచ్చింది. జూబ్లీహిల్స్‌లోని సిట్ ఆఫీసులో విచారణకు రావాలని నోటీసుల్లో ప్రస్తావించారు. సిట్ ఇచ్చిన నోటీసులపై మాజీ అధికారులు హాజరవుతారా?  షెడ్యూల్ ప్రకారం తాము  నిర్ధేశించుకున్న పనులు ఉన్నాయని తప్పించుకుంటారా?

ఇద్దరు మాజీ అధికారులకు సిట్ నోటీసులు

మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావును SIB ఓఎస్డీగా ఎలా నియమించారు? అనే అంశంపై అప్పటి ప్రభుత్వంలో కీలక వ్యవహరించిన ఈ అధికారులను సిట్ విచారించనుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ప్రభాకర్‌రావు ఎవరెవరి నెంబర్లు ఇచ్చారనే దానిపై లోతుగా వివరాలు సేకరించనుంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుని సిట్ వారం రోజులుగా విచారణ చేస్తోంది. విచారణలో ఆయన ట్యాపింగ్ కు సంబంధించి ఎలాంటి విషయాలు బయటపెట్టలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారంతో తొలుత ఛార్జీషీటు వేయాలని ఆలోచన చేస్తోంది. మరికొందర్ని విచారించిన తర్వాత మరొకటి వేయాలన్నది సిట్ అధికారుల ప్లాన్.

ALSO READ:  మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ

అధికారుల విచారణ తర్వాత రాజకీయ, సినీ ప్రముఖులను విచారించే ఛాన్స్ ఉందని అంటున్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక దశకు చేరింది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాదాపు 600 మందికి పైగా రాజకీయ, న్యాయమూర్తులు, వ్యాపారవేత్తలు, సినీ, జర్నలిస్టుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలు లేకపోలేదు.

గతంలో వారు అధికారుల విచారణకు హాజరయ్యారు. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసుల ముందు కొచ్చారు. ప్రస్తుతం ఆయన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల టీమ్ సుదీర్ఘంగా విచారిస్తోంది కూడా.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×