E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: వేదవతికి షాకిచ్చిన రామరాజు.. ప్రేమ మాటకు నర్మదా ఫీల్.. వల్లి హ్యాపీ..

Illu Illalu Pillalu Today Episodes: వేదవతికి షాకిచ్చిన రామరాజు.. ప్రేమ మాటకు నర్మదా ఫీల్.. వల్లి హ్యాపీ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode August 2nd : వేరే సంబంధం తీసుకుని వచ్చి ప్రేమకు పెళ్లి చేస్తాను అని సేన అనగానే భద్ర సీరియస్ అవుతుంది.. చెంప పగలగొడతాను ఆ మాట అంటే అని అనగానే.. ఏంటక్కా నువ్వు కూడా నా మీదే సీరియస్ అవుతున్నావు నేను చెప్పేది కాస్త వినవా అని సేన అంటాడు. నువ్వేం చెప్పినా నేను ఇప్పుడు వినే పరిస్థితిలో లేను ప్రేమ ఆ ధీరజ్ చేసిన మోసాన్ని తలుచుకునే బాధ పడిపోతూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడతావ్ రా అని భద్రావతి అంటుంది.. ధీరజ్ ఇంత గాయం చేసిన తర్వాత ప్రేమ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియకుండా ఉంటుందా..? మీరేమీ ఆలోచించకండి ప్రేమ ఎలాగైనా సరే తీసుకుంటుంది అని చెప్పగానే ప్రేమ బాధ పడిపోతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.. భద్రావతి ప్లాన్ సక్సెస్ ఎందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. ప్రేమ తీరతులను విడగొట్టడానికి భద్ర చేసిన ప్రయత్నం చాలా వరకు సక్సెస్ అవుతుంది.. ఇక ప్రేమ ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదని భద్ర చాలా సంతోషంగా ఉంటుంది.. ప్రేమ మాత్రం ఒంటరిగా కూర్చుని బాధ పడిపోతూ ఉంటుంది.

రామరాజు కోసం వేదవతి నిరీక్షణ..

నా కొడుకు జీవితం ఇలా అయిపోవడానికి కారణం తన భార్య అని ఆమె మీద రామరాజు చాలా కోపంగా ఉంటాడు.. నువ్వు ప్రతిసారి ఏదో ఒకటి ఇలా చేసి నా మనసులో బాధను మిగిల్చావు అని రామరాజు కూడా వేదవతిని చూస్తూ మనసులో అనుకుంటాడు బాధపడతాడు.. ఇన్నేళ్ల కాపురంలో ఎప్పుడు లేంది ఇలా జరగడంపై అటు రామరాజు వేదవతి మధ్య దూరం పెరగడానికి కారణం ఏంటి అని ఇద్దరికీ ఇద్దరే ప్రశ్నించుకుంటారు.. తన చేత్తో కాఫీ ఇచ్చిన కూడా తాగనని రామరాజు చెప్పడంతో వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నేను చేసిన తప్పే అండి కాకపోతే ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలి అని చేశాను అని చెప్పిన వేదవతికి రామరాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తాడు. నువ్వు ఆడపిల్ల జీవితాన్ని కాపాడాలి అని అనుకున్నావు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ చెరోక్క సైడ్ వెళ్లిపోయారు ఎవరికి లాభం అని రామరాజు ఆమెపై కోప్పడతాడు..

ధీరజ్ నన్ను మోసం చేశాడు..

Advertisement

భద్ర చెప్పిన మాటలు విన్న ప్రేమ ధీరజ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించి తప్పు చేశాను అని ఆలోచిస్తూ ఉంటుంది. నేను చేసిన తప్పు నేను మళ్లీ చేయకూడదు అనుకుని ప్రేమ బాధ పడిపోతూ ఉంటుంది.. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన ధీరజ్ ఇలా నన్ను అంటాడని అస్సలు ఊహించలేదు అని ప్రేమ ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. కానీ భద్ర మాత్రం తన ప్లాను బాగా సక్సెస్ అయింది అని సంతోషంగా ఉంటుంది.. ఏం చేసినా కూడా ప్రేమని ఇంటికి తీసుకొచ్చుకున్నాను నా కోడలు నా దగ్గరే ఉంటుంది అని అనుకుంటుంది.. ప్రేమ మాత్రం ఇటు తన పుట్టింటి వాళ్ళని అటు ధీరజ్ని వదిలిపెట్టలేక ఒంటరిగా తనలో తానే బాధపడిపోతూ ఉంటుంది..

కన్నీళ్లు పెట్టుకున్న భద్ర..

ప్రేమ ఒంటరిగా బాధపడుతూ కనిపించడం చూస్తున్న భద్రావతి తనతో మాట్లాడడానికి వెళుతుంది.. నీకోసం నేను ఎప్పుడూ ఏదీ అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను. నిన్ను నువ్వు ఓదార్చుకొని బయటికి రావాలి అని అడుగుతుంది.. నీకు అమ్మ నాన్న అన్ని అయి నేను పెంచాను కదా నాకు కూడా చెప్పకుండా నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడుగుతుంది.. ఒక్క మాట మాకు చెప్పి ఉంటే అంతా మేము చూసుకునేవాళ్ళం కదా.. ఆ కళ్యాణి చంపేసేవాళ్ళం కదా అని భద్ర అనగానే ప్రేమ ఎమోషనల్ అయిపోతుంది.. ఒకటి చేతిలో మోసపోయాను అని బలవంతంగా మరొక జీవితంలోకి వెళ్లి నిన్ను నువ్వే మోసం చేసుకోవద్దు అని భద్ర క్లాస్ పీకుతుంది..

ప్రేమ మాటకు నర్మదా ఫ్యూజుల్ అవుట్..

Advertisement

ధీరజ్ ప్రేమలను ఎలాగైనా కలపాలి అని నర్మదా అనుకుంటుంది.. కానీ ప్రేమకి ఫోన్ చేసి రమ్మని పిలిస్తే ప్రేమ చాలా ఆవేశంగా మాట్లాడడంతో నర్మదా చాలా ఫీల్ అవుతుంది. ప్రేమ నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పగానే ఆ ధీరజ్ గురించి అయితే అసలు మాట్లాడద్దు అక్క అని ప్రేమ సీరియస్ గా మాట్లాడుతుంది.. ధీరజ్ చేసింది తప్పే కానీ నువ్వు ధీరజ్ని ప్రేమించే వాళ్ళ సంగతి మర్చిపోవద్దు అని నర్మదా ఎంతగా ప్రయత్నించి నచ్చజెప్పి ఇంటికి తీసుకురావాలని అనుకుంటుంది.. కానీ ధీరజ్ మాత్రం నా మనసును విరిచేసాడు అంటూ ప్రేమ మాట్లాడడం విన్నా నర్మదా వీళ్లిద్దరు మీకు జీవితంలో కలవరమో అని అనుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : ‘ పొదరిల్లు ‘ మహా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×