E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ అనుమానమే నిజం.. సేనకు కొత్త టెన్షన్.. భర్తకు  శ్రీవల్లి దూరం..?

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ అనుమానమే నిజం.. సేనకు కొత్త టెన్షన్.. భర్తకు  శ్రీవల్లి దూరం..?
Advertisement

Illu Illalu Pillalu Today Episode April 20th:ధీరజ్ ఇంటికి వెళ్లి ప్రేమకు ఆ న్యూస్ చెప్పాలని అనుకుంటాడు. నీ ప్రేమ ఫెయిల్ అయిందని చెప్తే బాధపడుతుంది అని చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. కానీ ప్రేమకు ఆ విషయం తెలిసి ఉంటుంది. దాంతో ప్రేమ ధీరజ్ కి ఎలా చెప్పాలని బాధ పడిపోతూ ఉంటుంది. మొత్తానికి ప్రేమకు ఈ విషయం తెలుసు అన్న విషయాన్ని ధీరజ్ తెలుసుకుంటాడు. వీరిద్దరి కన్వర్జేషన్ కాస్త కామెడీగా ఇంకాస్త రొమాంటిక్గా ఉండడంతో హైలెట్ అవుతుంది..

రామరాజుకు అడ్డంగా దొరిరికిపోయిన ప్రేమ..

తిరుపతి రామరాజు కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. వెళ్లి టీ అయిందో లేదో కనుక్కో రమ్మని తిరుపతిని పంపిస్తాడు. వంటగదిలో టీ పెడుతున్న ప్రేమ దగ్గరికి వెళ్లిన తిరుపతి తన గాన గాత్రంతో పాటలు పాడుతూ కనిపిస్తాడు. వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారని అనుకుంటారు. ఇక మొత్తానికి ప్రేమ తిరుపతి కలిసి రామరాజు కోసం టీ పెట్టుకుని తీసుకుని వెళ్తారు. అప్పుడే ధీరజ్ ప్రేమకు ఫోన్ చేసి నువ్వు తోపువని కోతలు కోస్తావు కానీ ఎస్ ఐ ఎగ్జామ్ లో చివరి నుంచి నువ్వే ఫస్ట్ లో ఉన్నావు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది.. ఏంటి ఎస్ ఐ ఎక్సమ్ నేను తప్పేనా అని ప్రేమ అనగానే రామరాజు షాక్ అవుతాడు.. ఏంటమ్మా ఎగ్జామ్ తప్పారు అని అంటుంటే అర్థం కావడం లేదు అని అడుగుతాడు. ఎగ్జామ్ కాదు మామయ్య ఓటీటీలో వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాము అని చెప్పగానే అర్థం కాకుండా బ్లైండ్ గా ఉండిపోతాడు రామరాజు..

స్వామీజీ కాళ్లమీద పడ్డ భాగ్యం…

Advertisement

భాగ్యం శ్రీవల్లి ఆనందరావు ముగ్గురు కలిసి ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అక్కడ తన కూతురు పరిస్థితి గురించి వివరించడానికి ఎన్నో కష్టాలు పడతారు. మొత్తానికి తన కూతురికి ఉన్న పరిస్థితులను గురించి ఆ స్వామీజీతో తంటాలు పడి మరి చెప్పేస్తారు.. ఇక ఆ స్వామీజీ కూడా వీళ్ళ దరిద్రాన్ని చూసి మీరు ఇంత దరిద్రంలో ఉన్నారా అనేసి అంటాడు. ఇక మొత్తానికి మా అల్లుడిని మా అమ్మాయి కొంగు చుట్టూ తిరిగేలాగా చేయాలి అని భాగ్యం రిక్వెస్ట్ చేస్తుంది.

శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అవుతుందా..? 

తన భర్తని తన వైపు తిప్పుకునేందుకు వశీకరణం చేసుకోవాలి అనే స్వామీజీని అడుగుతుంది.. నువ్వు నీ భర్తని నీ వైపు తిప్పుకోవాలి అంటే ఈ తాయత్తుని తీసుకొని వాళ్లకి తాయత్తు ఇస్తాడు. స్వామీజీ ఈ తాయత్తు గనుక మా బావ కడితే ఆయన నా వైపు తిరుగుతాడు కదా అని శ్రీవల్లి అడుగుతుంది.. అవునమ్మా నువ్వు ఏది చెప్తే అదే జరుగుతుంది. ఈ తాయత్తు నీ భర్తకి కడితే నీ చుట్టూ కుక్కపిల్ల లాగా తిరుగుతాడు అని చెప్పగానే శ్రీవల్లి చాలా హ్యాపీగా ఉంటుంది.. ఒకవేళ గనక నా బావ నా చుట్టూ తిరగకపోతే నీకు ఉంటది చుక్కలు చూపిస్తానని శ్రీవల్లి స్వామీజీ కి వార్నింగ్ ఇచ్చి వస్తుంది..

ధీరజ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రేమ.. 

Advertisement

ప్రేమ తను ఫెయిల్ అయిన విషయం తెలుసుకున్న ధీరజ్ వచ్చి తనని ఎక్కడ తిడతాడు అని కంగారు పడిపోతూ ఉంటుంది. అయితే అప్పుడే ఇంటికి వచ్చిన నర్మదా ప్రేమను చూసి ఏమైంది ప్రేమ అని అడగగానే ప్రేమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ధీర చూస్తున్నాడు అక్క నేను తప్పను అని చెప్పగానే ఏంటి నువ్వు నెల తప్పవా..? గుడ్ న్యూస్ చెప్తూ భర్తని ఇంప్రెస్ చేయాలి కానీ ఇలా టెన్షన్ పడుతున్నావ్ ఏంటి అని నర్మద ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే, నర్మదా ఆ మాట అనగానే ప్రేమ చీ మాకు నెల తప్ప అంత దగ్గర ఏమీ లేదు నేను ఎస్ఐ ఎగ్జామ్ లో తప్పిపోయాను అక్క. ధీరజ్ కోపంగా వస్తున్నాడు ఏమంటాడో ఏంటో అని కంగారు పడిపోతున్నాను అని అంటుంది. సరే నువ్వు ఏమి కంగారు పడకు నేను ధీరజ్ తో మాట్లాడుతాను అని నర్మదా.

ధీరజ్ ను మోసం చేసిన నర్మద..

ధీరజ్ తెగిపోయిన తాడుని కడుతున్న ప్రేమను చూసి సూసైడ్ అటెండ్ చేసిందేమో అని కంగారు పడిపోతూ ఉంటాడు. ప్రేమ వాడు నిజంగానే నన్ను చూసి సూసైడ్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాడు అని ఇంకా సార్ రక్తి కట్టించేలా నాటకం మొదలు పెడుతుంది. ధీరజ్ వచ్చి కాపాడినట్లు చూసినా నర్మదా తను ఎగ్జామ్ లో ఫెయిల్ అయినందుకు కాదు తాడు తెగిపోయినందుకు తాడు కడుతుంది అని చెప్పగానే ప్రేమ పై సీరియస్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో డ్రైవరు ధీరజ్ కి దొరుకుతాడు. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: కొడుకుకు గోరుముద్దలు పెట్టిన రాజేశ్వరి.. ఇంట్లో చిచ్చుపెట్టిన పల్లవి .. శ్రీయ దూరం అవుతుందా..?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×